Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా ఒకొక్క భక్తుని ఒకొక్క విధంగా చూచేవారు. బాబా ఒక వ్యక్తిని తన వద్దకు రమ్మని పదే, పదే కబురు పెట్టాడు.
సాయి బాబా షిరిడీ విడిచి రెండు గ్రామాలకు వెళ్ళేవాడు – నీంగాంకు, రహతాకు. రహతా నుండి కుశాల్‌చంద్ రాకపోవటం ఆలస్యమైతే బాబాయే స్వయంగా రహతా వెళ్ళేవాడు వారింటికి.
అంటే ఇంటి ప్రాంగణంలోనికే, గృహం లోనికి కాదు. ఇలా నీంగాంలో కూడా ఇంటిలోనికి వెళ్ళే వాడు కాదు సాయి.
సాయిబాబా ఒకసారి కాకా సాహెబ్ దీక్షిత్, సాయి శరణానంద, బాపు సాహెబ్ జోగ్, జోగ్ భార్య, నార్వేకర్ మొదలైన వారితో రహతాలోని కుశాల్‌చంద్ ఇంటికి బయలుదేరాడు బండ్లలో. ఈ ప్రయాణంలో కొన్ని విశేషాలు జరిగాయి.
సాయిబాబా ఎక్కిన బండి ముందుకు పోతోంది. జోగ్ దంపతులు, సాయి శరణానందులు ఎక్కిన బండి వెనుకపడ్డది. వెనుకపడటమే కాదు, ఆ బండి చక్రం బురదలో కూరుకుపోయింది.
దాన్ని చూసి బాపూ సాహెబ్ జోగ్ ”నీకు సిద్ధి ప్రాప్తించిందని అందరూ అంటున్నారు. ఈ చక్రాన్ని స్పర్శించు. దాంతో ఈ చక్రం బురదలో నుండి బయటకు వచ్చి, బండి ముందుకుసాగితే అప్పుడు లోకుల మాటలు నమ్ముతాను” అన్నాడు.
ఆయనే (జోగ్) బండి చక్రాన్ని తాకించారు. బండి చక్రం బయటకు వచ్చి దానంతట అదే నడవసాగింది.
ఇక్కడ సాయి శరణానంద చేయి పడగానే, చక్రం అవలీలగా బయటకు వచ్చి నడవసాగటానికి కారణం జోగ్ గారికి సాయిపై ఉండే శ్రద్ధయే కారణమంటారు. జోగ్ గారు సాయి ఎవరి పై కృప చూపుతారో (ఇలాంటి) సిద్ధులు వస్తాయంటారు. ఇది ఒక విషయం.
కుశాల్‌చంద్ ఇంటిలో అందరూ కలసి మాట్లాడుకుని ఆనందించేవారు. బాబా తనకోసం ఏదీ అడిగేవారు కాదు.
అతి బలవంతంమీద సాయి ”అచ్ఛా మా! తోడా దూద్, రోటి లావ్” అనే వారు ఆ ఇంటిలోని ఆడవారితో.
తిరుగు ప్రయాణంలో సాయి శరణానంద సాయి పాదాల చెంత రాధాకృష్ణమాయి శవాన్ని చూచినట్లు అనిపించింది. అది సూచనా? అని సాయి శరణానంద ఆలోచించాడు.
శరణానంద షిరిడీ విడిచి వెళ్ళిన 21వ రోజున రాధాకృష్ణమాయి తనువు చాలించిందనే వార్త విన్నాడు.
అక్టోబరు 15న సాయి మహా సమాధి చెందాడు. సాయి వియోగాన్ని భరించలేని నానావళి 13వ రోజున మరణించాడు.
సాయి వియోగాన్ని కుశాల్‌చంద్ భరించలేక, నెల రోజులకు – నవంబరు 15న సాయి సన్నిధికి చేరాడు.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఒకరు భక్తులైతే చాలు …..సాయి@366 మార్చి 20….Audio
- గెంతుతూ వచ్చిన గోదావరి…..సాయి@366 నవంబర్ 20….Audio
- జన్మ జన్మల బంధం …..సాయి@366 డిసెంబర్ 23….Audio
- అదా కారణం!…..సాయి@366 ఆగస్టు 1…Audio
- సాయి ఎల్లరకు ప్రభువే!…..సాయి@366 నవంబర్ 29….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments