సాయి! కన్నులలో నీరెందులకు?…..సాయి@366 నవంబర్ 1….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


మరుక్షణంలో ఏమి జరుగుతుందో తెలియని మనకు, మరుజన్మలో ఏ తల్లి గర్భాన జన్మిస్తామో తెలియదు. కానీ సాయి పరమాత్మకు తెలుసు.

ఏ భక్తుణ్ణి ఏ తల్లి గర్భాన జనింపచేయాలో సాయి ముందే నిర్ణయిస్తాడు. అలా చేస్తానని పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి.

బల్వంత్‌ నాచ్నే భార్యకు టెంకాయను ప్రసాదించాడు సాయి. ఆ సమయంలో సాయి కంటి నుంచి నీరు వచ్చింది.

ఆ కన్నులలో నీరెందులకో ఎవరూహించెదరు? అవి ఆనంద భాష్పాలా? కన్నీరా? ఎవరు అడుగగలరు సాయిని? సాయి మహాసమాధి చెందాడు.

తరువాత నాచ్నేకు కుమారుడు జన్మించాడు. ఆ బిడ్డడు మూలా నక్షత్రంలో జన్మించాడు. అతనికి కాలూరాం అని పేరు పెట్టారు.

అతడు బాల యోగి. కాలూరాం మూడవ సంవత్సరంలో తల్లి మరణించింది. సాయి కన్నీటికి ఇదా కారణం అనుకున్నారు.

బాలుడు ప్రజ్ఞావంతుడు. అతడు మూడవ ఏటనే ‘రాం హరి రాం’ అనే మంత్రాన్ని జపించటం ప్రారంభించాడు. దానిని అతనికి ఎవ్వరూ నేర్పలేదు.

నాచ్నే ప్రక్క గృహంలో హెగ్డే అనే పండితుడు ఉండేవాడు. ఆయన ప్రతి దినం హరి విజయం పారాయణ చేసేవాడు.

హెగ్డే బాలుడైన కాలూరాంను క్షుణ్ణంగా పరిశీలించి, అలనాటి  శ్రీకృష్ణుని చెలికాండ్రలలో ఒకటిగా పరిగణించాడు.

అది సత్యమే అనునట్టు శ్రీకృష్ణునితో తనకు గల చెలిమిని కాలూరాం అనేక సందర్భాలలో చెప్పేవాడు. ‘రాం హరి రాం’ అనే మంత్రాన్ని ఎల్లప్పుడూ జపించటమే కాదు, కాగితాలపై వ్రాసేవాడు.

ఒకసారి ఉపాసనీ మహరాజ్‌ ఆ పవిత్ర కాగితాలను తీసుకుపోయాడు తనవెంట.  గాడ్గి  బాబా మొదలైన వారెందరో ఆ బుడతిని చూడటానికి వచ్చేవారు.

1926లో కాలూరాంకు అనారోగ్యం మొదలైంది. అంతిమ దినాలు మొదలైనవా? అని భయపడ్డాడు నాచ్నే.

కార్తీక శుద్ధ ఏకాదశి వచ్చింది. అతడు తాను ధరించే సాయిబాబా లాకెట్ ను తీసి ”నేను వెళ్ళిపోవుచున్నాను. నీవు తీసుకో” అని తండ్రికి ఇచ్చాడు.

తండ్రి దుóఖిస్తున్నాడు. ”ఇందులో దుóఖించేందుకు ఏమున్నది? జ్ఞానేశ్వరిలోని 13వ అధ్యాయం పెద్దగా చదువు” అన్నాడు తండ్రితో. తండ్రి చదువుతున్నాడు. కాలూరాం ఆ గ్రంథాన్ని తన ముందుంచుకొని తుది శ్వాస వదిలాడు.

ముక్తి ప్రదాత సాయికి కన్నీరెందులకు!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles