Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
బాబా మాతోనే ఉన్నారు మొదటి బాగం..
ఈ రోజు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక సాయి బిడ్డ అనుభవాన్ని వివరిస్తాను.
మన బాబా మన చెంత ఉంటే మనం దేనికీ భయపడనక్కరలేదు. అందుకే బాబా వారు నిరంతరం నామ స్మరణ చేయమని చెప్పారు. మనము ఏపని చేస్తున్నా కూడా “సాయిరాం, సాయిరాం” అని గాని, “ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి” అని గాని, “సాయి, సాయి” అని గాని నిరంతరం మన మనసులో ఆయన నామ స్మరణ జరుగుతూనే ఉండాలి. నామస్మరణే మనకి శ్రీరామరక్ష. ఆఖరికి మనం స్నానాలగదిలో స్నానం చేస్తున్నపుడు కూడా సాయి నామస్మరణ చేసుకోవచ్చు.
బాబా తో నా అనుభవాలను పంచుకోవడానికి నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మూడవసారి నా అనుభవాలను బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాను. నా బాబా దయ లేనిదే ఏదీ సంభవం కాదు. కనీసం నా అనుభవాలను ఏమైనా వ్రాయలనుకున్నా బాబా నే సూత్రధారిగా వుండి నా చేత వ్రాయిస్తాడు. నేను వ్రాసే ప్రతి అక్షరం బాబా నోటి నుండి వెలువడినవే. బాబా నే జగన్నాటక సూత్రధారి. ప్రతీదీ ఆయన చేత నడిపించబడుతుంది.
మన జీవితంలో సాయి లీలలకు అంతమనేది వుండదు. ఎల్లవేళలా మనతో పాటే ఉండి మనం ఏమయినా తప్పులు చేసి ఉంటే వాటిని సరిదిద్దుతూ మనల్ని సరియైన దారిలో నడిపిస్తుంటారు. నా జీవితంలో బాబా గురించి, ఆయన ఏమిటో చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు.
నా బాబా గురించి ఏమైనా వ్రాయాలని అనుకున్నప్పుడల్లా మాటలు రాక నిశ్చేష్టురాలినైపోతాను. నా జీవితం అంతా బాబా మరియు బాబా లీలలతో నిండి పోయింది. దేని గురించి చెప్పాలో నాకు పాలు పోవడం లేదు. కాని ఈ రోజు కొన్ని సంఘటనలు చెప్పడానికి ప్రయత్నిస్తాను.
నా బాబా ఎంత దయార్ద్రహృదయుడంటే, నేను ఏమి అడిగినా అది వెంటనే ఇచ్చేస్తాడు. నేను, మా చెల్లి ఇద్దరం ఒకరికొకరం బాగా సన్నిహితంగా ఉంటాము. మేము అక్కచెల్లెళ్ళలాగ కాకుండా మంచి స్నేహితుల లాగ ఉంటాము.
కొంతకాలం క్రిందట మా చెల్లి పెళ్ళి గురించి ఇంట్లో టెన్షన్ గా ఉండేది. ఏదీ కూడా అనుకున్నట్లు సరియైన పద్దతిలో జరిగేది కాదు. తనకు అస్సలు ఏ సంబంధం కుదిరేది కాదు. ఈ విషయం లో నాకు, మా చెల్లి కి చిన్న పాటి వివాదము జరిగి, మా ఇద్దరి మధ్య భేదాభిప్రాయము వచ్చింది. మేము ఇద్దరము చాలాకాలం మాట్లాడుకోలేదు. తనకోసం ప్రతి క్షణం ప్రార్థించేదాన్ని. తనకి మంచి జీవిత భాగస్వామిని ఇమ్మని బాబాని ప్రార్థించేదాన్ని.
కొంతకాలం తర్వాత నా భర్త కల్పించుకోవడం తో నేను, మా చెల్లి మట్లాడుకోవడం మొదలుపెట్టాము. నేను మా చెల్లికి బాబా నవ గురువార వ్రతం చేయమని చెప్పాను. నేను కూడ అదే సమయానికి నవగురువారవ్రతం చేయాలని అనుకున్నాను. మేము ఇద్దరం ఒకేసారి వ్రతం మొదలు పెట్టాము. బాబా మా ప్రార్థలను విన్నారు. వ్రతం మూడవ వారం వచ్చేసరికి మా చెల్లికి ఒక మంచి సంబంధం వచ్చింది మరియు వ్రతం ఆఖరి వారానికల్లా (తొమ్మిదవ వారం) సంబంధం కుదిరి చెల్లి పెళ్ళి జరిగింది.
బాబా దయ వలన మా చెల్లికి మంచివాడు, అర్థం చేసుకునే భర్త దొరికాడు. అంతా బాబా దయ వలన బాగా జరిగింది. మా చెల్లి గర్భవతి అయ్యింది. ఏప్రిల్ లో చెల్లి కి డెలివరి డ్యూడేట్ అని చెప్పారు. నేను చాలా ఆనందపడ్డాను. తన డెలివరి డ్యూడేట్ దగ్గరికి వచ్చేకొద్దీ మా అందరికీ చాలా టెన్షన్ గా వుండేది తన డెలివరి గురించి.
డాక్టర్ చెప్పిన డ్యూడేట్ దాటి పోయింది. తనకి ఎటువంటి నొప్పులు మొదలవలేదు. కాబట్టి తనకి సి-సెక్షన్(సిజేరియన్) చెయ్యాల్సి వస్తుందేమోనని మేము అందరం చాలా భయపడ్డాము. దానికి మేము తయారుగా కూడా లేము. మేము అస్సలు సిజేరియన్ చెయ్యాల్సి వస్తుందని అనుకోలేదు. డాక్టర్ కూడ అనుకున్న టైం దాటిపోతుంది కాబట్టి సి-సెక్షన్ కి వెళ్ళాల్సి వస్తుందని చెప్పారు. కాని బాబా అనే గొప్ప శక్తి మనతో ఉండగా ఏ క్షణంలో అయినా అద్భుతం జరగవచ్చు. ఇక్కడ కూడ అదే జరిగింది.
హాస్పిటల్ లో చేరినప్పటి నుండి మా చెల్లి బాబా ని తలచుకుంటూనే ఉంది. ఆశ్చర్యంగా ఆపరేషన్ థియేటర్ లో ఒక నిలువెత్తు బాబా పటమును చూసింది.
రేపు తరువాయి బాగం…..
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా మాతోనే ఉన్నారు రెండవ బాగం..
- బాబా ఉన్నారు మొదటి బాగం…
- బాబా ఉన్నారు రెండవ బాగం…
- సాయి బాబా చూపిన మార్గము మొదటి బాగం…
- బాబా సదా, సర్వదా, నా చెల్లి వెనకే ఉండి, దానికి పండంటి కొడుకు పుట్టేవరకు తోడుగా వున్నారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “బాబా మాతోనే ఉన్నారు మొదటి బాగం..”
సాయినాథుని ప్రణతి
March 1, 2017 at 8:27 amఈ లీల చదువు తుంటె నాకు చాలా హ్యపిగా వుంది.నేను మా చెల్లి పెల్లిలో ఎంతో ఆనందించాను తన పెళ్ళి కూడ చాలా ఆనందంగా జరిగింది. మా చెల్లి పెద్దవాల మాటవినకుండ తన ఇష్టప్రకారం పెళ్ళి చేసుకుంది.మా అమ్మ ఎప్పుడు కలవర పడెది మా చెల్లి పెళ్ళి జరగడం లేదు తన వయస్సులో వున వాలకు పెళ్ళి జరిగిపొతుంది అని. మా చెల్లలి పెల్లి 27 – 2 -2017 లో జరిగింది. పెళ్ళికి నేను వెలడానికి కూడ ఎనో అడంకులు ఎదురైయాయి. కాని మన తండ్రి బాబా అని అడంకులను తొలగించి పెళ్ళికి వెలెలా చేసారు. ఆ పెళ్ళి చూసి నేను ఎంత ఆనందించానో చెపలేను .మా చెల్లలి అత్తగారి మర్యదలు వారి పలకరింపు,ఇంకా ఎనో .చాలా హ్యపిగా అనిపించింది .బాబా దయ్యవల నాకు మాదిరిగానే తనకు కూడ చకటి కుటుంబాని తనకు తగ్గిన భర్తను ప్రసాదించారు బాబా అనిపించింది.ఎంతో ఆనందించాను. బాబా మాట మనం వినకపొయిన తన బిడ్డలమైన మనలను ఎలవేలలా ప్రేమిస్తు ఆయన రక్షణను మనకు అందిస్తు వుంటారనిపించింది.
Sai Suresh
March 1, 2017 at 9:14 amఅవును సాయి అంతులేని బాబా ప్రేమ మనపై సదా ఉంటుంది.