గ్రాంఫోన్…..సాయి@366 జనవరి 11….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


షిరిడీలో అడుగు పెట్టాడు ఒక ఫకీరు. ఆ ఫకీరే పిచ్చి ఫకీరయ్యాడు. ఆ పిచ్చి ఫకీరే మహారాజు అంతటి వాడయ్యాడు. ఆయనే సాయిబాబా.

సాయిమహరాజుకు ఆరతులు జరగసాగాయి. వింజామరలు, ఛత్ర చమారాలు వీచ సాగారు.

సాయి చావడికి వెళ్ళేటప్పుడు వాయిద్యాల సుశబ్దాలతో, శ్యామకర్ణి, పల్లకి, పతాకంతో దండధారులు భజనలు చేస్తూ వెళ్లేవారు.

చావడిని అద్దాలతోను, రకరకాల సుందర వస్తువులతోను అలంకరించేవారు. అనేక హంగులకు చాల వరకు సుందరీబాయి క్షీరసాగరు (రాధాకృష్ణమాయి) కారకురాలు.

ఆ నాడు 11  జనవరి, 1912.

సాయిబాబా సాయంకాలం నడిచి ద్వారకామాయి చేరుకున్నారు. అప్పుడే ఫోనోగ్రాఫ్ ప్రారంభమయ్యింది.

అది గ్రాంఫోను. మొదటిసారిగా రాధాకృష్ణమాయి ప్రారంభించింది. ఆ గ్రాంఫోను రికార్డు శబ్దానికి సాయిబాబాకు కోపం వచ్చింది. తిట్ట నారంభించాడు.

ఆ గ్రాంఫోనును సాయి కోసం రాధాకృష్ణమాయి తెప్పించి మొదటిసారిగా పనిచేయించింది.

మొదటిసారిగా దేనినైనా ప్రారంభించేటప్పుడు బాబాకు కోపం రావటం అలవాటు. మొదటి సారిగా శ్రీరామనవమి, గురుపూర్ణిమలు మొదలు పెట్టినప్పుడు సాయికి కోపం వచ్చింది.

సాయి అలా కోపం తెచ్చుకోవటం ముందు ముందు రాబోయే అడ్డంకుల మీద అయివుంటుంది అని అందరు భావిస్తారు.

సాయిబాబా వద్ద గ్రాంఫోను, అనేక రికార్డులు కూడా ఉండేవి .

గ్రాంఫోనును గూర్చి ఒక చిన్న బాలుడు అంతరార్థాన్నీ తెలుపుతాడు అందరకూ ఆశ్యర్యం కలిగించేటట్లు. ఆ బాలుడు నాచే కుమారుడు.

ఆ బాలకుని పేరు కాలూరాం. 1919 లో సాయి అశిస్సులతో జన్మించాడు. ఆ బాలుడు సందేశ్ అనే పత్రికలో రికార్డు ప్రకటనను చూచాడు.

ఆ గ్రాంఫోన్ ముందొక కుక్క శ్రధ్ధగా వినుచున్న బొమ్మ(లోగో) ఉన్నది.

తండ్రిని “అది ఏమి”? అని ప్రశ్నించాడు. అది “గ్రాంఫోను ప్రకటన” అన్నాడు తండ్రి.

“ఇది శ్రీ కృష్ణుడు ఇచ్చిన ప్రత్యేక సందేశం” అన్నాడు కాలూరాం. “ఏమిటా ప్రత్యేక సందేశం” అని ప్రశ్నించాడు తండ్రి.

“కుక్క ఏమి వింటోంది?” ప్రశ్నించాడు కుమారుడు. “గ్రాంఫోను నుండి వచ్చే సంగీతాన్ని” అన్నాడు తండ్రి.

“ఆ కుక్క తన యజమాని పలుకులు వినుచున్నది. ఆ కుక్కను చూడుము. అది తల మొదలు తోక వరకు కదలక మెదలక ఎంత శ్రద్దగా వినుచున్నదో! మనము కూడా ఆ విధముగా నిశ్చలముగా నుండవలయును.

నే నెటుల కూర్చుంటినో చూడుము. నీవును అటులే కూర్చుంది వినవలయును” అన్నాడు కాలూరాం.

“నీవు సాయిబాబా పలుకులెట్లు ఎరుగుదువు?” ప్రశ్నించాడు తండ్రి. ఎందుకనగా సాయిని ఆ కాలూరాం చూడలేదు.

కాలూరాం “నేను ఎరుగుదును. నేను నీకు చెప్పను. నీకు నీవే అభ్యసించి వినవలయును” అన్నాడు.

అంత శ్రద్ధగా వినుటకు మనము ప్రయత్నించెదము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles