Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
శ్రీ జీ.ఎస్.ఖపర్డే డైరీ – 22
18.01.1912 గురువారమ్
ఈ రోజు వ్రాయవలసింది చాలా ఉంది. ఈ రోజు చాలా తొందరగా లేచి, ప్రార్ధన చేసుకున్నాను. సూర్యోదయానికి ఇంకా గంట సమయం ఉండటం వల్ల, మళ్ళీ పడుకుని సూర్యోదయం వేళ లేచాను. నేను, ఉపాసనీ, బాపూ సాహెబ్ జోగ్, భీష్మ, పరమామృతం చదివాము. తహసిల్దార్ ప్రహ్లాద్ అంబాదాస్, పటేల్ అతని అనుచరుడు (లింగాయత్) వారి స్వస్థలాలకి తిరిగి వెళ్ళిపోయారు. చివరి ఇద్దరికీ సరిగా బయలుదేరే ముందు అనుమతి లభించింది. మేము సాయిబాబా బయటకు వెళ్ళడం, తిరిగి మసీదుకు రావడం చూశాము. ఆయన నన్నెంతో ఆదరించి, నేను ఆయనకు సేవ చేస్తున్నపుడు, రెండు మూడు కధలు చెప్పారు నాకు.
ఆయన డబ్బు తీసుకోవడానికి చాలామంది వచ్చారట. ఆయన వారినెప్పుడూ ఆపకుండా తీసుకువెళ్ళనిచ్చేవారట. ఆయన వారి పేర్లు గుర్తుంచుకొని, వారినే అనుసరిస్తూ ఉండేవారట. వారు భోజనాలకి వెళ్ళినపుడు, తాను వారిని చంపి, తన డబ్బును తిరిగి తెచ్చుకున్నారట. మరొక కధలో ఒక గ్రుడ్డివాడు ఉన్నాడు. అతను తకియా దగ్గర ఉండేవాడు. ఒకతను అతని భార్యను ప్రలోభపెట్టి, ఆఖరికి ఆ గ్రుడ్డివానిని హత్య చేశాడు. చావడి దగ్గరికి నాలుగువందల మంది సమావేశమయి అతను చేసిన పనిని ఖండించారు. వారతనికి శిరచ్చేదం చేయవలసిందేనని ఆదేశించారు. గ్రామ తలారి అది తన ఉద్యోగ భాధ్యతగా కాకుండా మనసులో ఏదో ఉద్దేశ్యాన్ని పెట్టుకుని ఉరి తీశాడు. అందుచేత ఆ హంతకుడు మరుజన్మలో ఆ తలారికి కొడుకుగా జన్మించాడు.
ఆయన మరొక కధను ప్రారంభించారు. ఈలోపులో ఒక అపరిచిత ఫకీరు వచ్చి సాయిబాబా పాదలను తాకాడు. సాయిబాబాకి చాలా కోపం వచ్చింది. కాకపోతె కాస్తంత కోపాన్ని ప్రదర్శించి, గట్టిగా కదలకుండా పట్టిన పట్టు విడవకుండా, ప్రశాంతంగా ఉన్న ఆ ఫకీరును విదిల్చి కొట్టారు. ఆఖరికి అతను బయటకు వెళ్ళి, బయట ప్రహరీ గోడ దగ్గర నిలబడ్డాడు. సాయిబాబా కోపంతో ఆరతి పళ్ళాలని, భక్తులు తెచ్చిన నైవేద్యాలతో నిండుగా ఉన్న పాత్రలని విసరికొట్టారు. ఆయన రామమారుతి బువాను పైకెత్తి పట్టుకున్నారు. అపుడు తనకెంతో ఆనందం, ఏవో ఊర్ధ్వ లోకాలకు వెడుతున్నట్లుగా భావన కలిగిందని ఆ తరువాత చెప్పాడు. భాగ్య అనే అతని పట్ల, ఒక గ్రామీణుడి పట్ల సాయిమహరాజ్ మొరటుగా ప్రవర్తించారు. సీతారామ్ ఆరతి తీసుకు వచ్చాడు. మేము ఎప్పటిలాగే ఆరతి ఇచ్చాము. కాని కాస్త హడావిడిగా పూర్తి చేశాము. మహల్సాపతి కొడుకు మార్తాండ్ సమయస్ఫూర్తితో వ్యవహరించి, ఎటువంటి గందరగోళం లేకుండా ఆరతి ఎప్పుడు ప్రారంభించాలో ఎప్పుడు పూర్తి చేయాలో అన్నీ సూచనలు చేశాడు. సాయిబాబా తన మామూలు స్థానంనుండి బయటకు రాగానే అతనావిధంగా మార్గదర్శకం వహించాడు. ఆరతి పూర్తయే ముందు బాబా తమ యధాస్థానానికి వచ్చారు. ఎప్పటిలాగే అందరూ వెళ్ళారు. ఊదీ ఒక్కొక్కరికీ కాకుండా అందరికీ ఒకేసారి సామూహికంగా పంచారు. ఆయన వాస్తవంగా కోపంగా లేరు కాని జరిగినదంతా ఒక లీలగా చూపించారు.
ఈ మొత్తం వ్యవహారం వల్ల చాలా ఆలస్యమయింది. తాత్యా పాటిల్ తన తండ్రి సంవత్సరీకంలో భాగంగా అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడంతో పూర్తయేటప్పటికి సాయంత్రం 6.30 అయింది. దాని తరువాత ఏ పనీ చేయడానికి సమయం లేకపోయింది. సాయి మహరాజ్ సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్ళేటపుడు దర్శించుకోవడానికి వెళ్ళాము. ఆయన ఎప్పటిలాగే బయటకు వచ్చి నడుస్తుండగా మేము నమస్కరించుకున్నాము. వాడాలో ఎప్పుడూ జరిగే విధంగానే ఆరతి జరిగింది. మేఘా లేచి నిలబడలేనంతగా జబ్బు పడ్డాడు. ఆ రాత్రి అతనికి గడవదని బాబా చెప్పారు. ఆ సాయంత్రం చావడి ఉత్సవానికి నిలబడ్డాము. ఎప్పటిలాగే నేను నెమలీకల విసన కఱ్ఱను పట్టుకున్నాను. అన్నీ సక్రమంగా జరిగాయి. సీతారమ్ ఆరతి ఇచ్చాడు. రాత్రి భీష్మ భజన, దీక్షిత్ రామాయణం జరిగాయి.
పీ.ఎస్. నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు సాయిబాబా కోపంతో అన్న మాటల ప్రవాహంలో మా అబ్బాయి బల్వంతును రక్షించామన్నారు, ఆ తరువాత పదే పదే ఒక మాటన్నారు “ఫకీర్, దాదా సాహెబ్ ను (అర్ధం – నన్ను) చంపాలనుకున్నాడు కాని నేను అనుమతించలేదు” ఆయన ఇంకొక పేరు చెప్పారు గాని దానిని నేను గుర్తు చేసుకోలేకపోతున్నాను.
రేపు తరువాయి భాగం….
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- డైరీ 23 వ భాగం
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- డైరీ 26 వ భాగం
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- డైరీ 21 వ భాగం
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- డైరీ 27 వ భాగం
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- డైరీ 20 వ భాగం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments