కోరని వరాలిచ్చు కొండంత దేవుడు…..సాయి@366 నవంబర్ 25…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


అక్రూరుడు మథురకు బలరామ కృష్ణులతో రధం మీద బయలుదేరాడు. అక్రూరుడు జన్మతః పుణ్యమూర్తి.

ఆయన దారిలో నున్న యమునలో స్నానమాచరించి, నడుము లోతు నీటిలో ఉండి గాయత్రీ మంత్రాన్ని జపించు చున్నాడు.

నదీ జలములలో బలరామ కృష్ణులు రూపములు కనిపించినవి. ఇది భ్రమయా అని నది బయటకు వచ్చి చూడగా బలరామ కృష్ణులు రధముపై ఆసీనులై ఉన్నారు.

మరల నదిలోనికేగి చూడగా ఆయనకు శేషుని ఒడిలో శ్రీకృష్ణుడు చతుర్భుజుడై కనిపించాడు.

దేవాది దేవుని రూపమునే గాక ఆయన పరివారమును కూడా తిలకించు అదృష్టము పొందినాడు అక్రూరుడు.

సాయి వేరుకాదు కదా! ఆయనయే మురళీ కృష్ణుడు. సాయి తనకు ఇష్టమైన రీతిలో భక్తులకు మహదానందము గలుగచేయును.

కుశాభావ్‌ గురు భక్తికి సాయి సంతసించి ఆయన సాయిని తలచినప్పుడల్లా దోసిలిలో వెచ్చని ఊది రాలునట్లు వరమిచ్చాడు.

సాయి సన్నిధి కోసం చేయు ఉద్యోగమును వదలి షిరిడీలో స్థిరపడ్డాడు నూల్కర్‌.

ఆయన ఆరోగ్యం క్షీణించింది. షిరిడీలో ఉన్నా సాయిని దర్శించే భాగ్యమునకు నోచుకోలేదు. తన కుమారుని సాయి వద్దకు పంపి సాయిని దర్శనమివ్వమని అర్థింపుమని పంపినాడు.

నూల్కర్‌ కుమారుడు సాయికి ఆ విషయం చెప్పటానికి వెళ్ళగా అప్పుడు బాబా ఒక పిల్లవానితో ఆటలాడుతున్నాడు.

ఆట అయిపోయిన తరువాత నూల్కర్‌ కుమారుడు తన తండ్రి కోర్కెను విన్నవించగా సాయి ”అల్లా భలాకరేగా!” అన్నాడు.

నూల్కర్‌ కుమారుడు తండ్రి వద్దకు వచ్చాడు. అక్కడ జరిగినదంతా చెప్పగా నూల్కర్‌ తన కుమారునితో ”ఆ సమయాన సాయి నాకు దివ్య దృష్టి ప్రసాదించాడు. సాయి దర్శనమైంది” అని చెప్పాడు.

అటులనే మరొక భక్తుని కూడా సాయి కరుణించాడు. ఆయన పేరు ఉద్దవేశ్‌ బువ. ఆయన సాయి మహా సమాధి చెందినప్పుడు చాతుర్మాస దీక్షలో ఉన్నాడు.

సాయి తనను కరుణించిన విధాన్ని కాకా సాహెబ్‌ దీక్షిత్‌కు 25-11-1918న ఇలా వ్రాశాడు.

”బాబా దశ దిన కర్మ రోజున చాతుర్మాస దీక్షలో ఉన్నందువల్ల బాబా నాకు షిరిడీలో జరిగిన కార్యక్రమాన్నంతా నాకు స్వప్న దర్శనం ద్వారా దర్శింపచేశాడు.

చాతుర్మాసంలో సీమోల్లంఘన చేయకుడదని బాబా స్వప్న దర్శనం ద్వారా అంతా దర్శింప చేశాడు”.

ఇవి సాయి కరుణకు, మహిమకు నిదర్శనాలు.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles