Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
సద్గురువులలోకెల్ల అగ్రేసరులైన సాయిబాబా వలన ఎందరు పూర్ణ పురుషులయ్యారో స్పష్టంగా తెలియడంలేదు. ప్రోద్దు గ్రుంకిన కొద్దీ నక్షత్రాలొక్కొక్కటే, ఆకాశంలో ప్రకటమైనట్లు, కాలం గడుస్తుంటే శ్రీసాయి వలన పూర్ణులైన వారి సంగతులొక్కక్కటే బయటకొస్తున్నాయి. అటువంటి ఒక పూర్ణ పురుషుడు శ్రీ శాంతావన్ జీ మహారాజ్ గురించి క్లుప్తంగా మీ కోసం….
శ్రీ శాంతావన్ జీ మహారాజ్
వీరు గుజరాత్లో గొప్ప మహనీయులు. వీరు సాధకదశలో చాలాకాలం హిమాలయాలలో వుండి తర్వాత గంగా తీరంలో బ్రహ్మచారిగా 30 సం.లు తీవ్రమైన గాయత్రీ ఉపాసనలో గడిపారు. వారొకసారి తమ అనుభవమొకటి చెప్పారు.
“నేనొకప్పుడు పాలనపురం వద్ద బలరామ క్షేత్రంలో గాయత్రి సాధన చేస్తున్నాను. ఒకసారి మనస్సెంతకూ ఏకాగ్రమవలేదన్న నిరాశతో నదిలో దూకి ఆత్మహత్య చేసుకోదలచాను. ఒక శివ మందిరంలో దేవిని ప్రార్ధించి, గాయత్రిని స్మరించి నదిలో దూకబోతుండగా
ఒక ఫకీరు నావద్దకొచ్చారు. ఎంతో తేజోవంతమైన కళ్ళు, గడ్డము గల ఆయనెంతో మధురంగా నవ్వుతూ వచ్చి నా చేయి పటుకొని తమ వెంట రమ్మన్నారు. నేను మంత్ర ముగ్దుడనై వారి వెనుకనే నడచాను. వారు నాకు ‘కలోల్ గ్రామానికి టికెటు యిచ్చి అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు.
ఆయనెవరో నాకర్థం గాలేదు. కొంతకాలం తర్వాత నేను తరచూ హిమాలయాలకు వెళ్ళి, చివరకు నర్మదాతీరంలోని ‘కరణూలీ’ లో స్థిరపడ్డాను. పై దర్శనమైన 30 సంuల తర్వాత 1976లో సూరత్లోని సాయిబాబా మందిరంలో దత్త జయంతికి గాయత్రి యజ్ఞము చేయమని నన్ను భక్తులాహ్వానించారు. నేనంతవరకూ ఏ సాయిబాబా మందిరమూ చూడలేదు.
అక్కడొక రాత్రి బాబా స్పష్టంగా కలలో కనిపించి, “నన్ను మరిచి పోయావా? 30 సం||ల క్రిందట బలరామక్షేత్రంలో నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతుంటే నిన్ను రక్షించినదెవరు?’ అన్నారు. నాకెంతో ఆనందం కల్గింది.
మరురోజు నేను ధ్యానానికి కూర్చోగానే గాయత్రీదేవి బదులు నాకు సాయిబాబా దర్శనమిచ్చి ప్రగాఢమైన ఆనందమనుగ్రహించారు. మరింత భక్తి శ్రద్ధలతో ఆ మందిరంలో సాయిపూజ, గాయత్రీ యజ్ఞమూ ముగించాను.
రేపు మరో పూర్ణ పురుషుడు శ్రీ గజానన్ మహరాజ్ గురించి……
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ గుంటూరు)
- ఉపాసనీ మహారాజ్ విగ్రహం …..సాయి@366 జనవరి 13….Audio
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- డైరీ 26 వ భాగం
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- డైరీ 23 వ భాగం
- శ్రీ సాయి దత్తావతారం మూడవ బాగం – శ్రీ పాద శ్రీ వల్లభుడు, సాయి ఒక్కరే
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments