భావ తరంగాలు – హేమాజోషి(నిమోన్ కర్ గారి మునిమనుమరాలు) ఎనిమిదవ బాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి….

భావతరంగాలు – హేమా జోషి – 8 వ భాగమ్

 మేము మనసులో శ్రీసాయిబాబా, మహావతార్ బాబాజీ, శ్రీస్వామి సమర్ధ మహరాజ్ ల నామాన్ని బిగ్గరగా జపిస్తూ నడుస్తున్నాము.  బిగ్గరగా జపిస్తూ ఉండటంవల్ల గాలిలో మా మాటలే మరలా మరలా ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి.  మాకు దారి చూపిస్తున్న గైడ్ పాపం చిన్నపిల్లవాడవటం వల్ల బాగా భయపడిపోతున్నాడు. 

అప్పుడే చాలా దూరం నుంచి మావైపుకు మిణుకు మిణుకు మంటూ చిన్న కాంతి వస్తూ ఉంది.  చేతిలో మండుతున్న కాగడా పట్టుకుని మావైపే ఎవరో వస్తున్నారు.  అతను మాదగ్గరగా వచ్చి, “నా పేరు కేశర్ సింగ్, మీరు ఎవరు? ఇటువంటి ప్రమాదకరమయిన చోటకి అంత వంటరిగా మీరెలా వచ్చారు?  మీసాయి నామ జపాన్ని విని మీకు సహాయం చేద్దామని వచ్చాను. నాతో కూడా రండి” అన్నాడు.

మేము ఆయన వెనకే మౌనంగా నడవసాగాము.  ఒక గంట తరవాత ఆయన ఉండే కుటీరం దగ్గరకు చేరుకున్నాము.  మేము ఆ కుటీరంలోకి ఎస్కిమోలలాగ మోచేతులు, కాళ్ళతో ప్రాకుకుంటూ ప్రవేశించాల్సి వచ్చింది. ఆ చిన్న కుటీరం లోపలికి వెళ్ళి తల పైకెత్తి చూశాము.

ఓహ్! ఏమాశ్చర్యం! ఏమా అద్భుతం!  ఆ క్షణంలో నాకు నోటమాట రాలేదు. నా హృదయ స్పందన ఆగిపోయిందా అన్నట్టుగా ఉంది నా పరిస్థితి—-ఆశ్చర్యంతో నా నోటినుంచి బిగ్గరగా వచ్చిన మాట “నా సాయిబాబా – నా సద్గురు సాయిబాబా – నేనెక్కడికి వెళ్ళినా నువ్వు నాతోనే ఉంటావు!!”

నేను తలపైకెత్తి చూడగానే ఎదురుగా నిలువెత్తున సాయిబాబా.  ఆయన కళ్ళలో అదే కరుణ. వదనంలో చిరునవ్వు.  కుడిచేతిని పైకెత్తి అభయమిస్తూ ఉన్నారు.  నా సాయిబాబా – నా సాయిబాబా–  ఆనందంతో గట్టిగా అరిచాను.  ఆ చిన్న కుటీరంలో నిలువెత్తు సాయిబాబా కాలండరు గోడమీద క్రిందవరకు వ్రేలాడుతూ కనిపించింది.  బాబా ఆ విధంగా నిలుచున్న తీరు ఎంతో అద్భుతంగా ఉంది.  ఆయన కళ్ళలో అదే కరుణ, దయ, ప్రేమ, చేయెత్తి మీకు రక్షణగా నేనున్నాను అని అభయమిస్తూ నిలబడి ఉన్నారు. 

షిరిడీలోని ద్వారకామాయిలో మనం ఎప్పుడూ దర్శించుకునే బాబా“రండి నాదగ్గరకు.  మీకోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను” అని మాట్లాడుతున్నట్లుగా ఉంది.  ఆనందభాష్పాలు ఉబికి వస్తున్నాయి.  నా సద్గురు నా సాయిబాబా నన్ను రక్షించేవాడు, నేను నీతో ఏమి మాట్లాడగలను?  వినమ్రంగా ఆయన పాదాలను స్పృశించాను. 

“నేనెక్కడికి వెళ్ళినా, నా రక్షకునిగా, నన్ను పాలించేవాడివిగా నువ్వెప్పుడూ నాతోనే ఉంటావు.  నా తల్లి, తండ్రి అన్నీ నువ్వే”.  హిమాలయాలలో ఉన్న ఆచిన్న కుటిరంలో మేము ఆ రాత్రి సాయిబాబా దివ్యచరణాల వద్ద నిద్రించాము.

సాయిబాబా నా హృదయంలో స్థిరనివాసం ఏర్పరచుకొన్నారు.  హిమాలయాలలో ఆయన దివ్యదర్శనం నా జీవితంలో మరపురాని, మరచిపోలేని ఒక దివ్యానుభూతి.  మన జీవితంలో మనకు అత్యంత సన్నిహితంగాను, పిలవగానే పలికెడు దైవం, మోక్షాన్నిచ్చే గురువు సాయిబాబాయే అని అర్థం చేసుకున్నాను.  మనకి ఈ ప్రపంచంలో వెలకట్టలేని ఆధ్యాత్మిక సంపద ఏమిటంటే, ఆయన యొక్క అవ్యాజ్య ప్రేమ, వాత్సల్యం.  ఆయనకు నేను పూర్తిగా సర్వస్య శరణాగతి చేస్తూ—

“నా మనస్సు నాకు నచ్చిన చోటకు ఎక్కడికయినా వెళ్ళనీ, నాకు నీ దర్శనం మాత్రమే కలుగుతుంది.  ఆ ప్రదేశంలో నా శిరసునుంచగానే అక్కడే ఆ చోటనే నా సద్గురువువయిన నీ చరణకమలాలనే స్పృశిస్తున్న అనుభూతి నాకు కలుగుతుంది”  అని వినమ్రంగా బాబాకు విన్నవించుకుంటు ముగిస్తున్నాను.

(వ్రాసినవారు; ప్రొఫెసర్ హేమలతా సుధాకర్ జోషి (నిమోన్ కర్ – దేశ్ పాండే)

నానాసాహెబ్ నిమోన్ కర్ దేశ్ పాండే గారి మునిమనుమరాలు

సద్గురు సాయిబాబాకు అత్యంత ప్రియమైన భక్తురాలు)

పూనా  (మహారాష్ట్ర)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles