మాట చాలదా? …..సాయి@366 జూలై 16…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


విధి రాతకు తిరుగు ఉంటుందేమో గాని, సాయి మాటకు తిరుగు ఉండదు.

ఒకసారి ప్రథాన్‌ కుటుంబం షిరిడీ నుండి బొంబాయికి వెళ్ళాలి. కానీ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.

సాయి అప్పుడు ”ఓ దేవా! చాలు. ఇక వర్షాన్ని ఆపు. నా బిడ్డలు తిరిగి ఇళ్ళకు వెళ్ళాలి. వారు కష్టపడకుండా ఇళ్ళకు చేరనీ” అన్నారు. అంతే! వర్షం ఆగిపోయింది. ప్రథాన్‌ కుటుంబం ప్రయాణం చక్కగా జరిగింది.

శ్రీకృష్ణ నారాయణ్‌ను ఛోటుభయ్యా సాహెబ్‌ పరూల్‌కర్‌ అంటారు. ఆయన హార్దాలో ఉండేవాడు. ఆయనకు ఆమ్లపిత్త వ్యాధి ఉండేది.

మధ్యాహ్నం భోజనం చేస్తే వాంతి అయ్యేది. పోనీ రాత్రిపూట తింటే, రాత్రి కూడా భోజనం చేసిన తరువాత వాంతి అయ్యేది.

సదాశివ రామచంద్ర పట్వర్ధన్‌ అనే సుప్రసిద్ధ వైద్యుడు ఆయన ఇంటికి వెళ్ళి వైద్యం చేసేవాడు.

స్వయంగా ఔషధాలను తయారు చేసి మరీ ఇచ్చాడు ఆ వైద్యుడు. వాంతులు ఇంకా ఎక్కువైనాయి.

ఇంట్లోని వారందరూ గాబరాపడ్డారు. ఆయన పూజా మందిరములోనికి వెళ్ళి భగవంతుని ప్రార్ధించాడు. వాంతులు ఆగిపోయాయి.

ఆయన ”ఇక ఏ వైద్యం పనికిరాదు. ఈ వ్యాధి కేవలం మహాత్ముల అనుగ్రహంతోనే నయమవుతుంద”ని గ్రహించాడు.

ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకు సాయిబాబా వీరి జీవితంలోకి ప్రవేశించాడు. సాయిని దర్శించుకున్నాడు.

సాయికి తన వ్యాధిని గూర్చి చెప్పలేదు. వ్యాధి అలాగే కొనసాగుతోంది. మరు సంవత్సరం గురుపూర్ణిమకు ఆయన, ఆయన సోదరుడు, మొత్తం ముగ్గురు, నలుగురితో కలిసి సాయిని దర్శించుకున్నాడు.

గురుపూర్ణిమ అనంతరం మూడవ రోజున (జూలై నెలలో) అంతా ద్వారకామాయిలో కూర్చున్నారు. అప్పుడే మావిసీబాయి వచ్చింది.

 ”అరే! మావిసీబాయి, ఇంత ఆలస్యం ఎందుకు చేశావు?” అని సాయి ఆమెను అడిగాడు. మావిసీబాయి ”బాబా, నాకు బాగా వాంతులు అవ్వటం వలన ఆలస్యమైంది” అని చెప్పింది.

సాయి అప్పుడు ”ఆ సోదరునికి (ఛోటూభయ్యాకు) కూడా చాలా రోజుల నుండి వాంతులు అవుతున్నాయి” అన్నారు.

నారాయణ సోదరుడు వెంటనే ”నా సోదరుడు వాంతులతో బాధపుతున్నాడు. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు” అన్నాడు.

సాయి ”ఇకనుండి వాంతులు రావు” అన్నాడు. ఆ క్షణం నుండి వాంతులతో – ఆమ్లపిత్త వ్యాధితో ఛోటూభయ్యా బాధపడలేదు.

సాయి మాటే మంత్రం!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles