తాత్యాసాహెబ్ నూల్కర్ మరణము:..Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-132-తాత్యాసాహెబ్ నూల్కర్ మరణము 4:32

తాత్యాసాహెబ్ నూల్కర్ మరణము:

దినదినానికి శ్రీనూల్కర్ ఆరోగ్యము క్షీణీంచసాగింది.  శ్రీసాయి దయతో ఆరోగ్యము బాగుపడగలదని అతని కుటుంబ సభ్యులు ఆశతో ఉన్నారు.

బాబాసాహెబ్ తన స్నేహితుని సేవలో నిద్రాహారాలు లేకుండా రోజులు గడుపుతున్నాడు.

ఒకనాడు రాత్రి రెండుగంటలకు తాత్యాసాహెబ్ మూత్రవిసర్జన చేయటానికి బాధపడుతున్నారు.  మూత్రము పట్టె డబ్బా దగ్గరలో లేదు.  పనివాడు గదిలో లేడు.

తాత్యాసాహెబ్ నూల్కర్ యొక్క బాధను చూసి బాబాసాహెబ్ తన మిత్రునికి మూత్రము పోసే డబ్బా తెచ్చి ఇచ్చారు.  తాత్యాసాహెబ్ తన మిత్రుని ప్రేమకు చలించిపోయి కన్నీళ్ళు కార్చసాగాడు.

శ్రీసాయి అన్నమాటలు ఇద్దరూ గుర్తు చేసుకొన్నారు.  ఇదే ఋణానుబంధానికి గుర్తుగా మిగిలిపోతున్నది అనే భావన ఇరువురిలో కలిగింది.  రాత్రి మూడుగంటల సమయములో తాత్యాసాహెబ్ నూల్కర్ కు మలవిసర్జన జరిగింది.

అప్పటినుండి తాత్యాసాహెబ్ నాడి కొట్టుకోవడంలో తేడా కనిపించసాగింది.  తాత్యాసాహెబ్ నూల్కర్ తన చిన్నకుమారుని పిలిపించుకొని భజన చేయమన్నారు.

ఆయన స్వయంగా మెల్లిగా శ్రీసాయినామం ఉచ్చరించసాగారు.

డాక్టర్ వామనరావు తన తండ్రికి ఆఖరి క్షణాలు వచ్చినవని గ్రహించాడు.

డాక్టర్ గా తన విధి నిర్వహణలో యింజక్షన్ ఇవ్వదలచాడు.  కాని సిరంజి విరిగిపోయి ఉంది.

ఏమీచేయలేని స్థితిలో ఉన్నాడు.  తాత్యాసాహెబ్ తనకు యిష్ఠమైన భజనను తన ఇద్దరు కుమారులను కలిసి పాడమన్నారు.

ఆభజన వింటుంటే తాత్యాసాహెబ్ నూల్కర్ కన్నులలో ఆనందము కనిపించింది.

ఆసమయంలో ఆయన ప్రక్కన ఆయన  భార్య, ఇద్దరు కుమారులు,

బావమరిది, శ్రీకాకా సాహెబ్ దీక్షిత్ ఉన్నారు.  చిన్న కుమారుడు విశ్వనాధ్ ఉదయం ఐదు గంటల సమయంలో రాధాకృష్ణమాయి ఇంటికి పరుగున వెళ్ళి అక్కడినుండి శ్రీసాయి పాదతీర్ధాన్ని, ఊదీని తీసుకొని వచ్చాడు.  

పెద్ద కుమారుడు ఊదీని తాత్యాసాహెబ్ నుదుట వ్రాసాడు.  తాత్యాసాహెబ్ కన్నులు తెరచి తనవాళ్ళనందరిని ఒక్కసారి చూసారు.  ఆయన ముఖంలో  చీకుచింత లేదు.  

ప్రశాంత వదనముతో ఉన్నారు.  తన పెద్దకుమారుని చేతిలో ఉన్న శ్రీసాయిపాద తీర్ధాన్ని చూసి తన నోటిలో పోయమన్నారు.  శ్రీతాత్యాసాహెబ్ నూల్కర్ నోరు తెరిచారు.  

పెద్దకుమారుడు మూడు చెంచాల తీర్ధము తన తండ్రి నోటిలో పోసారు.  

మూడవ చెంచాతీర్ధము త్రాగుతుంటే శ్రీతాత్యాసాహెబ్ నూల్కర్ ఆఖరి శ్వాస తీసుకొన్నారు.  

అదే సమయంలో ద్వారకామాయిలో నుండి  శ్రీసాయి బయటకు వచ్చి ఆకాశములో చూస్తూ గట్టిగా అరుస్తూ తన నోటిపై చేతులతో కొట్టుకొంటూ తన బాధను వ్యక్తపరచి, ఈమశీదు వెనకాల ఒక నక్షత్రము రాలిపోయిందని అన్నారు.

అంతిమ సంస్కారాలు : శ్రీసాయి అన్నమాటలు:

తెల్లవారింది.  షిరిడి ప్రజలు సాఠేవాడ దగ్గర గుమిగూడి తాత్యాసాహెబ్ నూల్కర్ కు శ్రధ్ధాంజలి ఘటించసాగారు.  ఆయన పార్ధివ శరీరాన్ని దహన సంస్కారాల కోసం శ్మశానానికి తీసుకొని వెళ్ళారు.  

ద్వారకామాయికి లెండీబాగ్ మధ్య ఉన్న మార్గంలో  పరుగు పరుగున శ్మశానానికి వెళ్ళి తాత్యాసాహెబ్ నూల్కర్ ఆఖరి దర్శనము చేసుకొన్నారు.  

ద్వారకామాయిలో శ్రీసాయి విచార వదనముతో ఉన్నారు.  ఉదయమువేళ తీసుకొనే ఉపాహారము తీసుకోలేదు.  ఐదు ఇళ్ళకు భిక్షకు వెళ్ళలేదు.  తన చుట్టు కూర్చున్న భక్తులను ఉద్దేశించి ఇలాగ అన్నారు.

“తాత్యా నాకంటే ముందుగా ఈలోకం విడిచి వెళ్ళిపోయినాడు.  అతనికి పునర్జన్మము లేదు”.

ఈవిధముగా శ్రీసాయి అంకిత భక్తుడు శ్రీతాత్యా సాహెబ్ నూల్కర్ నిర్భయమైన మరణాన్ని పొంది శ్రీసాయి పాదాలలో లయమైపోయారు.

ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles