Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
బాబా సమస్యలు తొలగించి నా పెళ్ళి జరిపించారు రెండవ బాగం…..
ఒకసారి బెంగుళూరు, బిటియం లో ఉన్నబాబా గుడికి వెళ్ళినపుడు అక్కడ పూజారి బాబా పాదుకలను అలంకరించమని అడిగారు. అది బాబా ఆశీర్వాదం లాగ అనిపించింది. బాబా నా ప్రార్థనలు వింటున్నారని, దానికి జవాబుగా నాకు అనుకూలమైన సూచనలు కనబడేవి.
నా ప్రార్థనలకు జవాబుగా బాబా ఫోటోలు నాకు దొరకడం, ప్రసాదం, పువ్వులు, ఆధ్యాత్మిక పుస్తకాలు బాబా గుడిలో సాయి భక్తులు నాకు ఇవ్వడం, బాబా మెసేజ్ లు, నాకు ఇష్టమైన భజనలు గుడిలో వినిపించడం, బాబా నాకు స్వప్నదర్శనం ఇవ్వడం ఇలా జరిగేది.
మా అమ్మ కూడా సాయి నవ గురువారవ్రతం మొదలుపెట్టింది. నా పెళ్ళి గురించి చాలా వ్యాకులపడుతూ ఉండేది. నా జీవితానికి అర్థమే లేదు అని అనుకున్నప్పుడల్లా పైన చెప్పిన అనుకూల సంకేతాల వల్ల ఎక్కడ లేని ధైర్యం వచ్చి, తిరిగి జీవితంపై ఆశ కలిగేది.
నా బాయ్ ఫ్రెండ్ నుండి నాకు ఒక మంచి కబురు కూడా వచ్చేదికాదు. మా అమ్మ చాలా తపిస్తూ ఉండేది. నేను నా బాయ్ ఫ్రెండ్ ను పెళ్ళి చేసుకుంటానా, లేదా అని బాబా ముందర చీట్లు వేసి అడిగింది. దానికి “లేదు” అని జవాబు వచ్చింది.
ఇక నాకు పూర్తిగా మనసు విరిగిపోయింది. చాలా ఏడ్చాను. బాబా నుండి వచ్చిన ఈ ప్రతికూల జవాబు తర్వాత నేను బాబాకు మనఃస్ఫూర్తిగా శరణాగతి చేశాను. నా భారం అంతా ఆయన పాదాలకే వదిలేసి, “బాబా! నీవు నాకు ఎవరు సరైన వ్యక్తి అనుకుంటే వారితో పెళ్ళి జరిపించండి” అని బాబాని వేడాను. ఆ తర్వాత బాబాని మనఃస్పూర్తిగా ఏ కోరిక లేకుండా ప్రార్థించేదాన్ని.
మా అమ్మ నాకోసం సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. నా మనసు చాలా ప్రశాంతంగా ఉండేది. నేను బాబా “ప్రశ్నలు-జవాబులు” వెబ్ సైట్ లో బాబాని ఎప్పుడు ప్రశ్నలు అడిగినా సమాధానాలు అనుకూలంగానే వచ్చేవి.
బెంగుళూరు బిటియం లో వున్న బాబా గుడిలో “సాయికోటి స్థూపం” ఉంది. 48 రోజులు రోజుకు 11 సార్లు ఆ స్థూపమునకు ప్రదక్షిణలు చేస్తే మనం కోరిన కోరికలు తీరుతాయి. సాయి కోటి పుస్తకాలు భక్తుల చేత వ్రాయించి స్థూపము లోపల ఉంచి వాటిపైన స్థూపాన్ని ప్రతిష్ట చేసారు. స్థూపం అనేది మట్టితో లేదా వేరే లోహముతో తయారు చేయబడిన స్మారక చిహ్నము. అది పవిత్రమైన స్థలముని సూచిస్తుంది.
నాకు దాని గురించి తర్వాత తెలిసింది. నేను స్థూపమునకు భక్తితో 11 సార్లు తిరగడం మొదలుపెట్టాను. నాకు తగిన అబ్బాయితో పెళ్ళి జరిపించమని బాబాను భక్తితో వేడాను. బాబా నన్ను షిరిడీకి పిలిచారు. దర్శనం ఎంతో బాగా జరిగింది.
2012 జనవరిలో క్రొత్త సంవత్సరం ప్రారంభంలో, ఆశ్చర్యంగా నా బాయ్ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి క్షమాపణ అడిగాడు. తరచుగా ఫోన్ చేయసాగాడు. తన తప్పులను ఒప్పుకున్నాడు. బాబా దయవలన మా ఇద్దరి మధ్య జరిగిన గొడవలకు మా ఇద్దరిదీ బాధ్యత అని తెలుసుకున్నాడు.
వాటిని అర్థం చేసుకొని, సర్దుకొని మా ప్రేమను గౌరవించాల్సింది పోయి తను మా ప్రేమబంధాన్ని తెంచేసాడు. తను చేసిన దానికి పశ్చాత్తాప పడుతున్నట్టు చెప్పి, నా ఇష్టాన్ని ఇక మీదట గౌరవిస్తానన్నాడు. ఆ అబ్బాయి నా జీవితంలోకి మళ్ళీ రావాలో వద్దో కూడా నన్నే నిర్ణయించుకోమన్నాడు.
నేను అయోమయంలో పడ్డాను. బాబాను సహాయం కోసం, సలహాకోసం నా మనసులో వేడాను. తను చేసిన తప్పును తెలుసుకున్నందుకు నేను చాలా సంతోషపడ్డాను. బాబాకి కృతజ్ఞతలు తెలిపాను. నా బాయ్ ఫ్రెండ్ నన్ను కలవాలని కోరాడు. చాలాకాలం తర్వాత బాబా గుడిలో మొదటిసారి కలుసుకున్నాము. బాబాయే కనుక మా బంధాన్ని ఒప్పుకునేటట్టు అయితే అనుకూలంగా ఒక సూచన చూపించమని బాబాని వేడకున్నాను.
మేము చాలా సేపు మట్లాడుకున్నాము. నా బాధలన్నీ తను విని ఓదార్చాడు. తన గొంతులో నామీద తనకు ఉన్న ముందటి ప్రేమను చూడగలిగాను. మా ఇద్దరి మధ్య సాగిన చాలా కాలపు గొడవలు, నేను తనని విసిగించే తీరును చూసి ముందు తను భయపడ్డాడని చెప్పాడు.
నేను ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోయాను. ఇంకా భయంగానే ఉంది. మరుసటిరోజు బ్లాగులో నా షిరిడీ దర్శనం అనుభవాన్ని చూసి చాలా సంతోషం వేసింది(అందులో బాబాని నాకు తగిన అబ్బాయితో పెళ్ళి జరగడానికి సహాయం చేయమని వేడాను).
ఆ అనుభవాన్ని మేము ఆరు నెలల తర్వాత మొదటి సారి కలుసుకున్నపుడు బ్లాగ్ లో పోస్ట్ చేసారు. బాబాని నాకు అనుకూలంగా సూచన చేయమని ప్రార్థించాను. నేను ఇది బాబా ఆశీర్వాదంగా తలచాను.
ఇప్పుడు పరిస్థితి చాలా మెరుగయింది. ఇది అంతా బాబా దయవలనే. ఈ సమస్య వల్ల మేము మరింత దగ్గరయ్యాము. తను చాలా మారిపోయాడు. ఓర్పులోను, నన్ను బాగా చూసుకోవడంలోను ఇంతకు మునుపు కన్నా ఇప్పుడు చాలా మారాడు. నేను కూడా నా తప్పులను తెలుసుకొని అతనిని విసిగించడం మానేశాను.
నాకెప్పుడయినా సమస్యలెదురైనప్పుడు, నా బాయ్ ఫ్రెండ్ లో మార్పులు రావాలనుకున్నప్పుడు బాబాని మౌనంగా ప్రార్థించే దానిని. బాబాని ప్రార్థించడంవల్ల నా బాయ్ ఫ్రెండ్ లో ఏమైనా సమస్యలు ఉంటే అవి తొలగిపోయేవంటే నమ్మండి.
బాబా నన్ను జీవితములో సరైన నిర్ణయం తీసుకునేలా చేశారు. మా జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మమ్మల్ని కాపాడుతూ ఉండమని ఆయన పాదాల మీద శరణాగతి చేసి ప్రార్థిస్తాను.
మేము తిరిగి కలుసుకోవడం అంతా బాబా ఆశీర్వాదమే. బాబా చేసిన ఈ అధ్బుతమైన లీలకు ఎప్పటికీ ఆయనకు కృతజ్ఞురాలిని. మా జీవితాల్లో ఇటువంటి సమస్యే కనుక రాకుండా ఉంటే నాకు బాబా గురించి తెలిసేదేకాదు.
బాబా మనలనందరినీ ఎలా ఉండమని భావించారో అలా మం చిమనిషిగా ఉండాలని ప్రయత్నిస్తున్నాను. మా ఇరువురి కుటుంబాల మధ్య వివాహానికి మాటలు మొదలై. అంతా సవ్యంగా జరిగి మా వివాహం జరిగింది. మా వైవాహిక జీవితం ఆనందంగా జరగాలని ఆశీర్వదించమని బాబాని ప్రార్ధిస్తున్నాను.
బాబా చరణ కమలాలకు నేను వినమ్రంగా నమస్కరిస్తున్నాను. “బాబా! నీకు అసాధ్యమన్నది లేదు. నీ బిడ్డలకు ఎప్పుడేది ఇవ్వాలో నీకు మాత్రమే తెలుసు. మీరే నా తండ్రి. మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటావని నాకు తెలుసు. మాకందరికీ నీ ఆశీర్వాదములు లభించి మా జీవితాలు సుఖమయంగా ఉండుగాక!”
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా సమస్యలు తొలగించి నా పెళ్ళి జరిపించారు మొదటి బాగం…
- మా అమ్మాయి పెళ్లి అన్ని ఆటంకాలు తొలగించి బాబానే జరిపించారు–16
- బాబా ఉన్నారు రెండవ బాగం…
- సాయిని ప్రార్ధించు సమస్యలు తొలగును
- నా మీద బాబా కు చాలా కృప ఉంది, నా పిల్లలు కూడా నాకు ఇంత సంతోషం ఎప్పుడూ ఇవ్వలేదు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments