భావ తరంగాలు – హేమాజోషి(నిమోన్ కర్ గారి మునిమనుమరాలు) ఏడవ బాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి….

భావతరంగాలు – హేమా జోషి – 7 వ భాగమ్

అది 2౦౦4 వ సంవత్సరం నవంబరు 25వ తారీఖు.  శీతాకాలం కావడం వల్ల విపరీతమయిన చలి గాలులు వీస్తున్న రోజులు. నేను, నా భర్త శ్రీ సుధాకర్ జోషీ, క్రియా యోగా కి మూలగురువయిన మహావతార్ బాబాజీ దర్శనానికి బయలుదేరాము.

ఆయన హిమాలయ పర్వతాల వద్ద గల త్రిశూల్ పర్వతం దగ్గర ద్వారాహట్ గుహలో నివాసముంటున్నారు.  మహావతార్ బాబాజీ గారు క్రియాయోగాకి ఆద్యుడు, మూలపురుషుడు, సద్గురువు.  ఆయన ఇప్పటికీ చైతన్యరూపంలో అదృశ్యంగా ఉన్నారు.

ఈ విశ్వంలో శాంతిని నెలకొల్పడానికి, మానవజాతిని ఉద్ధరించడానికి ఆయన ఇంకా చైతన్యరూపంలో జీవించే ఉన్నారు. ఆయన వయసు 3000 సంవత్సరాలకు పైగా ఉంటుంది. కాని ఆయన 25 సంవత్సరాల నవయువకునిలా కన్పిస్తారు.

కాని చాలా కొద్దిమంది అదృష్టవంతులు మాత్రమే, క్రియాయోగంలో ఆధ్యాత్మిక గురువులయిన శ్రీలాహిరి మహాశయ, శ్రీస్వామి యుక్తేశ్వర్ గిరి, ఇంకా ఆయన అనుంగు శిష్యుడయిన పరమహంస శ్రీ యోగానంద లాంటి వారికి మాత్రమే బాబాజీగారి దర్శనం లభించింది.  శ్రీ శ్రీ యోగానందగారు తన ఆత్మకథను ‘ఒకయోగి ఆత్మకథ’ అనే పుస్తకాన్ని రచించారు.

అది చాలా ప్రసిద్ధిగాంచింది.  మహావతార్ బాబాజీ క్రియాయోగ లక్ష్యాన్ని ప్రముఖ పాత్రికేయుడయిన శ్రీనీలకంఠన్, మరియు రామయ్యగార్ల ద్వారా పూర్తి చేయించారు.  వారి ద్వారా ఇప్పటికీ ఎంతోమంది భక్తులకు  ఈ క్రియాయోగ లో శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. భవిష్యత్తులో కూడా ఈ క్రియాయోగ వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. ఆయన ఇప్పటికీ తన క్రియాయోగ ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నారు. ఆయన ఈ ప్రపంచంలో ఉన్న భాషలన్నిటినీ మాట్లాడగలరు.  ఆయన తన కార్యాన్ని రహస్యంగా నిర్వహిస్తూ ఉంటారు.

హిమాలయాలలో బాబాజీగారు నివసించే గుహకి వెళ్ళేదారి చాలా ప్రమాదకరంగా ఉంటుంది.  ఒక వైపున ఎత్తయిన హిమాలయ పర్వత శిఖరాలు, ఆకాశాన్ని అందుకుంటున్నాయా అనిపించేటంతగా పెద్దపెద్ద వృక్షాలు, మరొకవైపు అగాధమయిన లోయలు, ఆ లోయలన్నీ దట్టమయిన అడవులతోను, వేగంగా ప్రవహించే పెద్ద నదులతోను నిండి ఉంటాయి.

ఆ నదులలోని నీటి ప్రవాహాలు చాలా లోతుగా ఉంటాయి.  నడిచేటప్పుడు ఏమాత్రం కాలు జారినా ఇక ఇంతే సంగతులు.  ప్రవహించే నీటి ప్రవాహంలో గాని, లోయలలో గాని పడిపోవలసిందే.  ఇక బయటకు వచ్చే ప్రసక్తే లేదు.  బ్రతుకుతారన్న ఆశ కూడా ఏమాత్రం ఉండదు. జీవితానికి చరమాంకం. పర్వతాల మీదకు తీసుకునివెళ్ళడానికి గుఱ్ఱాలు గాని, మనుషులను పల్లకీలో (డోలీలు) మోసుకుని వెళ్ళడానికి ఎటువంటి సౌకర్యాలు ఉండవు.

ద్వారాహట్ లోని ప్రధాన స్వామీజీ మాకు దారి చూపించడానికి ఒక గైడ్ ని పురమాయించారు.  అతని పేరు రవి.  అతని వయస్సు 12 సంవత్సరాలు.  పుట్టినప్పటి నుండి ఆ అబ్బాయి హిమాలయ ప్రాంతాలలోనే ఉన్నాడు. చిన్నపిల్లవాడయినా మాకు క్షుణ్ణంగా దారి చూపిస్తూ తీసుకెళ్లసాగాడు. మేము అతని వెనకాలే సద్గురు శ్రీసాయిబాబా, మహావతార్ బాబాజీల నామాన్ని జపించుకుంటూ అనుసరిస్తున్నాము. 

నా మోకాళ్ళు బాగా నొప్పితో సలుపుతూ ఉన్నాయి. గత 22 సంవత్సరాల నుండీ నేను మోకాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతూ ఉన్నాను. కాని బాబాజీ గారిని దర్శించాలనే కోరిక బలీయంగాను, ఆయనను కలుసుకోబోతున్నామనే ఒక విధమయిన ఉద్వేగంతోను ఉండటం వల్ల పర్వతాలను అధిరోహించడం ఎంత కష్టంగా ఉన్నా, ప్రమాదకరంగా ఉన్నా మోకాళ్ళ నొప్పులని ఏమాత్రం పట్టించుకోలేదు.

మేము సాయంత్రం 4 గంటలకు గుహకు చేరుకున్నాము.  నా జీవితంలో అది ఒక మరుపురాని సంఘటన.  మాకు కలిగిన ఆనందం చెప్పనలవికాదు.  మనసంతా ఒక విధమయిన ఉద్వేగంతో నిండిపోయింది.  ధ్యానమగ్నులమయి స్తోత్రాలను పఠించుకుంటూ, భజనలు చేసి ప్రార్థనలు చేశాము. ఆ క్షణాలు మాకెంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించాయి.  అంతా సంతోషం, ఆనందం తప్ప మాకాక్షణంలో ఇంకేమీ లేవు.

మేము క్రిందకి దిగడం ప్రారంభించేసరికి అసలయిన ప్రమాదం ముంచుకొచ్చింది. హఠాత్తుగా వాతావరణంలో పెద్ద మార్పు. ఆకాశంలో దట్టంగా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి.  బలమయిన గాలులు ఊళలు వేస్తూ వేగంగా వీస్తున్నాయి.  దానికితోడు మంచుకూడా కురవడం ప్రారంభమయింది.  రాళ్ళతోను, బురదతోను ఉన్న దారి మరింతగా జారుడుగా ఉండటం వల్ల, నడక కూడా చాలా ప్రమాదకరంగా ఉంది.

కొంతసేపటికి ఆ చీకటిలో హిమాలయాల సౌందర్యమంతా మాయమయిపోయింది.  మధ్యమధ్యలో ఉరుములు, మెరుపులతో వాతావరణం భీతి కొలుపుతూ ఉంది.  విపరీతమయిన చలితో మొత్తం వాతావరణం చాలా ఘోరంగాను, భయంకరంగాను ఉంది. అడుగు వేద్దామంటే దారికూడా కనబడటంలేదు.  నాకు చాలా భయంగా ఉంది.  కాని మేము మనసులో శ్రీసాయిబాబా, మహావతార్ బాబాజీ, శ్రీస్వామి సమర్ధ మహరాజ్ ల నామాన్ని బిగ్గరగా జపిస్తూ నడుస్తున్నాము.  బిగ్గరగా జపిస్తూ ఉండటంవల్ల గాలిలో మా మాటలే మరలా మరలా ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. 

(ఈ ఆనంద తరంగాలు ఇంకా ఉన్నాయి)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles