Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
ఆ రోజు డిసెంబరు 19 , 1912 వ సంవత్సరం.
తాత్యా సాహెబ్ నూల్కర్ తానూ చేస్తున్న సబ్ జడ్జి పదవీ విరమణ స్వచ్చందగా చేసి, షిరిడీ వచ్చాడు. సాయి చరణాలలో ఐక్యమవ్వాలనే ఏకైక తలంపుతో.
నూల్కర్ ఆరోగ్యం క్షిణించింది. సాయి అతనిని ఆరోగ్యవంతునిగా చేయగలడు – కానీ చేయలేదు.
నూల్కర్ కూడా సాయిబాబా తనకు ఆరోగ్యంగా సాయి సన్నిధిలో ఉండేటట్లు చేయమని కొరకపోవటం విశేషం.
మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నూల్కర్ ఆరోగ్య స్థితి నానాటికీ క్షీణిస్తోంది. ఎంతగా క్షిణిస్తోందంటే మసీదుకు, చావడికి కూడ నడచి రాలేని పరిస్థితి ఏర్పడింది.
ఇక పడకపై నుండి కూడా కదలలేని స్థితి. అందరూ సాయి చమత్కారంగా అతనిని మామూలు మనిషిగా చేస్తారని ఆశించారు. కానీ, సాయి అలా చేయలేదు.
నూల్కర్ సాయి పాదోదకం సేవించి సాయి చరణాలలో లీనమైనాడు.
సాయి ఖేదించాడు. సాయి ఆరోగ్యవంతునిగా ఎందుకు చేయలేదు. నూల్కర్ ప్రస్తుత జీవితంలో చేయవలసిన కార్యక్రమం ఏమీ లేదు.
సాయి ఆయువును పొడిగించటం వలన నూల్కర్ కుటుంబానికి ఏమీ ఒనగూడదు.
అందుకే సాయి నూల్కర్ ను తనలో ఐక్యం చేసుకున్నాడు.
కొంత కాలం గడిచింది.
నూల్కర్ భార్యకు ఒక వైపు సాయిబాబా, వేరొక వైపు నూల్కర్ ఉన్న లాకెట్ ను తయారు చేయించి, దానిని సాయి చేతుల మీదగా గ్రహించాలని కోరిక ఉన్నది.
దానికి తగ్గట్లు ఒక వైపు సాయి, వేరొక వైపు నూల్కర్ ఉండేలా ఒక బంగారు లాకెట్ ను తయారు చేయించాడు నూల్కర్ తనయుడు విశ్వనాధ్.
ఆ లాకెట్ ను నూల్కర్ ఫోటోను, పార్సిల్ లో శ్యామాకు పంపాడు విశ్వనాధ్. ఆ పార్సిల్ 19 డిసెంబరు, 1912 , గురువారంనాడు సాయికి చేరింది.
సాయి ఆ పార్సిల్ విప్పదీయక ముందే “ఈ లాకెట్ లో ఇద్దరు వ్యక్తులున్నారు”, అన్నాడు.
అందరూ ఆశ్చర్యపోయారు, ఆ పార్సిల్ విప్పదీసిన తరువాత లాకెట్ లో సాయి, నూల్కర్ లు ఉన్నారు.
సాయి 15 నిముషాలు ఆ లాకెట్ ను తన చేతిలో పెట్టుకున్నారు. నూల్కర్ ఫోటోను చూపిస్తూ “యితడు నన్ను తనతో తీసుకెళ్ళాడు”. అన్నారు.
షిరిడీలో ఉన్న అతి కొద్దీ కాలంలో సాయిని కోరికలతో వేధించక, సాయి మనస్సును ఆకట్టుకున్న నూల్కర్ భక్తి ప్రేమలు అగణితమైనవి!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- రాలిన నక్షత్రం!…..సాయి@366 మార్చి 19….Audio
- షిరిడీలో ప్రథమ గురుపూర్ణిమ…..సాయి@366 జూలై 3…..Audio
- బాబావారు యిచ్చిన లాకెట్లు–Audio
- కోరని వరాలిచ్చు కొండంత దేవుడు…..సాయి@366 నవంబర్ 25…Audio
- జన్మ జన్మల బంధం …..సాయి@366 డిసెంబర్ 23….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments