పట్టించుకోవటం లేదు…..సాయి@366 నవంబర్ 14….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


మే 1948లో సాయిబాబా పేరు మొదటిసారిగా విన్నాడు జగదీశ్‌ మున్షీ. అప్పటినుండి సాయి భక్తుడయ్యాడు.

ఆ భార్యా, భర్తలు సాయి ఫొటోను దైవంగా భావించి పూజించే వారు. ఒకసారి ఆయనకు ఒక కష్టం వచ్చింది. అది ఆయన సాయి బాబా కృపవలననే తొలగిపోయింది అంటారు.

సెప్టెంబరులో ఆయనకు ఆడ పిల్ల పుట్టింది. ఒక నెల తరువాత ఆ పాపకు జబ్బు చేసింది. బొంబాయిలోని సుప్రసిద్ధ ఆసుపత్రి బీచ్‌కాండులో చేర్చారు.

మూడు వారాలపాటు మందులు ఇచ్చారు. 14 నవంబరు ఉదయాన ఇద్దరు డాక్టర్లు పరీక్షించి ఆ పసిబిడ్డ బ్రతకటం కష్టమే అన్నారు. ఆశలేనట్టే అని చెప్పారు.

ఆ మాటలకు ఆ దంపతులు ఎంతో చింతించారు. ఏం చేయాలో తోచలేదు. ఇంటికి వెళ్ళారు. సాయి పటం ముందు నిలబడి ప్రార్ధించారు.

లేకలేక కలిగిన బిడ్డ – ఆ ఆలోచననే తట్టుకోలేకపోయారు ఆ దంపతులు. సాయిని కొన్ని ఏండ్లబట్టి ఆరాధిస్తున్నారు.

”బిడ్డ బ్రతికిందంటే సాయి మనలను నిశ్చయంగా కాపాడుతున్నట్లే, అట్లు జరగని పక్షంలో సాయి మనలను పట్టించు  కోవటంలేదు అనుకుంటాను. మనలను పట్టించుకొనని దైవాన్ని మనం ఎందుకు ఆరాధించాలి?” అన్నాడు బాధతో జగదీశ్‌.

కంచెర్ల రామదాసు గోల్కొండలో బందీగా ఉన్నప్పుడు తానీషా కొట్టించిన దెబ్బలకు తాళలేక రాముని తూలనాడినాడు. వెంటనే తన తప్పును తెలుసుకుని మన్నించమని వేడుకున్నాడు.

ఆ దంపతులు తిరిగి ఆసుపత్రికి చేరారు. పది గంటలైంది. మరో పెద్ద డాక్టరు వచ్చి బిడ్డను పరీక్షించి, పెదవి విరిచాడు. దంపతులు నీరుగారిపోయారు.

అక్కడే ఉన్న నియర్‌ డాక్టరు, ఆ పెద్ద డాక్టరుతో ”డాక్టర్‌, ఆ బిడ్డకు మలేరియా అని నా అనుమానం” అన్నాడు. కస్సున లేచాడు పెద్ద డాక్టరు. ”ఇంత పెద్ద ఆసుపత్రిలో మలేరియానా? కాదు” అన్నాడు.

మరల ”సరే క్వినైన్‌ (మలేరియా) ప్రయత్నించి చూడు” అన్నాడు ఆయనే. నియర్‌ దాక్టరు ఆ మందును వాడటం మొదలుపెట్టాడు.

ఆ రాత్రి లోపే జ్వరం నిలకడగా తగ్గటం మొదలుపెట్టింది. తగ్గింది. ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకుపోయారు ఆ పాపను.

ఈ సంగతి విని ఒక సాయి భక్తుడు ”సాయి తల్లి వంటి వాడు. ఒకొక్కసారి బిడ్డను పట్టించుకోకపోవచ్చు. కాసేపటికి ఆ మాతృమూర్తి బిడ్డకు పాలు ఇస్తుంది” అన్నాడు.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles