జ్ఞానేశ్వరుని పుత్రిక …. మహనీయులు – 2020… డిసెంబరు 19



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా కాకా సాహెబ్‌ దీక్షిత్‌ను “ఏకనాథ బృందావనము” ను పారాయణ చేయుమని ఆదేశించారు.

ఆ పేరుతో ఏ గ్రంథమూ లేదని ఎందరో చెప్పారు కాకాకు. సాయి పొరపాటుగా మాట్లాడతాడా? కాకా ఏకనాథుని ఏకనాథ భాగవతమును సాయి దృష్టిలో పెట్టుకుని చెప్పారని ఊహించి పారాయణ చేస్తాడు. చివరి అధ్యాయంలో “ఏకనాథ జ్బృందావనం” అనే మాట వస్తుంది.

ఇక గులాబ్‌రావ్‌ మహారాజ్‌ విషయము. ఆయన ఉపన్యసిస్తూ నారద పంచ రాత్రి నుండి శ్లోకాలను తెలుపుతారు.

ఉత్సాహము గల భక్తులు ఆ పుస్తక వివరాలను  అడిగారు. అవి రెండే ప్రతులున్నవని, మధురలోనున్న పురోహితుని కుటుంబము వద్ద ఒకటి, నాగపూర్‌లోని భాన్స్యేరాజ పుస్తకభండాగారంలో మరొకటి ఉన్నదని చెప్పారు.

పని వేళల ప్రకారము పుస్తక భాండాగారము మూసివేయబడి ఉంది.  అధికారి ఇంటికి పోయి ఆ పుస్తకాన్ని అడిగారు ఔత్సాహికులు.

ఆ పుస్తకం ఎక్కడుందో చెబితేకాని, ఆ పుస్తకాన్ని ఇవ్వలేనని చెప్పాడు అధికారి. ఔత్సాహికులు మరల గులాబ్‌ వద్దకు వచ్చారు.

ఆ పుస్తకము ఏ గదిలో, ఏ అరలో, ఏ రంగులో ఉందో చెప్పారు గులాబ్‌రావ్‌ మహారాజ్‌.

అధికారికి ఈ విషయాన్ని చెప్పి, ఆ గ్రంథాన్ని తీసుకొని మహారాజ్‌ వద్దకు రాగా, మహారాజ్‌  ఆ శ్లోకాన్ని ఆ గ్రంథంలో చూపారు. అందరూ ఆశ్చర్యపోయారు.

గులాబ్‌రావ్‌ మహారాజ్‌కు విద్య లేదు, పుస్తకాలతో పరిచయమే లేదు, పైగా రెండు కన్నులు  పనిచేయని అంథుడు. ఇదంతా ఎలా సాధ్యమైంది.

భౌతిక నేత్రాలను 9వ నెలలోనే కోల్పోయిన గులాబ్‌రావ్‌ మహారాజ్‌ తన శిష్యులతో జ్ఞానేశ్వరుని మహాసమాధిని, ఆళందిలో దర్శించాడు.

తదేక దీక్షతో అక్కడే కూర్చుండి పోయాడు. కన్నుల నుండి ఆనందాశ్రువులు రాలసాగాయి, కాదు ప్రవహించసాగాయి. జ్ఞానేశ్వర్‌ మహారాజ్‌ సాక్షాత్మారమయ్యేదాక, పచ్చి గంగను కూడా ముట్టనని, ఆయనను గూర్చి చింతన చేయసాగాడు గులాబ్‌రావు.

నిముషాలు, గంటలయ్యాయి, గంటలు రోజులయ్యాయి. మూడు రోజులు గడిచాయి. ఇక ఆ జ్ఞానేశ్వరుడే ప్రత్యక్షమయ్యాడు.

భౌతిక నేత్రాలు లేకున్నా గులాబ్‌రావ్‌కు జ్ఞాన నేత్రాలు ప్రసాదించాడు. తన తొడపై కూర్చోబెట్టుకున్నారు గులాబ్‌రావ్‌ను.

ఎన్ని అతీంద్రియ శక్తులను ప్రసాదించాడో చెప్పలేము. ఏ పుస్తకమును చూడకున్నను, చదువకున్నను, అది ఏ భాషలో నున్నను చదువగలడు గులాబ్‌ వివిధ భాషలలో వ్రాయగలడు, వివిధ విషయాలపై వ్రాయగలడు.

గులాబ్‌రావ్‌ దివ్య దృష్టితో తిలకించిన జ్ఞానేశ్వరుని రూపము, భక్తులకు కన్నుల పండుగ చేయుచున్నది.

తాను జ్ఞానేశ్వరుని కుమార్తెనని వివిధ మతముల మధ్య సమన్వయము చేయుటయే కాక, ప్రాపంచిక విషయాలైన డార్విన్‌ మహాశయుని పరిణామ సిద్దాంతము మొదలగు వాటిపై అనేక గ్రంథాలను వ్రాశారు.

ఆయన జీవించినది కేవలము 34 ఏండ్లే, కను చూపు కరవైనా, కనులున్న వారికి దారి చూపిన ఆ మహనీయుని స్మారక తపాలా బిళ్లను భారత ప్రభుత్వం 19-12-2018న విడుదల చేసింది.

నేడు గులాబ్‌రావ్‌ మహారాజ్‌ను, జ్ఞానేశ్వరులను స్మరించెదము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles