‘‘దేహాన్ని ధరించినప్పుడు దేవుడికయినా బాధ తప్పదు.’’



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

ఒకసారి ఏ భక్తుడి బాధో తను స్వీకరించి, బాబా ఉబ్బసంతో బాధపడసాగారు. ఊపిరి పీల్చుకోవడం కష్టమనిపించి, మెలికలు తిరిగిపోసాగారు.

ఆ స్థితిలో కూడా వచ్చిన భక్తులను ఆశీర్వదిస్తూ కూర్చున్నారు.‘‘విశ్రాంతి తీసుకోండి బాబా’’ అంటే వినలేదు.

అది 1886.ఆ రోజు మార్గశిర పౌర్ణమి.ఆరతి అయింది. భక్తులంతా ఇళ్ళకి వెళ్ళిపోయారు. బాబానే పంపించేశారు వారిని.‘‘తొందరగా పొండి, ఇళ్ళకు పొండి.’’ అంటే వెళ్ళిపోయారంతా.

అప్పటికే ఊపిరి ఆడక బాబా నానా ఇబ్బందీ పడుతున్నారు. ఆయన ఇబ్బందిని చూసి కన్నీళ్ళ పర్యంతమయ్యారు తాత్యా, శ్యామా. వాళ్ళు ఏడుస్తుంటే కోపం వచ్చింది బాబాకి.

‘‘ఏడుపు ఎందుకు? ముందు మీరిక్కణ్ణుంచి వెళ్ళండి.’’ కసురుకున్నారు వాళ్ళ మీద. వెళ్ళక మొండికేసి వాళ్ళుంటే మరింత కోపంగా వెళ్ళిపొమ్మని చేతులూపారు.

శ్వాస అందక ఇబ్బంది పడుతూ ఆవేశపడుతుంటే బాబాని కష్టపెట్టడం ఇష్టం లేక తాత్యా, శ్యామా అక్కణ్ణుంచి సెలవు తీసుకున్నారు. మహల్సాపతిని వెళ్ళి పొమ్మని చెప్పలేదు బాబా.

‘చెప్పకు స్వామీ’ అన్నట్టుగా చేతులు జోడించి, నిల్చున్నాడు మహల్సాపతి.‘‘నువ్వుండు, చాలు.’’ అన్నారు బాబా.‘‘సంతోషం’’ అన్నాడు మహల్సాపతి.

బాబా నిద్రించేందుకు పక్క ఏర్పాటు చేయసాగాడతను. దుప్పట్లు పరిచాడు.‘‘పడుకోండి బాబా’’ అన్నాడు మహల్సాపతి. పడుకోలేకపోయారు బాబా.

వెల్లకిలా పడుకుంటే ఊపిరి ఆడడం లేదు. అందుకుని, గోడనానుకుని ఒరిగి కూర్చున్నారు. కొంత కుదుటబడ్డట్టుగా ఉంది. తననే తదేకంగా చూస్తున్న మహల్సాపతిని ‘ఏంట’న్నట్టుగా  కళ్ళెగరేసి, చూశారు బాబా.

‘‘షిరిడీలో ఉన్నవారితోనూ, షిరిడీకి చేరుకున్న వారితోనూ నీకు జన్మజన్మల బంధం ఉందంటున్నావు. అందర్నీ చేరదీస్తున్నావు. మరి నా సంగతేమిటి బాబా?’’ అడిగాడు మహల్సాపతి.

సమాధానంగా వస్తున్న దగ్గుని ఆపుకుని చూశారు బాబా.‘‘నువ్వు షిరిడీలో అడుగు పెట్టినప్పటి నుంచీ నిన్నే దైవంగా పూజిస్తున్నాను. నా ఖండోబాని నీలోనే చూసుకుంటున్నాను. మరి మన సంబంధం ఏమిటి బాబా?’’ అడిగాడు మహల్సాపతి.

‘‘దైవసంబంధం’’ అన్నారు బాబా.‘‘బాబా’’ ఆశ్చర్యపోయాడు మహల్సాపతి.‘‘అవును! నీదీ నాదీ దైవసంబంధం. మనిద్దరం దైవాంశకు చెందిన వాళ్ళం.’’ అన్నారు బాబా.

నుదుటన చేతులు ఉంచి, దణ్ణం పెట్టాడు మహల్సాపతి. ఇంతలో తిరగతోడినట్టుంది. మళ్ళీ ఆయాసపడసాగారు బాబా.

ఆయన ఉచ్చ్వాస నిశ్వాసలు ద్వారకామాయిలో ప్రతిధ్వనించసాగాయి. బాబాని చూసి ఆందోళన పడుతున్న మహల్సాపతిని దగ్గరగా రమ్మన్నట్టుగా చేత్తో సైగ చేశారు బాబా. వచ్చాడు మహల్సాపతి.

అతన్ని ఆసరాగా చేసుకుని నిలబడ్డారు బాబా.‘‘నన్నే ధ్యానిస్తూ, నేను తప్ప ఇంకొకరు తనకు దిక్కులేరనే ఓ భక్తుడి అనారోగ్యాన్ని అందిపుచ్చుకున్నాను. అది నా ప్రాణాలు తోడేస్తోంది. నిల్చోనివ్వడం లేదు, కూర్చోనివ్వడం లేదు.’’ అన్నారు బాబా.

దగ్గుతో కిందా మీదా అయ్యారు.‘‘దేవుడికి కూడా అనారోగ్యం తప్పదా?’’ అడిగాడు మహల్సాపతి.‘‘దేహాన్ని ధరించినప్పుడు దేవుడికయినా బాధ తప్పదు.’’

 

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles