Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
మృత్యువుని జయించిన వారు మానవాతీతులే! అందులో అనుమానం లేదు. అయితే అలాంటి మానవాతీతుల్ని కూడా వ్యాధులు పట్టి పీడిస్తాయి.
దానికి ఉదాహరణ బాబానే!బిడ్డకి ప్లేగు వ్యాధి సోకింది. ఒంటి మీద బాగా బొబ్బలు లేచాయి. అల్లాడిపోతున్నాడు బిడ్డ. ఏడుస్తున్నాడు.
వాడి బాధ చూడలేకపోయింది తల్లి. పరిగెత్తుకుని ద్వారకామాయికి చేరుకుంది. బాబా భక్తురాలు ఆమె. కష్టమయినా సుఖమయినా బాబాకి నివేదించుకోవడం అలవాటు.‘‘బాబా’’ అంది ఆర్తిగా.
ఆయన పాదాలను ఆశ్రయించింది.‘‘చెప్పు, నీకు వచ్చిన కష్టం ఏమిటి?’’ అడిగారు బాబా.‘‘బిడ్డ ప్లేగు బొబ్బలతో అల్లాడిపోతున్నాడు.
ఒకటే ఏడుపు. వాణ్ణి నువ్వే కాపాడాలి.’’ మొర పెట్టుకుందామె.‘‘సరే’’ అన్నారు బాబా, సన్నగా నవ్వుతూ.‘‘నిన్నే నమ్ముకున్నాను, నువ్వే కరుణించాలి.’’ అందామె.‘‘తప్పకుండా’’ అన్నారు బాబా.
ధుని దగ్గరగా నడిచి వెళ్ళారు. అందులోంచి గుప్పెడు ఊదీ తీశారు.‘‘రా’’ పిలిచారామెను. వచ్చిందామె.‘‘చేయి జాచు’’జాచిందామె. ఆమె చేతిలో ఊదీ పోశారు బాబా.
‘‘ఈ ఊదీ తీసుకుని వెళ్ళి, బిడ్డ బొబ్బల మీద రాయి. తగ్గిపోతుంది.’’ అన్నారు బాబా.‘‘వస్తాను బాబా’’ పరుగుదీసిందా తల్లి.
బాధతో అల్లాడిపోతూ, ఏడుస్తున్న బిడ్డ దగ్గరగా వచ్చింది. చేతిలోని ఊదీని బొబ్బల మీద రాసింది. ఊదీ పూతతో బాధ తగ్గిందేమో! బిడ్డడు హాయిగా నిద్రపోయాడు.
ఆశ్చర్యంగా ఆమెకు కూడా నిద్రపట్టేసింది. బాగా నిద్రపోయారిద్దరూ. తెల్లగా తెల్లారింది. లేచిందామె. లేచి బిడ్డని చూసింది. శరీరం మీద ప్లేగు బొబ్బలే లేవు. మాయమయిపోయాయి.
ఆమె ఆనందానికి హద్దులేకపోయింది.‘‘బాబా’’ అని కళ్ళు మూసుకుంది. ఆయన్ని ధ్యానించి చేతులు జోడించింది. సాయంత్రం బిడ్డను తీసుకుని, ద్వారకామాయికి చేరుకుంది.
బాబాకి బిడ్డని చూపించి, వాడి చిట్టి చేతుల్తో బాబాకి దణ్ణం పెట్టించాలని కోరిక.గద్దె మీద బాబా ముడుచుకుని కూర్చున్నారు. బాధని అణచి పెట్టుకుంటున్నట్టుగా ఉన్నారు.
అయినా అదేదీ పట్టించుకోక, బిడ్డని అతని పాదాల చెంత ఉంచిందామె.‘‘అంతా నీ దయ బాబా! బిడ్డకి ప్లేగు తగ్గింది. బొబ్బలు పోయాయి.’’ అంది.
బిడ్డ చేతులు జోడించి, వాడి చేత బాబాకి దణ్ణం పెట్టించింది. అప్పుడు బాబాని పరిశీలనగా చూసిందామె. బాధని అణచిపెట్టుకుంటున్నట్టుగా ఉండి, ముడుచుకుని కూర్చున్నారు బాబా.
‘‘ఏం బాబా, ఎందుకలా ఉన్నారు?’’ అడిగింది.‘‘ఎందుకంటే ఏం చెప్పను? ప్లేగుని భరించడం కష్టమే! నీ బిడ్డకి బొబ్బలు తగ్గాయి, కాని నాకు ఇక్కడ లేచాయి.’’ అన్నారు బాబా. కఫనీ ఎత్తిపెట్టి, మోకాళ్ళను చూపించారు ఆమెకు.
కాళ్ళ మీద మూడు బొబ్బలు ఉన్నాయి. గొల్లుమందామె.‘‘నా బిడ్డ అనారోగ్యం మీరు తీసుకున్నావా? అందుకా వీడికి బొబ్బలు తగ్గాయి.’’ అంది. అవునన్నట్టుగా కళ్ళార్చారు బాబా.
భక్తుల పాపాలనూ, వ్యాధులనూ గుప్పెటతో ఇసుక తీసుకున్నంత సులభంగా బాబా తీసుకునేవారు.
వారి బాధలను తను భరించేవారు.‘‘ఏమిటి బాబా ఇదంతా?’’ అని ప్రశ్నిస్తే-‘‘పిల్లల తప్పులకు పెద్దలదే బాధ్యత అన్నట్టుగా భక్తుల పాపాలకూ, బాధలకూ భగవంతుడే బాధ్యత వహించాలి.’’ అని నవ్వేవారు.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్యామా మరదలు
- సలహా…..సాయి@366 ఏప్రిల్ 22….Audio
- ‘‘సద్గురువు కటాక్షం లభించిన వారికి కష్టాలు ఉండవు. బాబా మన సద్గురువు.’’
- కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 11వ. అధ్యాయము….Audio
- వైద్యులకే వైద్యుడు! …..సాయి@366 మే 9….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments