తాత్యాసాహెబు నూల్కర్



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్‌ కీ జై!!

తాత్యాసాహెబు నూల్కర్ గూర్చి హేమాడ్ పంతు ఏమియు చెప్పియుండలేదు. వారు షిరిడీలో కాలము చేసినవారని మాత్రము చెప్పెను. సాయిలీలా పత్రికనుంచి యీ వృత్తాంతమును గ్రహించితిమి.

1909వ సంవత్సరములో తాత్యాసాహెబు పండరీపురములో సబ్ జడ్జీగా నుండెను. అప్పుడు నానాసాహెబు చాందోర్కరు అచట మామలతదారుగా నుండెను. ఇద్దరు చాలసార్లు కలిసికొని మాట్లాడుచుండిరి. తాత్యాసాహబుకు యోగులయందు నమ్మకము లేకుండెను. నానాసాహెబుకు వారియందు మిగుల ప్రేమ. అనేక పర్యాయములు నానాసాహెబు, నూల్కర్ కు బాబా లీలలను చెప్పి, షిరిడీకి పోయి వారి దర్శనము చేయుమని బలవంతపట్టెను. తుదకు రెండు షరతులపై నూల్కర్ ఒప్పుకొనెను. అందులో ఒకటి బ్రాహ్మణవంటవాడు దొరక వలెను. రెండవది బహూకరించుటకు చక్కని నాగపూరు కమలాఫలములు దొరకవలెను. భగవత్కటాక్షముచే ఈ రెండును తటస్థించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబు వద్దకు రాగా ఆతడు వానిని తాత్యాసాహెబు నూల్కర్ వద్దకు పంపెను. ఎవరోగాని 100 కమలాఫలములను నూల్కర్ కు పంపిరి. రెండు షరతులు నెరవేరుటచే తాత్యాసాహెబు షిరిడీకి తప్పక పోవలసి వచ్చెను. మొట్టమొదట బాబా అతనిపై కోపగించెను. క్రమముగా బాబా యవతారపురుషుడని తగిన నిదర్శనములు తాత్యాసాహెబు నూల్కర్ కు లభించెను. కనుక నతడు బాబా యెడ మక్కువపడి తన యంత్యదశవరకు షిరిడీలోనే యుండెను. తన యంత్యదశలో మతగ్రంథముల పారాయణము వినెను. చివరి సమయములో బాబా పాదతీర్థము అతని కిచ్చిరి. అతని మరణవార్తవిని బాబా యిట్లనెను. “అయ్యో! తాత్యా మనకంటె ముందే వెళ్ళిపోయెను. అతనికి పునర్జన్మము లేదు.”

సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles