రామచంద్ర మాలిక్ ఊది! …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 27



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


రామాంజనేయులు ద్రోణాచల నివాసి. రామచంద్రమాలిక్ పేరు విన్నాడు కానీ అయన భక్తుడు కాలేదు.

శివాలయానికి పోతూ రామాంజనేయులు శివునికి కొబ్బరి కాయను, పూలు పండ్లు, ఇంకా బజ్జీలను దారిలోనున్న రామచంద్ర మాలిక్ కు సమర్పించటానికి తీసుకున్నాడు. రామచంద్రను దర్శించి ఆయన చెంత కూర్చున్నాడు.

వెంటనే రామచంద్రబాబా వద్ద కొబ్బరికాయను కొట్టబోయాడు. బాబా ఆ కొబ్బరికాయను శివుని వద్ద కొట్టి, పూలు పండ్లు శివునికి సమర్పించి రమ్మన్నాడు.

అనంతరం బాబా బజ్జీలు స్వీకరించారు. కొబ్బరికాయను, పూలు పండ్లు శివార్పణ చేసే ఉద్దేశ్యాన్ని బాబా గ్రహించాడని రామాంజనేయులు గ్రహించి, బాబా సర్వజ్ఞతకు దాసోహమన్నాడు.

సాయిబాబా కూడా సప్తశృంగి దేవతకు నిర్దేశించిన వాటిని సప్తశృంగి దేవతకే సమర్పించమని శ్యామాను వణికి పంపారు కానీ తానూ స్వీకరించలేదు.

భీమారావు షిరిడీకి వెళ్ళి జనవరి 1, 1987న సాయి సన్నిధి చేరాలనుకొని, రామచంద్ర మాలిక్ అనుమతి అడిగాడు.

షిరిడీకి వెళ్ళనవసరం లేదని రామచంద్ర మాలిక్ అన్నారు. ఇలాగే పండరీపురం వెళతానంటే దాసగణును వద్దన్నారు.

భీమారావు తన గురువైన రామచంద్ర మాటను లెక్కచేయకుండా షిరిడీ వెళ్ళి వచ్చి, రామచంద్రను దర్శించాడు.

రామచంద్ర “450 రూపాయలు ఖర్చుపెట్టి ఎందుకు వెళ్ళావు? నేను ఇక్కడ ఉన్నాను గదా” అన్నారు.

షిర్డీ యాత్రకు ఖర్చు సరిగ్గా 450 రూపాలయలైంది. రామచంద్ర మాలిక్ సర్వజ్ఞత్వానికి భీమారావు ఆశ్చర్యపడ్డాడు.

రామచంద్ర మాలిక్ మాటను పాటించి, జనవరి 1న తేదీన రామచంద్ర మాలిక్ సన్నిధిలోనే ఉంటె ఆయనే సాయిబాబాగా దర్శనమిచ్చేవారేమో? మహాత్ములందరూ ఒకటే గదా!

అందరు రామచంద్ర మాలిక్ అని పిలిచే ఆ మహనీయుడు ఎవరు? ఎక్కడ నుండి వచ్చాడు? అనే వివరాలు ఎవరికీ తెలియవు.

జంతువులు త్రాగే నీటి వనరు నుండి సాయి దప్పిక తీర్చుకునేవాడు.

ద్రోణాచల పరిసరాలలో స్థిరపడిన రామచంద్ర ఊరి వెలుపల చాకలివారు బట్టలు ఉతికే కాలువలో నీటిని త్రాగేవారు. సబ్బు, సోడా, చవుడు, నీలిమందు కలిసి ఉండేవి ఆ నీటిలో. ఆ జాలం రామచంద్రునకు గంగా జలమే.

అడవిలోకి పోయి కట్టెలు తెచ్చి తాను నిర్వహించే ధునిలో వేసేవారు రామచంద్ర మాలిక్.

ఆ ధుని నుండి వచ్చే  ఊదినే ప్రసాదంగా ఇచ్చేవారు ఆయన వద్దకు వచ్చేవారికి.

కేశవమ్మకు ఆ ఊదీతోనే చర్మ వ్యాధి పోయింది. రామచంద్ర నిరంతరం అన్నదానం చేసి అందరి ఆకలి తీర్చేవాడు.

ఆయన మహా సమాధి దినం నేడే! ఫిబ్రవరి 27 (1990).

శాంతి, సోఖ్యాలను ప్రసాదింపుమని రామచంద్ర బాబాను ప్రార్దిదాం!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles