పాట పాడుమా! ….. సాయి@366 మార్చి 1…..Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


ఆధ్యాత్మికతకి, సంగీతానికి సంబంధం ఉన్నట్టుంది. గురువులు సంగీతాన్ని ఇష్టపడతారు. వారు పాటలు పాడతారు. వారు సంగీత విద్వాంసులను ప్రోత్సహిస్తారు.

ఈ విషయంలో సాయిబాబా కూడ అంతే. తాను శ్రావ్యంగా పాడేవాడు, పాటలు పాడించి వినేవాడు, వినిపిస్తాడు కూడా.

శ్రీ వామన్‌ నామదేవ్‌ అస్టేకర్‌ మార్చి 1, 1906లో అకోల్‌నేర్‌లో జన్మించాడు.

అతను 11 ఏండ్ల వయస్సప్పుడు సాయిబాబాను దర్శించే భాగ్యం కలిగింది.

అతడు మకర సంక్రాంతినాడు (1917)లో సాయిని దర్శించి, ద్వారకామాయిలో కూర్చున్నాడు.

సాయి అతనిని పిలిచి, తనవద్ద కూర్చుండబెట్టుకున్నారు, దీవించారు.

కీర్తనలను పాడమని సాయి అతనిని అడిగారు. అతనికి ఏ కీర్తనలు రావు. ఇదే విషయాన్ని సాయితో చెప్పాడు అతడు.

”నేను చూసుకుంటానులే – నీవు  మొదలుపెట్టు” అన్నారు సాయి.

వెంటనే కీర్తనకారునికి తగిన దుస్తులను వేసుకుని, సాయికి నమస్కరించి పాడటం మొదలుపెట్టాడు అంతే – అతడు తిరిగి చూసుకోలేదు – తుకారాం అభంగాలు పాడాడు.

షిరిడీలోని వారు ఎంతోమంది అప్పటికప్పుడు వచ్చి ఆ అభంగాలను విన్నారు. ఎంతో శ్రావ్యంగా ఉన్నాయి,

రాజుగారు తలచుకుంటే, దెబ్బలకు కొదవా? అన్నట్లు, సాయి కరుణిస్తే ఆపగల శక్తి ఏది?

అక్టోబరు 1918 సీమోల్లంఘనం నాడు అతడు అకోల్‌నేరులో మహల్సా మందిరం గోడవద్ద కూర్చున్నాడు.

సాయిబాబా తనవైపే వస్తున్నాడని చూచాడు. గోడ వైపు తిరిగి ప్రణమిల్ల బోయాడు. కానీ, అంతలోనే సాయి బాబా అదృశ్యుడయ్యాడు.

ఇదేమి వింత? అని ఆలోచించాడు. కారణం అంతుచిక్కలేదు. తరువాత తెలిసింది, అదే సమయంలో సాయిబాబా భౌతిక కాయాన్ని విడిచిపెట్టారని.

అసలు సాయి మహాసమాధి చెందితే కదా!

నామదేవ్‌ అస్టేకర్‌కు కోర్హాలేలో  ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చింది, తరువాత షిరిడీలోనే పాఠశాల అధిపతిగా ఉద్యోగం వచ్చింది.

సాయిబాబా అనేకమారులు భౌతిక సాక్షాత్కారమిచ్చి తనను సన్మార్గంలో పెడుతున్నాడని ఆయన తెలిపారు.

సాయి మనకు కూడ భౌతిక సాక్షాత్కారమిచ్చు గాక!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr:Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles