‘‘ద్వారకామాయి పక్కనే ఓ వాడా నిర్మించు. దాని మధ్యలో ఓ మందిరాన్ని కూడా నిర్మించు.”



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

కష్టాల్లో ఉన్నాను, కరుణించమంటే కరిగిపోతారు బాబా. కరుణిస్తారు. సుఖాల్లో ఉన్నాను, ఈ సుఖాల్ని శాశ్వతం చెయ్యి అంటే అలాగేనంటూ ఆశీర్వదిస్తారు బాబా.

ఎవరు ఏది అడిగితే అది కటాక్షిస్తారు. అయితే దానికి సమయం, సందర్భమూ రెండూ ఉంటాయంటారాయన. వేచి చూడాలంటారు. అలాగే ఎవరిని చరితార్థుల్ని చెయ్యాలో, ఎవరిని కీర్తిమంతుల్ని చెయ్యాలో బాబాకి బాగా తెలుసు.

నాగ్‌పూర్‌కి చెందిన బాపూ సాహెబ్‌ బూటీ కోటీశ్వరుడు.గొప్ప దైవభక్తుడు. బాబా గురించి కథలు కథలుగా విన్నాడతను. బాబాని దర్శించుకోవాలనుకున్నాడు. షిరిడీకి చేరుకున్నాడు. బాబాని దర్శించి, చెప్పలేనంత ఆనందాన్ని పొందాడు.

‘‘మీ దర్శన భాగ్యాన్ని మాటల్లో చెప్పలేను బాబా.’’ అన్నాడు బూటీ.‘‘ఇంతకు వెయ్యింతల ఆనందాన్నీ, కీర్తినీ కలిగించేందుకే నిన్ను ఇక్కడకి రప్పించాను.’’ అన్నారు బాబా.

అదృష్టవంతుడు బూటీ. ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నాడో అనుకున్నాడు శ్యామా. అతడు అనుకున్నంతనే జవాబుగా బాబా మాట్లాడేవారు. ఇప్పుడు మాట్లాడలేదు సరికదా, కుడిచేతి చూపుడు వేలు ఎత్తి చూపిస్తూ ‘జాగ్రత్త’ అన్నట్టుగా హెచ్చరించారు బాబా. దాంతో మనసులోకి మరో ఆలోచన రానీయకుండా కూర్చున్నాడు శ్యామా.

‘‘చెప్పండి బాబా! మీరేం చెయ్యమంటే అది చేస్తాను.’’ అన్నాడు బూటీ.‘‘ముందు వాడాకి వెళ్ళి విశ్రాంతి తీసుకో.’’ అన్నారు బాబా.

‘‘బూటీని వాడాకు తీసుకుని వెళ్ళు.’’ శ్యామాని ఆజ్ఞాపించారు బాబా. తీసుకుని వెళ్ళాడు శ్యామా. దీక్షిత్‌వాడాలో బూటీ విశ్రాంతి తీసుకున్నాడు. ఆనాటి నుంచి తరుచూ షిరిడీకి రావడాన్ని అలవాటు చేసుకున్నాడు బూటీ.

షిరిడీలో బాబాని సేవిస్తూ, వారి కథలూ గాథలూ వినసాగాడు. బాబా మహిమల్ని కళ్ళారా చూసి ఆనందించసాగాడు. తప్పనిసరి పరిస్థితుల్లో నాగపూర్‌ వెళ్ళాల్సి వస్తే వెళ్ళి, వెంటనే షిరిడీకి చేరుకునేవాడు బూటీ.

వాడాలో తలదాచుకునేవాడు. ఒకరోజు ఎందుకో అనిపించిందతనికి, తాను షిరిడీలో ఓ భవనాన్ని నిర్మించుకుంటే ఎలా ఉంటుంది? అని. అందుకు బాబా అనుమతి కావాలనుకున్నాడు బూటీ.

అదే ఆలోచనతో ఆ రాత్రి నిద్రపోయాడు. నిద్రలో బూటీకి ఓ కల వచ్చింది. కలలో బాబా కనిపించారు. కనిపించి ఇలా ఆజ్ఞాపించారు.‘‘ద్వారకామాయి పక్కనే ఓ వాడా నిర్మించు. దాని మధ్యలో ఓ మందిరాన్ని కూడా నిర్మించు. దీని కోసమే నిన్నిక్కడకి రప్పించాను.’’చెప్పాల్సింది చెప్పి అదృశ్యమయిపోయారు బాబా.

 మేల్కొని లేచి కూర్చున్నాడు బూటీ. కలగన్నది నిజమయితే బాగుణ్ణు. బాబా అనుమతి లభిస్తే బాగుణ్ణనుకున్నాడతను. అంతలో తోడుగా పడుకుని ఉన్న శ్యామా లేచి కూర్చున్నాడు.

బూటీ మేల్కొని ఉండడాన్ని చూసి ఆనందంగా చెప్పాడిలా.‘‘మీకో సంగతి తెలుసా? ఇప్పుడు నాకు ఓ కల వచ్చింది. బాబా కలలో కనిపించారు. కనిపించి ఏం చెప్పారంటే…’’‘‘ఏం చెప్పారు?’’ ఉత్కంఠగా అడిగాడు బూటీ.

‘‘ద్వారకామాయి పక్కన మందిరంతో పాటుగా మరో భవనం నిర్మించాలట! నిర్మిస్తే ఆ భవనంలో బాబా ఉంటారట.’’ చెప్పాడు శ్యామా.తనకి వచ్చిన కల, శ్యామాకి వచ్చిన కల ఒకటే! ఇద్దరికీ బాబా ఒకే మాట చెప్పారు. అంటే తన ఆలోచనకు బాబా అనుమతి లభించినట్టే అనుకున్నాడు బూటీ. సంతోషించాడు.

తన ఆలోచన, తనకి వచ్చిన కల గురించి కూడా శ్యామాకి చెప్పాడు బూటీ.‘‘మరికనేం! అనుమానం లేదు, బాబా అనుమతి లభించినట్టే.’’ అన్నాడు శ్యామా. ఇద్దరూ నిద్రపోలేదు మరి. ఆనందంగా కాకా దీక్షిత్‌ని లేపారు.

ఇద్దరి కలల గురించీ అతనికి తెలియజేశారు. ద్వారకామాయి పక్కన నిర్మించే భవన నమూనాను తయారు చేయమన్నారు. తయారు చేశాడు దీక్షిత్‌. ముగ్గురూ ఆ నమూనాను చూసి ముచ్చట పడ్డారు.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles