గుర్తుంచుకో …! ….. సాయి@366 ఫిబ్రవరి 29….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


సాయిబాబాను విద్వార్ధి దశలో మాన్‌ ప్రాణ్‌ గోవింద్‌ పటేల్‌, డాక్టర్ హాటే, అనంత మహాదేవ్‌ సింగ్వేకర్‌ మొదలైన వారెందరో దర్శించారు.

భారత ప్రధానులలో ఒక్కరు మాత్రమే సాయిబాబాను సశరీరంగా దర్శించారు. అందరికి తెలిసిన విషయం ఆయన జన్మ దినం ఫిబ్రవరి 29 అని.

మొరార్జీ దేశాయ్‌ సాయిని దర్శించిన విషయం మానెక్‌లాల్‌ గారికి తెలిసి ఆవిడ మొరార్జీ దేశాయ్‌ గారితో ఇంటర్వ్యూ జరిపి ఆ విశేషాలను మనందరికి తెలిపారు.

ఇంటర్వ్యూ ఎక్కువ భాగం గుజరాతీలోనే జరిగింది.

మానెక్‌లాల్‌ ప్రశ్న: సాయిబాబాను ఎప్పుడు దర్శించారు.

మొరార్జీ జవాబు: 1917లో, షిరిడీలో

ప్రశ్న: షిరిడీ ఎలా ప్రయాణం చేశారు?

జవాబు: అప్పుడు విమానాలు, బస్సులు లేవు. రైల్లోనే ప్రయాణం చేశాను.

ప్రశ్న: మీ వెంట మీ శ్రీమతిగారు  కూడ వచ్చారా?

జవాబు: లేదు, నేనొక్కడినే వెళ్ళాను.

ప్రశ్న: అక్కడ ఎంతసేపు ఉన్నారు?

జవాబు: ఉదయం అక్కడకు చేరాను. పగలంతా అక్కడే ఉండి, రాత్రికి బయలు దేరాను.

ప్రశ్న: మీకు అక్కడకు వెళ్ళాలని ఎలా అనిపించింది?

జవాబు: నాకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉండటం చేత సాధు సత్పురుషులను దర్శించటం నాకు ఇష్టం.

ప్రశ్న: షిరిడీ ఎలా ఉండేది?

జవాబు: పవిత్రమైన వాతావరణం. సాయిబాబా ఆరుబయట కూర్చున్నారు. తమ దర్శనార్ధం వచ్చిన వారితో ముచ్చటిస్తున్నారు.

ప్రశ్న: మీరు సాయిబాబాతో మాట్లాడారా? మీతోనే సాయి బాబా మాట్లాడారా?

జవాబు: అదేమి కాదు. ఆయన ఇతరులకు ఏమి చెబుతున్నారో కుతూహలంగా విన్నాను.

ప్రశ్న: ఆయన ఏమి చెప్పారో జ్ఞాపకం ఉందా?

జవాబు: లేదు. 70 ఏండ్ల కిందట జరిగింది. నాకిప్పుడు జ్ఞాపకం లేదు.

ప్రశ్న: సాయిబాబా ఎదురుగా మీరు కూర్చున్నప్పుడు మీకు ఏమి అనిపించింది?

జవాబు: ఉన్నత ఆధ్యాత్మిక శిఖరాలపై, అత్యున్నత స్థాయిలో ఉన్న బ్రహ్మ స్వరూపునిగా నేను భావించాను. ఆయన గొప్పతనాన్ని నేను గుర్తించాను.

ప్రశ్న: మీరు ఇంకా ఏ సత్పురుషులను దర్శించారు?

జవాబు: ప్రధానమంత్రి అయ్యాక ఆనందమాయి మాతను దర్శించాను.

సాధు సత్పురుషుల దర్శనం ఎవరికైనా, ఏ నాటికైనా శాంతి సౌఖ్యాలను ప్రసాదిస్తుంది. మనకు కూడ అలాంటి దర్శనాన్ని బాబా కలుగ చేయు గాక!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr:Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles