Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
“ఢాకూరునాథుని ఢంకాపురి, విఠలుని పండరీపురం, శ్రీకృష్ణుని ద్వారకానగరం ఇదే. వాటిని చూడటానికి ఎక్కడకో వెళ్లనవసరం లేదు” అంటారు సాయిబాబా దాసగణు మహారాజ్ తో.
శ్రీ శివనేశన్ స్వామీజీ….
“హరిద్వార్, మథుర, కాశీ షిరిడీ మే తీర్థ సారే హై
సాయిబాబాకే చరణోమే చారో ధామ్ హమారే హై” అని సాయిని కీర్తించటంతో సంతృప్తి చెందలేదు.
ఏదో ఒక సందర్భంలో మినహా, షిరిడీ గ్రామ సరిహద్దులను దాటలేదు. అది సాయిపై ఉన్న భక్తి ప్రేమలకు సంకేతం.
అంతేకాదు, అలనాటి అన్నమయ్య వలె పవిత్ర స్థలిలో పాదరక్షలు లేకుండా, పాదాలతో సైతం ఆ దివ్య భూమి స్పర్శానుభూతి పొందిన ధన్య జీవి శివనేశన్ స్వామీజీ.
సాయిబాబా, శివనేశన్ జీలు భ్రమర కీటకన్యాయంలో వలె గురుత్వాన్ని పొందారు తమ అకుంఠిత భక్తి ప్రేమలతో.
తన కడుపు నిండితే చాలదు నిజమైన భక్తునకు, అందరకూ ఆహారం లభించాలని భావించారు శివనేశన్ జీ.
సాయి సాహిత్యం శివనేశన్ స్వామి షిరిడీలో అడుగు పెట్టక పూర్వం హేమాడ్ పంత్ మరాఠీ రచనకే పరిమితమై ఉండేది.
శివనేశన్ స్వామి బహు భాషా జ్ఞానం వలన, ఇతర భాషలలోని, విశేషించి మరాఠీ భాషలోని సాయి సాహిత్యాన్ని, ఇతరులచే, అందరకూ అందించారు.
సాయిబాబా తన కాలం నాటి మహాత్ములతో తలలో నాలుక వలె ఉండేవారు – ఉదాహరణగా వాసుదేవానంద స్వామి, తాజుద్దీన్ బాబా, గంగాగీర్ బువా.
శివనేశన్ స్వామిజీ షిరిడీని దర్శింప వచ్చిన మహాత్ములను ఎంతో సాదరంగా గౌరవించేవారు. ఉదాహరణగా – పారాడ్ సింగాకు చెందిన అనసూయ మాత, తెలుగు వాడైన రామిరెడ్డి తాతా.
సాయినాథుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందిన విశిష్ట భక్తుడు శ్రీ స్వామీజీ.
సాయితో పాటుగా భుజించుట, శయనించటం, బోధలను శ్రవణం చేయటం మొదలైనవి అతి కొద్ది మందికే లభించాయి – ఉదాహరణ, మహల్సాపతి, శ్యామా, తాత్యా కోతే పాటిల్.
సాయిబాబా స్వామీజీని కరుణించి తాను (సాయిబాబా) నివసించిన ద్వారకామాయిలోను, గురుస్థాన్ లోనే కాక తన సమాధి మందిరంలో కూడా బస ఏర్పాటు చేయటం, బాబాకు సమర్పించే ప్రతి నైవేద్యాన్ని స్వామికే చెందేలా ఏర్పాటు చేశాడు బాబా.
ప్రతి నిత్యము చావడిలో సాయిబాబా భజనలు చేయటమే గాక కొంతకాలం చావడి బాధ్యతలను కూడా నిర్వహించిన స్వామీజీని “చావడి బాబా” అని గౌరవంతో సంబోధించే వారు సాయి భక్తులు.
శివనేశన్ స్వామీజీ జన్మించినది ఏప్రిల్ 12, 1927. నేడు అయన జయంతి.
“సబ్ కా మాలిక్ సాయి” అని తన జీవితాంతం సాయి సేవలో తరించిన స్వామీజీని స్మరించెదము గాక.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సాయిని సేవించిన తెలుగు వెలుగు…..సాయి@366 ఏప్రిల్ 12…Audio
- జిత్తులమారితనం…. సాయి@366 ఫిబ్రవరి 12….Audio
- శివనేశన్ స్వామి ఫకీరు రూపంలో యున్న బాబాకు వస్త్రముల నిచ్చుట.
- గరుడ గమన రారా! …..సాయి@366 ఏప్రిల్ 21….Audio
- శివనేశన్ స్వామిని చావడి బాబా అని సంబోధించుట.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments