Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
సద్గురువులలోకెల్ల అగ్రేసరులైన సాయిబాబా వలన ఎందరు పూర్ణ పురుషులయ్యారో స్పష్టంగా తెలియడంలేదు. ప్రోద్దు గ్రుంకిన కొద్దీ నక్షత్రాలొక్కొక్కటే, ఆకాశంలో ప్రకటమైనట్లు, కాలం గడుస్తుంటే శ్రీసాయి వలన పూర్ణులైన వారి సంగతులొక్కక్కటే బయటకొస్తున్నాయి. అటువంటి ఒక పూర్ణ పురుషుడు శ్రీ రామ మారుతీ మహరాజ్ గురించి క్లుప్తంగా మీ కోసం….
శ్రీ రామ మారుతీ మహరాజ్
సం.1910లో ఒకరోజు బొంబాయి నుండి వచ్చిన త్రయంబకరావు, కులకర్ణి, మార్తాండ్ మొన భక్తులతో సాయి “రేపు మాకు పర్వదినం దీపావళి” అన్నారు. మరు రోజు ఉదయమే ఆయనెంతో సంతోషంగా. “ఈ రోజు నన్ను చూడడానికి నా తమ్ముడొస్తున్నాడు. ఒకప్పుడు మా యిద్దరి భార్యల మధ్య తగువొచ్చింది మేము వేరుగా వుంటున్నాం” అన్నారు.
మధ్యాహ్నం ఆరతికి ముందు నానాచందోర్కర్ తో, “మారుతి వస్తున్నాడు!” అన్నారు. ఆరతి ప్రారంభమైన కొద్దిసేపట్లో ఠాణే నుండి తమ భక్తులతో కలసి శ్రీరామ్ మారుతీ మహరాజ్ అను మహనీయుడొచ్చారు.
వెంటనే సాయి ఆరతి ఆపించి, తమ సోదరుని చూచి తమ చెంతకు రమ్మనటు నవ్వారు. తండ్రి దగ్గరకు బిడ్డలాగా రామమారుతి పరుగున వెళ్ళి సాయిని కౌగలించుకొని, ముద్దు పెట్టుకున్నారు. వారు ఒకరిచేతులొకరు ఎంతో ఆప్యాయంగా పటుకుని కూర్చున్నారు. తర్వాత ఆరతి కొనసాగించమని సాయి ఆదేశించారు.
ఆరతి అయ్యాక ఆ మహనీయుడు ఖండోబాకు వెళ్ళి అక్కడ నివసిస్తున్న ఉపాసనీ శాస్తితో, ‘రామునిసేవ విడువకు!’ అని చెప్పారు. అక్కడ తమ భక్తులతో సాయికి నైవేద్యంగా “శీరా’ (రవ్వకేసరి) తయారు చేయించారు.
ఈలోగా బాబావద్దకు భక్తులెందరో తమ నైవేద్యాలను తెచ్చి సమర్పించారు. “ఉండండి, ఈరోజు మొదట నా తమ్ముడిచ్చే నైవేద్యం తీసుకోవాలి” అని కొద్దిసేపు వేచియున్నారు బాబా, అది రాగానే ఎంతో సంతోషంగా దానిని కొంచెం తిని, తర్వాత మిగిలిన నైవేద్యాలు తీసుకున్నారు.
నాటి మధ్యాహ్నము, సాయంత్రం చావడి ఉత్సవంలోనూ ఆ మహాత్ముణ్ణి తమ చెంతనే వుంచుకుని రాత్రి మాత్రం ఆయనను ఖండోబాలో నిద్రించమని పంపించారు సాయి. ఈ రీతిన తన తమ్ముని 14 రోజులు తమ చెంతనుంచుకుని పంపించారు సాయి.
శ్రీరామ మారుతీ మహరాజ్ శ్రీ బాలముకుందస్వామిని గురువుగా ఆశ్రయించినా, తమ పరాత్పర గురువు సాయినాథుడేననని చెప్పేవారు. తాననుసరించిన నాథ సాంప్రదాయానికి ఆదిపురుషుడైన ఆదినాథుడే సాయి నాథుడనేవారు.
వీరు సెప్టెంబరు 28, 1918న మహాసమాధి చెందారు. బహుశః ఎన్నో జన్మలుగా తమ శిష్యుడిగా వుంటున్న మారుతీ మహరాజ్ ఈ జన్మలో వేరొక గురువునాశ్రయించడాన్నే “వారి భార్యల (మనస్సుల) తగవు” గా సాయి అభివర్ణించారేమో.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీ గజానన్ మహరాజ్
- గాడ్గే మహరాజ్ గారి శిష్యుడు రామచంద్ర మహరాజ్ గారికి బాబా సహాయం–Audio
- శిరిడీ లో శ్రీ రామ జన్మోత్సవాలు – శ్రీ రామ నవమి సంబరాలు
- శ్రీ సాయి దత్తావతారం రెండవ బాగం – శ్రీ గాడ్గే మహరాజ్ ని శ్రీ సాయి అనుగ్రహించుట
- ఒక డాక్టరు (శ్రీ రామ భక్తుడు)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments