Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
నానా సాహెబ్ నిమోంకరు కుమారుడు సోమనాథ్ శంకర దేశపాండే
సెప్టెంబరు నెలలో 1936న కొన్ని ఆచరణీయ, ఆసక్తికర సంఘటనలను పేర్కొన్నారు.
సాయిబాబా శ్యామాని విష్ణు సహస్ర నామ పారాయణం – రోజుకొక నామము నైనా సరే – చేయమన్నారు.
శ్యామా మాతృ భాష మరాఠీ. సంస్కృతము రాదు. సాయికి ఆ విషయం తెలియదా? శ్యామాకు బాబా యందు పూర్తి విశ్వాసం. పారాయణ ప్రారంభించాడు.
కొలది రోజులలోనే దానిలో అత్యంత ప్రావీణ్యాన్ని సంపాదించాడు.
నార్కేకు కూడా బోధించ గల స్థాయికి చేరాడు.నానా సాహెబ్ నిమోంకరుకు భాగవతము మొదలైన గ్రంథాలను పారాయణ చేయాలని కోర్కె ఉండేది.
కానీ ఆయనకు సంస్కృతము రాదు. సాయియే ఆ విషయాన్ని ఎత్తారు. ”నువ్వు ఎందుకు పారాయణ చేయరాదు?” అని. ”నాకు సంస్కృతము రాదు” అన్నాడు నిమోంకరు.
”అయినా ఫరవాలేదు. ప్రారంభించు. ఈ మసీదు మాయి తప్పక సంస్కృతము నేర్పుతుంది. క్రమంగా నీవే నేర్చుకుంటావు” అన్నారు సాయి. అది సాయి దీవెన.
సాయినాథుని మాటను సరస్వతీ దేవి కాదనగలదా? అసలు సాయి, సరస్వతీ దేవి వేరయితే కదా!
సాయి మాటలమీద నమ్మకం ఉంచాడు. పారాయణ ప్రారంభించాడు. అర్థం కాకపోయినా చదవటం కొనసాగించాడు. అనతి కాలంలోనే ప్రావీణ్యత సాధించాడు.
భాగవతం, జ్ఞానేశ్వరి, భగవద్గీతలలో నిష్ణాతులైన కాకా సాహెబ్ దీక్షిత్, జోగ్ మొదలైన వారి సందేహాలను నివృత్తి చేసే స్థాయికి చేరాడు.
ఒకనాడు సాయి ”మనమెందుకు ఇతరులకు విశదపరచాలి? అలా చేయటం వలన మనలో అహం పెరుగుతుంది” అన్నారు ఆయనతో.
ఇతరులకు విశదపరచటం మాత్రమే నిలిపి వేశాడు. పారాయణను ఆపలేదు. సాయి కంటికి రెప్పలాగా చూచుకుంటాడు తన భక్తులను.
వారిలో అహం పెరగనివ్వడు. నిమోంకరు సాయి సమాధి చెందే ముందు మూడు సంవత్సరాలు సాయి అఖండ సేవలో ఉన్నాడు.
స్నాన, సంధ్యాది నిత్య కర్మలు చేసుకొనుటకు మాత్రమే ఇంటికి వెళ్ళే వాడు. సాయి ఆయనను ”కాకా” అని పిలిచేవాడు.
సాయి మహా సమాధి తరువాత ఆయన ఎక్కువ కాలం జీవించలేదు.
అవసాన కాలంలో చివరి మూడు రోజులు ఆయనకు అంతా, అందరిలో సాయియే దర్శన మిచ్చాడు. భార్యను సహితం సాయిబాబా అనేవాడు.
అలా అఖండ స్మరణలోనే సాయి సన్నిధిని చేరాడు ఆయన.
ఇది సేవా ఫలమే కదా!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- జగమే ‘జ్ఞానేశ్వరి’ ….సాయి@366 సెప్టెంబర్ 17…Audio
- పారాయణ ఫలం…..సాయి@366 జూలై 7….Audio
- సచ్చరిత్ర పారాయణ ఫలం …..సాయి@366 జూన్ 18…Audio
- రమ్య భవనం …..సాయి@366 మే 20….Audio
- విమానంలో సాయి సన్నిధికి …..సాయి@366 జూలై 5….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments