ఒకరు భక్తులైతే చాలు …..సాయి@366 మార్చి 20….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


సాయిబాబా విగ్రహాన్ని షిరిడీలో ప్రతిష్టించినది సాయి శరణానంద.

అసలు ఆయన సాయిని దర్శించాలనే ప్రేరణ ఆయన తండ్రి నుండి లభించింది.

సాయి శరణానంద తండ్రి, ఇంకా ఆయన (తండ్రి) స్నేహితుడు సాకర్‌ లాల్‌ కేశవరామ్‌ భట్టు సాయిమహత్తును గూర్చి విన్నారు. వారికి సాయిని దర్శించాలని కోరిక కల్గింది.

రావ్‌ బహద్దూర్‌ సాఠే నుండి వారు ఒక లేఖను తీసుకుని షిరిడీ వెళ్ళారు సాయిని దర్శించాలని.

సాకర్‌ లాల్‌ కేశవరామ్‌కు, సాయి శరణానంద తండ్రికి సాయి తన దివ్య శక్తిని నిరూపించే అనుభవాలను ఇచ్చాడు.

సాయి శరణానంద తండ్రి పేరు ప్రాణ్‌ గోవింద్‌ లాల్‌ భాయ్‌ పటేల్‌. గోవింద లాల్‌ భాయ్‌ పటేల్‌కు పండ్లన్నీ ఊడి పోయాయి. చిగుళ్ళు మెత్తగా ఉండేవి. అందరిలాగా భోజనం చేయలేడు.

సామాన్యంగా మహారాష్ట్ర భోజనం చపాతీలతో ఉంటుంది. అటువంటి భోజనం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన.

ఈ సంగతిని ఎవరికి చెప్పేట్లు? ఎవరు వింటారు? ఇది సాయి భక్తుడైన బాపు సాహెబ్‌ జోగ్‌ ఇంట్లో ఉన్న ఆయన ఆలోచన.

అదే సమయంలో సాయిబాబా నుండి బాపు సాహెబ్‌ జోగ్‌కు కబురు వచ్చింది.

ఆ కబురు తెచ్చిన వ్యక్తి జోగ్‌తో ”సాయి బాబా ఇప్పుడు రవ్వకేసరిని పంపమన్నారు. భోజనం కోసం కూర్చున్న వారందరికి అదే ప్రసాదంగా పంచ బడుతుంది. ఏ ఒక్కరూ కూడా ఈ రవ్వకేసరిని తినకుండా లేవకూడదని సాయి ఆదేశం” అని చెప్పాడు.

ఈ మాటలు విని గోవింద్‌ లాల్‌ పటేల్‌ ఆశ్చర్యపడ్డాడు. రోజూ తాను ఇంట్లో మెత్తగా ఉండే హల్వానే తినే వాడు.

నేడు రొట్టెలు తినాలన్న సంకటంలో ఉన్నాడు. సాయికి దానిని చెప్పనవసరం లేకుండా పరిష్కరించారు.

ప్రాణ్‌గోవింద్‌లాల్‌ ఫాల్గుణ శుద్ధ షష్ఠి (మార్చి నెలలో) బ్రహ్మీ ముహుర్తంలో పరమపదించారు.

ఆ సమయంలో ఆయన జలోదరం వలన బాధ పడ్డారు. అప్పుడు ఆయనకు బాబా ఊదిని ఇచ్చారు. దాని ప్రభావంతో ఆయనకు ఉపశమనం కల్గింది. ఆయనకు వెంటనే ముక్తి లభించిందని వ్రాశారు సాయి శరణానంద.

సాయి భక్తుడు గోవింద్‌లాల్‌ ముక్తి నొందే సమయంలో సత్కర్మలు చేయమని శరణానందకు హితవు చెప్పాడు.

ఆయనను కాపాడినట్లు, అందరినీ కాపాడమని సాయిని మనసారా మేకుందాం!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles