Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
మానవులు చేయలేని పనిని మహనీయులు చేస్తారు. చేస్తామని చాటింపు వేయించుకోరు. అంతా దైవలీల అంటారు సాయివంటి సద్గురువు. సాయి భక్తులకు సాయి సన్నిధియే పెన్నిధి.
రవి కాంచనిచోట, కవి గాంచును కదా! అని అంటారు, ఈ యాంత్రిక యుగంలో డాక్టర్లు కూడా నయం చేయలేక చేతులు ఎత్తివేస్తారు. ఆ సమయంలో సాయి తన కరుణ కిరణాన్ని ప్రసరింపచేయ వచ్చును.
ఒక డాక్టరుకు, అందునా పిల్లల ప్రత్యేక నిపుణుడైన అతనికి వివాహం అయింది. పిల్లవాడు జన్మించాడు.
పుట్టిన రెండు నెలల నుండి రాత్రులందు ఏడ్చేవాడు. ఆ డాక్టరు కారణాన్ని తెలుసుకోలేకపోయాడు.
తోటి డాక్టర్లు కూడా కారణాన్ని తెలుసుకోలేకపోవటమే కాదు, ఆ పసిబాలుని రోదనను (రాత్రులందు) ఆపలేకపోయారు.
డాక్టరుగారికి, ఆయన భార్యకు రాత్రులందు నిద్ర కరువైంది. భద్రావతిలో ఉండే ఆయన సోదరుడు షిరిడీ వెళ్ళి ఊదిని తాయిత్తులో వేసి పట్టుకు వచ్చాడు.
ఆ పసిబిడ్డకు ఆ తాయత్తును కట్టారు. అంతే, ఆ బిడ్డడు ఏడుపుమానాడు, రాత్రులందు సుఖంగా నిద్రించసాగాడు. ఇది ఊదీ మహిమ!
షిరిడీలోనే మురళీధర్ భికా ఉండేవాడు. ఆయనకు రెండున్నర సంవత్సరములున్న బిడ్డ ఉన్నది.
ఒకసారి ఆ బిడ్డ అనారోగ్యం పాలైంది. సాయినాథుని ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షలన్నీ చేసారు. వ్యాధిని నిర్ధారించ లేకపోయారు. బిడ్డను ఇంటికి పంపివేసినారు.
బిడ్డను ఇంటికి తెచ్చినా వైద్యుడేడి? వైద్యం ఏది? షిరిడీలో ఉన్న ప్రముఖ డాక్టర్ గోండ్కరుకు చూపించారు. సాయిబాబా ఇచ్ఛపైనే ఆ బిడ్డ బ్రతికి బట్ట కట్టేది అని చెప్పాడు ఆ డాక్టరు.
అది మే నెల.
ఇక వైద్యులకే వైద్యుడైన సాయి సన్నిధి ద్వారకామాయికి వెళ్ళారు.
బాబా ఆసీనుడైన బండ వద్ద బిడ్డ నుంచి, ధునికి ఎదురుగా గల సాయి ఫోటోను ప్రార్ధించసాగారు.
కన్నీటికి దైవం కరుగుతాడో లేదో తెలియదు గాని సాయి కరిగిపోయాడు.
వారు సాయిని ప్రార్ధించి బిడ్డ వద్దకు వెళ్ళారు. ఆ బిడ్డ అక్కడ లేదు. వారు గాబరాపడ్డారు.
చుట్టూ చూడగా అక్కడికి దగ్గరలోనే ఇతర చిన్న పిల్లలతో ఆడుకుంటోంది వారి పసి బిడ్డ.
ఆ తల్లిదండ్రుల కృతజ్ఞతా పూర్వక ఆనంద భాష్పాలు సాయినాథుని పాదయుగళిని కడిగివేస్తాయని అనిపించింది చూచు వారలకు!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- కనిపించని వైద్యుడు …..సాయి@366 మే 12….Audio
- సాయి – శ్రామికుడు …..సాయి@366 మే 1…..Audio
- ‘చిత్రం’ భలే విచిత్రం…..సాయి@366 జూలై 11…Audio
- క్రీస్తు శకం – సాయి యుగం …..సాయి@366 డిసెంబర్ 25….Audio
- పట్టించుకోవటం లేదు…..సాయి@366 నవంబర్ 14….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments