Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా అన్నదానం చేసేవాడు.
14 నవంబర్, 1799న జన్మించిన జలారాం బాపా సదావ్రతమును స్వీకరించాడు.
సదావ్రతమంటే నిత్యాన్న దానం. ఆ అన్నదాన కార్యక్రమంలో సాధువులు, జంతువులు, సాధారణ మానవులు, అందరూ పరమేశ్వర స్వరూపాలే.
సాయిబాబా గురు భక్తిని ప్రోత్సహించినట్లు జలారాం బాపా తన గురువైన భోజాభగవత్ ను సేవించేవాడు.
ఆ గురు భక్తి, ఆ అన్నదాన మహిమ, రామునిపై విశ్వాసము జలారాం బాపా కీర్తిని నలు దిశల విస్తరింప చేశాయి.
కీర్తి కోసం ఆశించకుంటే శక్తులు వాటంతట అవే వస్తాయి.
ఒకసారి వీర్ పూర్ లో నివసించే మహిళ పొరుగూరిలో పెండ్లికి పోయింది. అక్కడ ఆమె ముక్కుపుడక ఎక్కడో పడిపోయింది.
ఈ సంగతి తెలిస్తే, అత్త గారు ఊరుకోదు. వెంటనే ఆమె వీర్ పూర్ వచ్చి జలారాం బాపాకు జరిగిన సంగతి చెప్పింది.
అక్కడ ఆమె జలారాం బాపా ఆదేశంతో రాముల వారి ముందు కొబ్బరి కాయను కొట్టింది. ఆ కొబ్బరి కాయ రెండు ముక్కలైంది.
అందులోంచి ఆమె ముక్కు పుడక క్రింద పడింది….”చూశావా! నా రాముడు ఎంత జిత్తులమారియో” అన్నాడు జలారాం బాపా.
ఒకసారి జలారాం బాపా తన భక్తులతో కలసి వేరే గ్రామం వెళుతూ, రాత్రి పూట ఒక మర్రి చెట్టు క్రింద విశ్రమించబోయారు.
ఆ గ్రామస్తులు అది దయ్యాల మర్రి అని, అక్కడ నిద్రించవద్దన్నారు.
జలారాం “రాముడు గొప్పా? దెయ్యాలు గొప్పా?’ ప్రశ్నించాడు వారిని. “రాముడే” అన్నారు వారు.
“అందరూ కూర్చోండి రామ భజన చేద్దాం” అని అందరిని కూర్చుండబెట్టి రామ భజన చేశాడు.
“హే రామా! భూతములకు ముక్తి ప్రసాదించు” అని వేడుకున్నాడు. ఇక అక్కడ దెయ్యాల జాడే లేదు. ఇది రామ లీల!
కేవదారా గ్రామంలో నాన్ జీలడాని అనే కూలి వాడు తన కుటుంబంతో నివసించే వాడు.
అతడు జలారాం బాపా భక్తుడు. ఒకనాడు నాన్ జీలడాని తన కుటుంబంతో మధ్యాహ్నం ఒక తుమ్మ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నాడు.
ఉన్నట్టుండి సుడిగాలి వచ్చింది. ఆ సుడిగాలికి ఆ తుమ్మ చెట్టు పడబోతోంది, బయటకు పారిపోయే సమయం కూడా నాన్ జీలడానికి లేదు.
వెంటనే “జలారాం బాపా! కాపాడు” అని గావు కేక పెట్టాడు. పడబోతున్న చెట్టును ఎవరో ఆపినట్లు ఆగిపోయింది.
అప్పుడు అందరూ ఆ చెట్టుకు దూరంగా వెళ్లిపోయారు. వీర్ పూర్ వెళ్లి నాన్ జీలడాని బలరాంకు కృతఙ్ఞతలు చెప్పాడు.
“అది సరే! అప్పుడు నా శరీరంలోనికి పోయిన తుమ్మ ముళ్లను తీసివేయు” అన్నాడు జలారాం బాపా.
సద్గురువు మన చెంతనే ఉంటాడు. కానీ గ్రహించగలగాలి.
నేడు నవంబర్ 14. జలారాం బాపా జయంతి.
రాం, జలారాం బాపా అనుగ్రహము మనకు కలుగును గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- జీవిత గమ్యం …. మహనీయులు – 2020… ఏప్రిల్ 14
- ఈశుడు దాసుడైనాడు…. మహనీయులు – 2020… నవంబర్ 17
- పదవి – సాధన . …. మహనీయులు – 2020… నవంబర్ 13
- సేవ చేసే విధము తెలియండి…. మహనీయులు – 2020… మార్చి 14
- అన్నదాత్రీ సదా కృతార్థా …. మహనీయులు – 2020… ఆగస్టు 12
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments