Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
నిన్న శ్రీ గాడ్గే మహారాజ్ గారిని సాయి అనుగ్రహించడం చదివారు కదా! ఇప్పుడు శ్రీ గాడ్గే మహారాజ్ గారి పూర్వ జన్మకు సంబందించిన వృత్తాంతం ద్వారా శ్రీ పాద శ్రీ వల్లభుడు, సాయి ఒక్కరే అని అర్ధం అవుతుంది. ఆ వృత్తాంతం శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం ఆధారంగా తెలియజేస్తున్నాను.
శ్రీ పాదులు వారి తాతా గారైన బాపనార్యుల గారింట్లో తిరుమలదాసు అను చాకలి ఉండేవారు. అతను మరి ఎవరో కాదు శ్రీ గాడ్గే మహారాజ్ గారే. ఆ తిరుమలదాసు గారు శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం లో తెలియజేసిన వృత్తాంతాన్ని అయన మాటలలో చదవండి.
“ఒకసారి శ్రీ పాదులు వారి తాతగారి ఇంటికి ఉతికిన బట్టలను తిసుకోనిపోయితిని. శ్రీ పాదుల వారిని వారి తల్లిగారి మేనమామ గారు ఎత్తుకొని ఆడించుచుండిరి. దత్త దిగంబర! దత్త దిగంబర! దత్త దిగంబర అవదూత! అని వారు పాడుచుండిరి.
అప్పుడు శ్రీ పాదుల వారు రెండు సంవత్సరముల బాలుడు. వారు కేరింతలు కొట్టుచు ఆడుచుండిరి. ఆ దృశ్యం నయనమనోహరంగా ఉండెను. అంతట నేను శ్రీపాద వల్లభ దత్త దిగంబర! అంటిని. అంతట శ్రీపాదుల వారు నృసింహ సరస్వతి దత్త దిగంబర! అనిరి.
తాము సాక్షాత్ దత్త ప్రభువులుగా గతంలో అవతరించితిమనియు, ప్రస్తుతము శ్రీపాద శ్రీ వల్లభ నామమున తెరపై నున్నామనియు, తెరమరుగయిన తరువాత నృసింహ సరస్వతిగా రానున్నమనియు శ్రీ పాదులు తమదైన శైలిలో భోదపరిచిరి.
సమర్ధ సద్గురువే షిరిడి సాయిబాబా గా అవతరించుట
శ్రీ పాదుల వారు, “తాతా! నేను నృసింహ సరస్వతిగా మరాఠ దేశమున అవతరించదలచితిని. తిరుమలదాసు ను కూడా మరాఠ దేశమునకు రమ్మనుచుంటిని అనిరి.
అంతట నేను “నేను ఎప్పుడు ఏ రూపంలో ఏ జన్మములో ఎచ్చటనున్ననూ, నన్ను దయతో కనిపెట్టి ఉండవలసిన బాధ్యత తమరిది. నాకు మీ యొక్క బాలకృష్ణుని రుపమునండు మక్కువ ఎక్కువ” అంటిని.
అప్పుడు శ్రీ పాదుల వారు “తిరుమలదాసూ! నీవు మరాఠ దేశమున గాడ్గే మహారాజ్ అను పేరుతొ రజక కులమున జన్మించెదవు గాక! దీన దళిత దుఃఖితుల సేవలో పునితుడవయ్యేడవు గాక!
దీశిలానగరమున “సాయిబాబా” నామమున యవన వేషమున నా యొక్క సమర్ధ సద్గురు అవతారం రానున్నది. నీవు తప్పక యవన వేషమున నున్న నా సమర్ధ సద్గురు అవతారం యొక్క అనుగ్రహమును పొందెదవు గాక!
నీకు బాలకృష్ణుని రూపము నందు మక్కువ గనుక “గోపాల! గోపాలా! దేవకీనందన గోపాలా!” అను నామమును జపించెదవుగాక! నీ మనోనేత్రము నందు సదా నేను నీకు దర్శనమిచ్చెదను.
నీవు ఈ శరీర పతనాంతరము కొంతకాలం హిరణ్య లోకమునందుండి ఆ పైన గాడ్గే మహారాజ్ గా లోకహితార్ధము చేయుము. ఇదే నీకు నా వరము!నా అభయము!” అని నన్ను దీవించిరి”.
ఈ వృత్తాంతం ఆధారంగా నాటి శ్రీ పాద శ్రీ వల్లభులు నేటి శ్రీ సాయిబాబా స్పష్టంగా అర్ధమగుచున్నది కదా!
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీ సాయి దత్తావతారం మొదటి బాగం…
- శ్రీ సాయి దత్తావతారం రెండవ బాగం – శ్రీ గాడ్గే మహరాజ్ ని శ్రీ సాయి అనుగ్రహించుట
- శ్రీ దత్త శరణం మమ…. మహనీయులు – 2020… సెప్టెంబరు 27
- శ్రీ షిరిడి సాయిబాబా చాలీసా(షిరిడీవాస సాయిప్రభో)…Audio
- శ్రీ సాయి లీలామృత ధార – శ్రీ షిరిడీ సాయి విభూతి లీల – మొదటి బాగం….
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “శ్రీ సాయి దత్తావతారం మూడవ బాగం – శ్రీ పాద శ్రీ వల్లభుడు, సాయి ఒక్కరే”
kishore Babu
October 7, 2017 at 12:25 amhttp://saileelas.com/m/sounds/view/03-chapterMp3
03 chapterMp3
శ్రీ సాయి సచ్చరిత్రము… తెలుగు OVI TO OVI ….మూడవ అధ్యాయం ..మరాఠి మూలం శ్రీ అన్నాసాహెబ్ దాభోల్కర్ …. తెలుగు అనువాదం కుమారి మణెమ్మ ….. ధ్వని అనుకరణ శ్రీ శ్రీనివాస ప్రసాద్