శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- డైరీ 23 వ భాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

శ్రీ జీ.ఎస్.ఖపర్డే డైరీ – 23

19.01.1912 శుక్రవారమ్

ఈ రోజు చాలా విచారకరమయిన రోజు.  ఈ రోజు చాలా తొందరగా నిద్రలేచి ప్రార్ధన పూర్తిచేసుకునేటప్పటికి సూర్యోదయానికింకా గంట పైగా సమయం ఉంది.  అందువల్ల మళ్ళీ పడుకుని, బాపూసాహెబ్ లేపక కాకడ ఆరతి వేళకి లేచాను.  తెల్లవారుఝామున నాలుగు గంటలకు మేఘా చనిపోయాడని దీక్షిత్ కాకా చెప్పాడు.  కాకడ ఆరతి జరిగింది కాని సాయిమహరాజ్ తమ ముఖం చూపలేదు, కళ్ళు తెరచి కూడా చూడలేదు.  దయతో చూసే చూపులు కూడా ప్రసరించలేదు.

మేము తిరిగి వచ్చిన తరువాత మేఘా అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిగాయి. మేఘా శరీరాన్ని బయటకు తీసుకురాగానే సాయిబాబా వచ్చారు.  అతని మరణానికి బిగ్గరగా శోకించారు.  ఆయన కంఠంలో నుండి వచ్చిన రోదన అందరినీ కంట తడి పెట్టించింది.  ఆయన శవం వెంట గ్రామం వీధి మలుపు దాకా వెళ్ళి ఆ తరువాత తాము మామూలుగా నడిచే త్రోవలో వెళ్ళిపోయారు.  మేఘా శరీరాన్ని ఒక పెద్ద చెట్టు క్రింద ఉంచి అక్కడ దహన సంస్కారాలు చేశారు. సాయిబాబా అతని మరణానికి శోకిస్తున్నట్లు దూరంనుంచి కూడా స్పష్టంగా వినిపించింది.  ఆరతి సమయంలో చేతులు ఊపినట్లు, అతనికి వీడ్కోలు చెబుతున్నట్లుగా చేతులు ఊపుతూ కనిపించారు. కట్టెలు బాగా ఎండి ఉండటంతో మంటలు చాలా పైకి లేచాయి.  దీక్షిత్ కాకా, నేను, బాపూసాహెబ్ జోగ్, ఉపాసనీ, దాదా కేల్కర్, అందరం, సాయిబాబా మేఘా శవాన్ని చూసి అతని గుండెలమీద భుజాలమీద, పాదాలమీద తాకటం వల్ల, మేఘా ధన్యుడయ్యాడని కీర్తించాము.

అంత్యక్రియలు పూర్తయిన తరువాత మేము ప్రార్ధనకు కూర్చోవలసింది.  కాని బాపూ సాహెబ్ జోగ్ రావటంతో అతనితో మాట్లాడుతూ కూర్చున్నాను.  ఆ తరువాత నేను సాయిబాబాను చూడటానికి వెళ్ళాను.  ఆయన మధ్యాహ్నమంతా ఎలా గడిపావని అడిగారు.  ఆ సమయమంతా నేను మాట్లాడుతూ వ్యర్ధంగా కాలక్షేపం చేశానని చెప్పి తప్పు ఒప్పుకుని చాలా బాధపడ్డాను. ఇది నాకొక గుణపాఠం.  మేఘా మరణిస్తాడని మూడు రోజుల క్రితమే సాయిబాబా ఏవిధంగా ముందుగానే చెప్పారో ఆ మాటలను  “ఇది మేఘా ఇచ్చే చివరి ఆరతి” గుర్తు తెచ్చుకున్నాను. మేఘా తన చివరి సేవను పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్నందుకు ఏమని భావించాడో, తన గురువుగా భావించిన సాఠేను చూడలేకపోయినందుకు ఎంతగా కన్నీరు పెట్టుకున్నాడో, సాయిబాబా గారి ఆవులని విడిచి పెట్టమని అతను ఎలా ఆదేశించాడో అన్నీ గుర్తు చేసుకున్నాను.  అతనెప్పుడూ ఏకోరికా కోరలేదు.   మేమంతా అతని అమితమయిన భక్తి భావ జీవితాన్ని కొనియాడాము.  నేను అర్ధరహితమయిన మాటలు వింటూ, ప్రార్ధన చేసుకుని ప్రశాంతంగా ఉండనందుకు చాలా బాధపడ్డాను.  భీష్మ, మా అబ్బాయి బలవంత్ ఇద్దరికీ బాగుండలేదు. అందుచేత భజన జరగలేదు.  రాత్రి దీక్షిత్ కాకా రామాయణం చదివాడు.  గుప్తే, అతని సోదరుడు వారి కుటుంబం ఈ రోజు ఉదయం బొంబాయి వెళ్ళిపోయారు.

 రేపు తరువాయి భాగం….

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles