Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
రామకృష్ణ పరమ హంస తన చిత్రాన్ని చూపిస్తూ “ఇది రైలు పెట్టెలలో, సముద్రం మీద, ఓడలలోను పయనిస్తుంది. ప్రజలు జేబులలోను, తమ చేతి గడియారాలపైనా ఉంచుకుంటారు” అన్నారు. అది సత్యమైంది.
సాయిబాబా విషయంలోనూ అది సత్యమే అయ్యింది.
హరిసీతారాం దీక్షిత్ కు 16 జనవరి, 1925న ఒక సాయి భక్తుడు “మీరు నాకు శ్రీ సాయిబాబా ఫోటోను, ఊదీని ఇచ్చారు.
ఆ ఫోటోను, ఊదీని నేను ఎప్పుడు వెంట ఉంచుకోవటం వలన ఎన్నో సమస్యల నుండి బయటపడ్డాను” అని రాశాడు.
1925 నాటికే సాయి చిత్రం, ఊదీ సాయి భక్తునికి తోడు నీడ అయి కూర్చున్నాయి. 90 ఏళ్ళ అనంతర పరిస్థితి చెప్పనక్కర లేదు.
నాసిక్ లోని న్యాయవాది ధూమాల్ సాయిబాబా చిత్రాన్ని రాధాకృష్ణ మాయి వద్ద నుండి గైకొన్నాడు.
దానిని తన వాడాకు తీసుకు పోవుచుండగా సాయిబాబా చూచాడు. “భావ్! అది ఏమిటి?” అని అడిగాడు.
ధూమాల్ “బాబా! నీవు ఇందు గలవు” అన్నాడు. సాయి “నా కిమ్ము” అని ఆ చిత్రాన్ని తీసుకొని “దీనిని భద్రముగా ఉంచుకొనుము” అన్నాడు.
ఇటువంటి మహద్బగ్యము కొరకే అతడు చాల కాలము నుండి వేచి యున్నాడు. ప్రతి నిత్యం దానిని పూజించు చున్నాడు.
అయితే ఒక చిక్కు వచ్చింది. ధూమాల్ నాసిక్, దేవార్ ల మధ్య అనేక సార్లు ప్రయాణం చేయవలసి వచ్చేది.
అయన తన వెంట ఆ సాయి చిత్తరువును తీసుకు వెళ్ళేవాడు. అంటే సాయినాథుడు ధూమాల్ కు తోడు, నీడ అయినాడు.
ప్రతిసారి ఆ చిత్రమును, ఇతర చిత్రములను వెంట తీసుకు వెళ్ళేవాడు. కొందరు ఆయనను “వాటిని అక్కడ ఉంచవచ్చును గదా” అన్నారు.
ఆ విషయంలో సాయి నిర్ణయం ఏమిటో తెలుసు కుందామని చీటీలు వేశేవాడు. ప్రతిసారి పటాలను వెంట తీసుకు వెళ్ళమనే వచ్చేది. ఆ చీటీల ద్వార సాయి ఆదేశం ఇచ్చారు.
దత్తాత్రేయ దామోదర్ రాస్నే తన కుటుంబంతో తీర్థ యాత్రలకు వెళ్ళాడు. అప్పుడు కూడా అయన వెంట సాయి చిత్రం ఉండేది.
మూత్ర అనే ప్రదేశములో ఆయనకు కలరా సోకింది. జీవించటమే కష్టమనిపించింది. సాయిబాబా ఫోటోను తల వద్ద పెట్టి సాంబ్రాణి కడ్డీలు వెలిగించాడు.
అప్పటికే బాబా మహా సమాధి చెందారు. అయినా సాయి ఉరుకోనడు, దత్తాత్రేయుడు స్వస్తత పొందాడు, సుఖంగా జీవించాడు.
అంతే గాక ప్రతి మనిషి జేబులో, గడియారంపై, పర్సులలో ఇంకా అనేకమైన వాటిల్లోంచి తొంగి చూస్తూనే ఉంటానన్నాడు సాయి.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- వద్దు, వద్దు!…..సాయి@366 జూన్ 29…Audio
- చతుష్పాదులు – ఉత్తమ గతులు…..సాయి@366 అక్టోబర్ 8….Audio
- సాయిబాబా నా జీవితపు తోడు నీడ-సాయి భక్తురాలు సన్యోగిత:
- సాయిబాబా నా తోడు ఉన్నాను అని చెప్పారు.
- తాజుద్దీన్ బాబా…..సాయి@366 జనవరి 27….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments