వికటించిన కషాయం….సాయి@366 సెప్టెంబర్ 16….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


సాయిబాబా అపర ధన్వంతరి. వైద్యులకే వైద్యుడు. ఎంతో మందిని సాయి ప్రాణాపాయ స్థితినుండి కాపాడాడు.

సాయిబాబాకు నంది వంటి వాడు శ్యామా. అయితే శ్యామా బాబా వద్ద చనువుగా ఉండేవాడు.

ఒకసారి శ్యామాకు మూలశంక వ్యాధి వచ్చింది. ఆ సంగతి సాయి బాబాకు విన్నవించుకున్నాడు. ”మధ్యాహ్నం మందు ఇస్తాలే” అన్నారు సాయి.

ఆ మాటలను సాయి ఎందుకు అన్నారో తెలియదు. మధ్యాహ్నం వరకు అంటే తాను మందు ఇచ్చే వరకు ఆగగలడా? లేదా? అని సాయి శ్యామాను పరీక్షించ  దలచుకున్నట్లున్నారు సాయి.

సాయి మాటలను ఓర్పుతో విన్నాడు. అప్పటివరకు ఓర్పు చూపించాడు.

సాయిబాబా సోనాముఖి ఆకులను తెప్పించారు. వాటితో కషాయం చేసి శ్యామాకు ఇచ్చారు త్రాగమని.

ఆ మందు తీసుకోగానే మొలల పోయాయి. సాయి సన్నిధిలో అనేక అద్భుతాలను చూసేవాడు శ్యామా.

తాను కూడా సాయి సన్నిధిలో ఒక అద్భుతాన్ని అనుభవించాడు. సాయికి ధన్యవాదాలు అర్పించాడని వేరే చెప్పనక్కర లేదు.

ఇలా విచిత్ర మందు మాకులతో సాయి వైద్యం చేసేవాడు. ఇదంతా చూస్తున్న శ్యామా కూడా మందులిచ్చేవాడు.

సంవత్సరం గడిచింది, మరో సంవత్సరం కూడా గడిచింది. ఆ రోజు 16-9-1918 మరోసారి శ్యామాకు మొలల వ్యాధి వచ్చింది.

ఇప్పుడు కూడా భరింపరాని బాధ. గతంలో ఇటువంటి వ్యాధే తనకు రావటం, సాయి సోనాముఖి కషాయాన్ని తయారు చేసి తనకు ఇవ్వటం, తాను త్రాగటం, వ్యాధి నయమవటం గుర్తుకు వచ్చాయి.

వెంటనే తాను సోనాముఖి ఆకులను తెచ్చి, కషాయం చేసి, త్రాగాడు. వ్యాధి తగ్గలేదు. ఇంకా వ్యాధి ఎక్కువైంది. ఇక సాయి వద్దకు బయలు దేరాడు శ్యామా.

సాయి శ్యామా రావటం చూచాడు ”రావయ్యా, వైద్యరాజా! ఇప్పుడెట్లా ఉంది పరిస్థితి?” అని అడిగారు.

అంటే అక్కడున్న వారికెవరికీ అర్థం కాలేదు, కేవలం శ్యామాకు మాత్రమే అర్థమయింది.

చల్లకు వచ్చి ముంత దాచటం దేనికని శ్యామా మొత్తం చెప్పేశాడు. సాయి నవ్వారు. అనుగ్రహించాడు వ్యాధి మాయమయింది.

వ్యాధిని నయం చేసేవి మూలికలు, మందులు కావు. వ్యాధిని నయం చేసేది సాయి ఆశీర్వాదమే.

ఈ సంగతి శ్యామాకు తెలియక కాదు .. తెలిసి కూడా పొరపాట్లు చేయటం మానవ నైజం.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles