Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా బోధనా పద్దతే వేరుగా ఉంటుంది. ఒకొక్క భక్తునిది లేదా సందర్శకునిది ఒకొక్క మనస్తత్వం.
సాయిని దర్శించే ఆ భక్తులు, సందర్శకులు వివిధ కోరికలతో వస్తుంటారు. సాయి వారికి మేలు చేసి పంపేవారు.
విషయం ఏమిటంటే ఆ భక్తుల పూర్వాపరాలు సాయి అడగరు. అంటే రోగం తెలుసుకోకుండానే వైద్యం చేసినట్లు. ఆయా సందర్భాలలో సాయి మాటలు వేరుగా ఉంటాయి.
గుప్తే అనే ఒక వ్యక్తి జనవరి 14న 1912లో షిరిడీకి వచ్చాడు. సాయిని దర్శించటానికి. ఏదైనా కోరిక ఉన్నదో లేదో తెలియదు.
జనవరి 15న సాయిబాబా ద్వారకామాయిలో ఒక పెద్ద కథను చెప్పారు. అందులో అనేక సంఘటనలు ఉన్నాయి. తలా తోక తెలియలేదు అక్కడే ఉన్న కపర్దేకు.
తరువాత తెలిసింది అవన్నీ గుప్తే జీవితంలో జరిగిన సంఘటనే అని.
యం.జి. ప్రథాన్ బొంబాయి నివాసి. అయన మొదటి సారిగా షిరిడీ వచ్చి సాయిని దర్శించుకుని ద్వారకామాయిలో కూర్చున్నాడు.
అతని తోటలో పండిన రామా ఫలాలు, సీతా ఫలాలను సాయికి సమర్పించాడు.
సాయి “ఎవరీ తెలివి తక్కువ వాడు? కొడుకు పోయినందుకు బాధపడుతున్నాడు? చనిపోవటమంటే భూమిలో కలిసి పోవటమే కదా! శరీరము ఎప్పటికైనా మట్టిలో కలసిపోవలసిందే! దానికి దుఃఖించటమెందుకు?” అన్నారు.
సాయి అక్కడున్న భక్తులతో ప్రథాన్ తోటలో ఏ ప్రదేశంలో ఎన్ని సీతాఫలం, రామాఫలం చెట్లు ఉన్నాయి, అతని కుమారుని మరణం, అతని దుఃఖం గురించి చెప్పాడు.
ఇన్ని వివరాలు తెలియ చెప్పటానికి సాయి బొంబాయి వెళ్ళలేదు, లేదా ఆ వివరాలన్నీ ప్రథాన్ సాయికి చెప్పలేదు.
అసలు మొదటిసారిగా షిరిడీకి వచ్చిన ప్రథాన్ నోరే తెరవలేదు. ఇవన్నీ సాయికి ఎలా తెలిసాయి?
ఇదీ సాయి బోధనా పద్దతి.
కథలన్నీ కంచికి చేరతాయి, ప్రతి సందర్శకుని విషయాలన్నీ సాయికి తెలుస్తాయి ఎందుకంటే సాయి సర్వాంతర్యామి.
వివరించి గాధలను, బాధలను సాయికి చెప్పనక్కరలేదు.
అంటే, సాయి మనలను చూస్తూనే ఉన్నాడు, చూస్తూనే ఉంటాడు. అది తెలుసుకోవాలి అందరూ…
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- నిర్ణేత సాయి …..సాయి@366 సెప్టెంబర్ 23….Audio
- నమ్మినవారు నవ్వులపాలు కారు! …..సాయి@366 మే 15….Audio
- మాట చాలదా? …..సాయి@366 జూలై 16…Audio
- తిరస్కారం నుండి పురస్కారం వరకు…..సాయి@366 జనవరి 19….Audio
- దాము అన్నా – తిని చావు …..సాయి@366 జనవరి 20….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments