Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా మాటలు ఒకసారికే అర్థం కావు. కాకా సాహెబ్ దీక్షిత్ తాను ఏ గ్రంథాన్ని పారాయణ చేయమంటారని సాయిని అడిగినప్పుడు సాయి ”ఇక ఏకనాథుని బృందావన గ్రంథాన్ని పారాయణ చేయి” అన్నారు.
ఏకనాథుడు బృందావనమనే పేరుగల ఏ గ్రంథాన్ని వ్రాయలేదు, అందరూ అదే మాట అన్నారు.
కాకా సాహెబ్ బాబా వద్దకు ఏకనాథ భాగవతాన్ని తీసుకుపోయి ”ఇదేనా? మీరు చెప్పింది?” అని అడిగాడు.
కాకాకు ఇదెలా బృందావనమయిందో తెలియలేదు. సాయి మాటలమీద నమ్మకముంచి పారాయణ మొదలు పెట్టాడు కాకా.
సగానికి పైగా చదివాడు. అప్పుడు కూడా బృందావనం ప్రసక్తి రాలేదు. సరేలే, సాయి చెప్పారుగా అని పారాయణ పూర్తి చేయసాగాడు.
చివరి రోజు పారాయణ చేస్తుంటే ”ఇది ఏకాదశ స్కంథమే కాదు, 31 అధ్యాయాల బృందావనం, తమ స్వానంద నిజ పూర్ణ స్థితిలో ఇందులో శ్రీకృష్ణుడు సదా నివసిస్తాడు’‘ అని ఉంది.
కాకా కన్నుల వెంట ఆనంద భాష్పాలు రాలాయి. సాయి మాటలను తాను సరిగా అర్థం చేసుకోలేకపోయానని చింతించాడు కాకా.
ఆ గ్రంథపారాయణ అనిర్వచనీయ ఆనంద హేతువు అయింది కాకాకు.
ఏకనాథ శిష్యుడు మణికర్ణికా ఘట్టంలో మరాఠీలోని ఏకనాథ భాగవతం చదువుతుంటే, కాశీ పండితులకు కోపం వచ్చి ఏకనాథుని పైఠాను నుండి పిలిపించారు.
”సంస్కృత భాషలోని గ్రంథాలను మరాఠీలో వ్రాయటం పొరపాటుకాదా? అసలు నీకెవరు మారాఠాలో వ్రాయమని ప్రేరణ ఇచ్చారు”? అని పండితులు ప్రశ్నించారు.
”భతవంతుడే నాకు ప్రేరణ ఇచ్చాడు. సంకల్ప వికల్పాలు మాని ఒక్కసారి ఏకనాథ భాగవతాన్ని వినండి. తరువాత శిక్షించండి” అని వేడుకున్నాడు ఏకనాథుడు.
”సరే చదువుదాం” అన్నారు కాశీ పండితులు.
ఏకనాథుడు గురువును స్మరించి మరాఠా భాగవతాన్ని చదవసాగాడు.
ఆ భావగాంభీర్యం, శబ్ద రచన, పదలాలిత్యము, స్వర మాధుర్యము పండితులను పరవశింప చేశాయి. అందరూ జ్ఞాన గంగలో పునీతులమయ్యామని తలచారు.
ఏకనాథుని పల్లకీలో కూర్చోపెట్టి కాశీ పట్నంలో ఊరేగిస్తామన్నారు పండితులు. ‘‘నన్ను కాదు. ఆ ఏకనాథుని భాగవతాన్ని ఊరేగించండి” అన్నాడు ఏకనాథుడు.
అంతటి మరాఠీ ఏకనాథ భాగవతాన్ని శ్రీమతి మిరియాల విమలా శర్మ గారు మే 1999లో ఆంధ్రీకరించి, తెలుగు వారికి అందచేశారు. ఆ కృష్ణుని మధుర ధారలో పునీతులమగుదుము గాక!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- విమానంలో సాయి సన్నిధికి …..సాయి@366 జూలై 5….Audio
- గ్రంథములను పవిత్రముచేసి కానుకగా నిచ్చుట (ఏకనాథ భాగవతమును – శ్యామా)
- జన్మ జన్మల బంధం …..సాయి@366 డిసెంబర్ 23….Audio
- జ్ఞానేశ్వరుని పుత్రిక …. మహనీయులు – 2020… డిసెంబరు 19
- సాయి చూస్తున్నాడు జాగ్రత్త!…..సాయి@366 అక్టోబర్ 24….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments