Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి….
మొదటిసారి షిరిడీయాత్ర : అనుభవాల మాలిక రెండవ బాగం…
9 గురువారముల వ్రత మహాత్మ్యం
శ్రీ రామ కృష్ణ గారి థర్మ పత్ని శ్రీమతి శారద గారు కూడా గొప్ప బాబా భక్తురాలు. ఆవిడ ఒక కోరిక కోసం 9 గురువారములూ వ్రతం చేసి, అది తీరితే మరొకసారి వ్రతం చేస్తానని అనుకున్నారు. ఆమె కోరిక తీరింది. తరువాత మరలా, 9 గురువారముల వ్రతము ప్రారంభించి 26.05.2011 కి 9 గురువారములు నిర్విఘ్నంగా పూర్తి అయ్యాయి.
బాబా కి నైవేద్యం పెట్టడానికి యింటిలో పులిహోర కలుపుతున్నారు. యింతలో ఒక ముసలాయన వచ్చి డబ్బులివ్వు అనగా, యెవరో వచ్చారని చూద్దామని శారద గారు బయటకు వచ్చారు. అప్పుడా ముసలాయన ఈమెతో, “ఊఊ డబ్బులివ్వూ, రెండు రూపాయలు, రెండు రూపాయలు అంటూ చేతివేళ్ళు రెండు చూపిస్తూ డబ్బులివ్వమని” అన్నారు.
ఈమె లోపలకు వెళ్ళి పరసులో చూడగా సరిగా రెండు రూపాయల నాణెం ఉందిట. ఆ రెండు రూపాయలను ఆ వచ్చిన ఆయనకి ఇచ్చి, ఆయనకి కొంచెం ప్రసాదం ఇద్దామనే ఉద్దేశ్యంతో ఉండు అని లోపలకి వెళ్ళారు.
కాని బయటకి వచ్చి చూసేటప్పటికి ఆ ముసలతను కనపడలేదు. ఆ మనిషిని యింతకుముందుకూడా చూడలేదుట. అలా వ్రతం పూర్తవగానే బాబావారు దక్షిణ కూడా అడిగి మరీ తీసుకున్నారు.
మనలో శ్రథ్థ భక్తి విశ్వాసం ఉంటే బాబా తప్పకుండా వచ్చి తీరతారని ఆ అనుభవం ద్వారా మనకి తెలుస్తోంది.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- మొదటిసారి షిరిడీయాత్ర : అనుభవాల మాలిక మొదటి బాగం…
- నవ గురువారం వ్రతం చేసుకోవాలి అని సంకల్పించిన భక్తురాలి కోర్కెను తీర్చిన బాబా వారు
- అబ్దుల్ బాబా రెండవ బాగం…..
- బాబా మాతోనే ఉన్నారు మొదటి బాగం..
- మన ప్రశ్న – బాబా సమాధానము ( http://www.yoursaibaba.com) రెండవ బాగం….
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments