సయ్యద్ జలాలుద్దీన్



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

సద్గురువులలోకెల్ల అగ్రేసరులైన సాయిబాబా వలన ఎందరు పూర్ణ పురుషులయ్యారో స్పష్టంగా తెలియడంలేదు. ప్రోద్దు గ్రుంకిన కొద్దీ నక్షత్రాలొక్కొక్కటే, ఆకాశంలో ప్రకటమైనట్లు, కాలం గడుస్తుంటే శ్రీసాయి వలన పూర్ణులైన వారి సంగతులొక్కక్కటే బయటకొస్తున్నాయి. అటువంటి ఒక పూర్ణ పురుషుడు సయ్యద్ జలాలుద్దీన్ గురించి క్లుప్తంగా మీ కోసం….

సయ్యద్ జలాలుద్దీన్

రెడ్ హిల్స్ (తమిళనాడు) లో ‘స్వామియార్ గా ప్రసిద్ధికెక్కిన యీ మహనీయుడు పెషావర్ లో  జన్మించి, కొంతకాలం సైన్యంలో పనిచేశారు. ఈయన ఉన్మత్త అవస్థలోనున్న అవధూతగా రెడ్ హిల్స్ లో వుండేవారు.

ఈయన ఏ అంగట్లో తినుబండారాలు తీసుకున్నా వారికి ఆ వ్యాపారం అద్భుతంగా జరిగేది.  ఒకరోజు ఆయన వీధి వెంట వెడుతుంటే ఒక పిచ్చివాడు ఎదురయ్యాడు. ఆయన అతని చెంపమీద కొట్టారు. వెంటనే అతనికి పిచ్చి తగ్గిపోయింది.

ఎందరెందరో రోగులు ఆయన దగ్గరకొచ్చేవారు. ఆయన ఒక్కసారి రోగికేసి తీవ్రంగా చూచి, ఏదో గొణుగుతూ ఆకాశంకేసి చూచేవారు. వెంటనే ఆ రోగం తగ్గవలసిందే!

ఆయన 1955 సంవత్సరము  లో బుదూర్ అనే గ్రామం వద్ద సర్వితోటలో నివసించారు. వర్షాలు లేవని రైతులు ప్రాధేయపడితే ఆయన ఆకాశంకేసి చూచి ఏమో గొణిగేవారు. కొద్దిసేపట్లో తృప్తిగా వర్షం పడేది.  ఒకసారి 10 రోజులు వర్షం కురిసి, అంతా జలమయమై, ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.

ఆయన సన్నిధిలోవున్న, రామానుజం శెట్టియార్, కాశీ, మునుస్వామి, ఘనశ్యామ్ సింగులు తమకు వేడి వేడి బిర్యానీ పెట్టించమన్నారు. ఆయన పక పకా నవ్వి ఆకాశంకేసి చూచారు. అంతలో కుటీరం ముందు ఒక జట్కా ఆగింది. ఇద్దరు వ్యక్తులు పెద్ద పాత్రనిండా వేడిగా నేతితో వండిన చికెన్ బిర్యానీ, అరటి ఆకులూ తెచ్చిపెట్టి, త్వరగా పాత్ర ఖాళీచేసివ్వమన్నారు.

భక్తులు వరమడుగుతే, “మేమెక్కడ నుంచి వస్తే మీకెందుకు? మీరు కోరినది లభించింది కదా?” అన్నారు. భక్తులు విస్తుపోయి, తృప్తిగా తిన్నారు. అలాగే టీ త్రాగే సమయమైంది. కుటీరంలో టీ పొడుము, చెక్కెర వున్నాయి గాని పాలులేవు. అనుకోగానే అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి 2 లీటర్ల పాలుపోసి వెళ్ళిపోయాడు.

వీరిలో ఘనశ్యాంసింగ్ ప్రతిరోజూ అర్థరాత్రి వరకూ ఆ ఫకీరు గారి సేవచేస్తుండేవాడు. జీవితాంతము బ్రహ్మచారిగా వారి సేవలోనే వుండాలని ఆశించాడు. ఒకరాత్రి ఆ ఫకీరు నవ్వి, “నీకు పెళ్ళవుతుంది. ముగురు బిడ్డలు కలుతారు” అన్నారు. అలానే జరిగింది.

అక్టోబరు 28, 1964 సాయంత్రం 7 గంటలకు ఆ ఫకీరు, “ఆవో జిబ్రాయిల్ ఏ మేరా ఆర్డర్ హై!” (దేవదూత అయిన ఓ జిబ్రాయిలూ, ఇటురా! ఇది నా ఆజ్ఞ!”) అని పెద్దగా కేకలేశారు. ఇక 4 గంటలలో తాము సమాధి కాబోతున్నామని చెప్పారు. సరిగా 11-45 గంకు “అల్లాహో” అని ఏడుసార్లు స్మరించి భగవంతునిలో ఐక్యమయ్యారు.

ఒకరోజు ఈ ఫకీరును, “మీ గురువెవరు” అని అడిగాడు ఘనశ్యామ్. రేపు చెబుతామన్నారు. మరుసటి ఉదయమే 8 గం.లకు అతనిని బయటికెళ్ళి సూర్యుని చూడమని సైగ చేశారు. చూడగా ఆ బింబంలో 5నిలపాటు ద్వారకామాయిలో కూర్చున్న సాయిబాబా ముఖం దర్శనమిచ్చింది. ఆశ్చర్యంతో ప్రణమిల్లిన ఘనశ్యామ్ కు, “నిన్నటి నీ ప్రశ్నకు సమాధానమిదే” అన్నటు చిన్న సైగచేసి నవ్వారా ఫకీరు!

రేపు మరో పూర్ణ పురుషుడు శ్రీ శాంతావన్ జీ మహారాజ్ గురించి……

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles