నిర్వి ఘ్నంగా మా అమ్మాయి పెళ్ళి అనుకున్న అబ్బాయితో బాబా పెళ్ళి జరిపించినారు–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్

మహరాజ్ కీ జై.

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-133-నిర్వి ఘ్నంగా మా అమ్మాయి పెళ్ళి అనుకున్న 5:45

అది 1990, అక్టోబరు చివరి వారం. బాబాగురించి మా పిన్నమ్మ ద్వారా తెలుసుకొని పూజిస్తున్నాను .మొదట్లో మా పిన్నమ్మను అరిచేవాడిని “బాబాను ఏమిటి పూజించేది”? అని ఒక రోజు అలానే పిన్నిని అరిచాను.

ఆ రోజు రాత్రి బాబా నాకు కలలో ప్రత్యక్షమై బాబా పట్ల నాకున్న పొరలు తొలగిమ్చినారు.

ఆ కలలో “ఒక దగ్గర కొందరు భజన చేస్తూ నిప్పుల గుండం తొక్కుతూ కనిపించారు.

నేను పూనకం వచ్చినవాడిలా ఉగిపోతున్నాను. మా బంధువులందరూ నన్ను తాళ్ళతో కట్టేసినా వాటిని తెంచుకొని, ఎవరికీ అలవికాకుండా ప్రవర్తిస్తున్నాను,

ఆ తరువాత వారు ఒక కారును తీసుకొచ్చి, నన్ను తాళ్ళతో కట్టేసి నన్ను అందులో పడేశారు.

ప్రక్కనే నిప్పుల గుండం త్రోక్కుతున్న వారు నన్ను కారులో తీసుకొనిపోయి భజనమండపంలో తోసేశారు,

అక్కడే వున్న కొందరు పసుపు నీళ్ళు చల్లండి అంటున్నారు, ఇంతలో బాబా ప్రత్యక్షమై అభయ హస్తంతో దీవిస్తూ కనిపించారు.” ఉలిక్కిపడి నిద్రలో నుండి మేల్కొన్నాను.

తెల్లారి సూర్యోదయం నిజంగా నా జీవితానికి అసలైన ఉషోదయంగా మారింది.

బాబాకు టెంకాయ కొట్టి ‘నాయన ఇక నిన్నెప్పుడు నిందించను అంటూ బాబావారి పాదాల ముందు వాలాను. అప్పటి నుండి బాబాను నమ్ముకొని మా కుటుంబ సభ్యులందరం ఆయననే పూజిస్తున్నాము.

ఆయన్ను నమ్ముకున్నందులకు అయన మాకు చేసిన సహాయాలు ఎన్నని చెప్పను? బాబా ద్వారా పొందిన అనుభవాలను ‘సద్గురులీల’ పత్రిక ద్వారా పంచుకుంటున్నందుకు ఆనందంగా వుంది.
ఆది 1991 వ సంవత్సరం మే నెల 21వ తేది, నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది,

వెంటనే కావలిలో స్పెషలిస్ట్ డాక్టరును కలిశాము, ఆయన అన్ని పరీక్షలు చేసి, నాకు గుండె, ఉపిరితిత్తులు చిల్లులుపడ్డాయని హాస్పిటల్ కు రావడం ఇప్పటికే ఆలస్యం అయిందనీ, మరో 24 గంటలకంటే ఎక్కవ బ్రతకనని, వెంటనే మద్రాసుకు వెళ్ళమని సలహా ఇచ్చినాడు.

మద్రాసుకు వెళ్ళె ప్రయత్నం చేస్తూ, బాబాకు నా ఆరోగ్యం బాగయితే శిరిడీకి వస్తానని మొక్కుకున్నాను.

మద్రాసులో దాదాపు 50వెల రూపాయలు ఖర్చు అయింది. బాబా దయవలన నా ఆరోగ్యం కుదుటపడింది.
1990కు ముందు నాకు అర ఎకరం పొలం మాత్రమె వుండేది.

అది అమ్మేసి మరోచోట రెండు ఎకరాలు కొన్నాను. 97లొ మరో ఎకరా కొన్నాను. 99లొ మరో మూడు ఎకరాలు కొన్నాను, 2000లో మరో ఎకరం పొలం కొన్నాను.

నేను బాబాను నమ్ముకున్నందువల్లనే ఇంత పొలం కొన్నాను అని నా నమ్మకం.
బాబాను నమ్ముకున్నరోజు నుండి మా ఇంటిలో అందరం సంతోషంగా వుంటున్నాము. ఇలా ఉండగా, మా అమ్మాయికి పెళ్లిప్రయత్నాలు ప్రారంభించినాను.

ఈ విషయంలో కూడా బాబా సహాయం అర్ధించినాను. ఒకసారి శిరిడీ వచ్చి వెళ్ళు అన్నారు.

2007లో విజయదశమి అయిన తర్వాత శిరిడికి వెళ్ళివచ్చినాను. 2008లో మా అమ్మాయికి తగిన జోడి అనుకున్న అబ్బాయి దగ్గరకు వెళ్ళి మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగినాను.

అందుకు ఆ అబ్బాయి నిర్ద్వంద్వముగా తిరస్కరించినాడు. చాలా నిరుత్సాహపడినాను.

నా మొర బాబాకు చెప్పుకున్నాను. బాబా నాకు ఉరట మాటలు చెబుతూ, పెళ్ళి తప్పకుండా జరుగుతుంది. ప్రస్తుతం కొన్ని చిక్కులు ఏర్పడతాయి. తన నామస్మరణ చేసుకుంటూవుండమని చెప్పినారు.

నేను అలాగే చేస్తూ ఆ అబ్బాయిని మరోసారి అడిగినాను అప్పుడుకూడా ఆ అబ్బాయి ఒప్పుకోలేదు.

చేసేదిలేక బాబానే ప్రార్దిస్తూ వుండినాను కొద్దిరోజులోనే, రెండుసార్లు తిరస్కరించిన ఆ అబ్బాయి తనే నన్ను కలిసి పెళ్ళి విషయాలు మాట్లాడి, తానె పురోహితుడిని కలిసి పెళ్ళి ముహూర్తం పెట్టించినాడు.

పెళ్ళి తేది ఆ అబ్బాయి నోటిగుండా విని నా ఆశ్చర్యానికి అంతు, ఆనందానికి హద్దులు లేకుండా పోయినాయి. అంతా బాబాదయ అనుకోని జరగవలసిన పెళ్ళి పనులన్నీ చకచకా జరిపిమ్చినాను…. కాదు కాదు బాబా జరిపించినారు.

నిర్వి ఘ్నంగా మా అమ్మాయి పెళ్ళి అనుకున్న అబ్బాయితో బాబా పెళ్ళి జరిపించినారు.

పెళ్ళి అయిన తరువాత అమ్మాయిని అల్లుడిని తీసుకోని 2008 విజయదశిమికి బాబాను దర్శిచుకోవడానికి అందరం కలిసి శిరిడీ వెళ్ళినాము.

బాబాను దర్శించుకొని తిరుగు ప్రయాణంలో రైలులో ‘సద్గురు లీల’ పత్రిక సంపాదకుడు కలిసినారు. బాబాతో నా అనుభవాలు చెప్పమని అడిగితె జరిగిన పై అనుభవాలు చెప్పినాను.

నన్నూ, నా కుటుంభాన్ని ఎల్లవేళలా కంటికిరెప్పలా కాపాడుతున్న బాబా పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు చేసుకుంటున్నాను.

పిల్లిమెట్ల శ్రీనివాస రావు
మునులవుడి గ్రామం, నెల్లూరు జిల్లా.

సంపాదకీయం: సద్గురులీల (మే – 2009)

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles