గాడ్గే మహరాజ్ గారి శిష్యుడు రామచంద్ర మహరాజ్ గారికి బాబా సహాయం–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio Prepared by Mrs Lakshmi


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

 రామచంద్ర మహరాజ్ గురువు  గాడ్గే మహరాజ్ గారు.  గాడ్గే మహారాజ్ గారు  చేయబోయే యజ్ఞానికి ఒక రోజుకయే ఖర్చును సమర్పించమని రామచంద్ర మహరాజ్ గారిని కోరారు.

రామచంద్ర మహరాజ్ కీర్తనలు పాడుకుంటూ బేలాపూర్, దాని చుట్టుప్రక్కల ప్రదేశాలకు తిరుగుతూ వెళ్ళారు.  ముందుగా అంచనా వేసుకున్న ఖర్చుకన్నా ఇంకా ఎక్కువ మొత్తానికి వాగ్దానాలు వచ్చాయి. 

అందుచేత ఆయన చాలా నిశ్చింతగా ఉన్నారు.

కొద్ది రోజుల తరువాత ఇస్తామని మాటిచ్చిన దాతల వద్దకు డబ్బు వసూలు చేసుకోవడానికి వెళ్ళారు.

కాని ఇస్తానని చెప్పిన వాళ్ళెవరూ సొమ్ము ఇవ్వకపోవడంతో చాలా నిరాశ చెందాడు.

అందరూ ఇవ్వకుండా తప్పించుకున్నారు.  తన గురువుకు ఇచ్చిన మాటని ఎలా నిలబెట్టుకోవాలో దీనినెలా పరిష్కరించాలా అనే ఆలోచనలో పడ్డాడు. 

సహాయం చేయమని బాబాని మనస్ఫూర్తిగా ప్రార్ధించాడు.  మరుసటిరోజు  రామచంద్ర మహరాజ్ కీర్తనలు పాడుతూ ఉండగా ఒక భక్తుడు వచ్చి వంద రూపాయలు సమర్పించాడు. 

ఆయన తన గురువుకు ఎంతయితే ఇస్తానని మాటిచ్చాడో సరిగా అంతే సొమ్ము లభించింది.

ఈ సంఘటన వల్ల బాబా మీద ఆయనకున్న విశ్వాసం మరింతగా పెరిగిందని చెప్పారు.

*(అందుచేత మన సాయిభక్తులందరూ కూడా మన సాయిమీదే మనసు లగ్నం చేసి ఆయన కధలను, లీలలను,   ఆయన చేసిన చమత్కారాలను ఒకరికొకరం చెప్పుకుంటూ, పంచుకుంటూ మన భక్తిని మరింతగా  ధృఢ పరచుకొందాము .  ఓమ్ సాయిరామ్)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles