Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
ఒకరోజు ద్వారకామాయిలో రామచంద్ర ఒంటరిగా కూర్చున్నాడు. బాబా కూడా లేరు. భిక్షకు వెళ్ళారు. అదే అదనుగా రామచంద్రను సమీపించాడు షింపే.
‘‘బాగున్నావా దాదా?’’ పలకరించాడు. బాగున్నానన్నట్టుగా తలూపాడు రామచంద్ర. ఆ తలూపడంలో ఉత్సాహం లేదు. ఏదో తెలియని బాధ ఉంది.‘‘బాబా దయవల్ల కోలుకున్నావు కదా! ఇంకా దేనికి భయం? ఎందుకలా ఉన్నావు?’’ అడిగాడు షింపే.
ఏం చెప్పను అన్నట్టుగా చూశాడు రామచంద్ర.‘‘చెప్పు, ఎందుకు భయం?’’ రెట్టించాడు షింపే.‘‘భయం నా గురించి కాదు, తాత్యా గురించి. తాత్యా 1918 విజయదశమి రోజున చనిపోతాడు.’’ అన్నాడు రామచంద్ర.దిగ్భ్రమ చెందాడు షింపే.
‘‘ఎవరు చెప్పారలా’’ అడిగాడు.‘‘బాబా చెప్పారు’’‘‘నిజమా?’’‘‘నిజం. బాబాయే చెప్పారు. కలలో కనిపించి మరీ చెప్పారు.’’ గొల్లుమన్నాడు రామచంద్ర.
బాబాకి ఇష్టమయిన వాడు. బాబాని ‘మామా’ అని పిలిచేవాడు. బయిజాబాయి కొడుకు తాత్యా త్వరలో చనిపోతాడా? తట్టుకోలేకపోయాడు షింపే. అతనూ కన్నీరు పెట్టుకున్నాడు.
అంతలో బాబా వస్తున్న అలికిడి అయింది. రామచంద్ర గబగబా కన్నీరు తుడుచుకున్నాడు. షింపేని కూడా తుడుచుకోమన్నాడు. తుడుచుకున్నాడతను.
‘‘ఇది ఎవరికీ చెప్పకూడదు. రహస్యం అన్నారు బాబా.’’ అన్నాడు రామచంద్ర.‘‘రహస్యమా? ఎవరికీ చెప్పొద్దన్నారా? అంటే…అంటే…తాత్యాని చూస్తూ చూస్తూ మృత్యువుకి అప్పగిస్తారా బాబా?’’ అడిగాడు షింపే. తెలీదన్నట్టుగా తలపట్టుకున్నాడు రామచంద్ర.
ఇంతలో అడుగు తడబడి కింద పడ్డ ధ్వని అయింది. అటుగా చూశారు. బాబా! పరుగెత్తి రాబోతున్న రామచంద్ర, షింపేలను వారించి నవ్వుతూ లేచి నిల్చున్నారు బాబా. కింద పడిన బాధకో, లేక నవ్వుకో తెలీదు, బాబా కళ్ళల్లో సన్నగా కన్నీరు చోటు చేసుకుంది.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- “నీ దరిదాపుల్లో మరణం లేదు, నా బాధంతా వాడి గురించే”
- ‘‘నువ్వు పటేలు కాదయ్యా, దాదావి.’’
- రామచంద్ర మాలిక్ ఊది! …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 27
- గాడ్గే మహరాజ్ గారి శిష్యుడు రామచంద్ర మహరాజ్ గారికి బాబా సహాయం–Audio
- మనం సాయిబాబా గురించి యెందుకు రాయాలి–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments