Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
శ్రీ సాయిబాబా సేవను నిస్వార్థముగా చేయుచున్నారు శివనేశన్ స్వామి.
వారి సేవను గుర్తించిన సాయి సంస్థాన్ కోర్టు రిసీవరు షిరిడీలోని చావడి బాధ్యతను స్వామిగారికి అప్పగించిరి.
ప్రతి గురువారమురోజున మాత్రమే అప్పట్లో చావడి తెరిచేవారు.
ఆరోజు ఉదయం గం6-00 నుండి మధ్యాహ్నం గం2-00ల వరకు, సాయంత్రము గం4-00ల నుండి రాత్రి గం8-00ల వరకు చావడి తెరచి యుండేది.
ఆ గురువారము రోజున స్వామీజీ చావడి ని తెరచి శుభ్రము చేసేవారు. దానిని ఎంతో బాగా అలంకరించేవారు.చావడిని బాగుచేస్తూ యుండడం చావడిలో సంకీర్తన చేస్తూ యుండుటంతో శివనేశన్ స్వామి వారిని “చావడి బాబా” అని సంబోధిస్తుండేవారు.
చావడిని శ్రద్ధాభక్తులతో స్వామీజీ చూచుట చూచిన రిశీవరు వీరికి బాబా ప్రసాదాలు భక్తులకు పంపే కవర్లపై చిరునామాలు వ్రాయు పనిని కూడా ఒప్పచెప్పి ఆ పనికి నెలకు రూ. 15లు గౌరవ భ్రుతిగా యిచ్చేవారు.
ద్వారకామాయిలో పల్లకి ప్రక్క గదిలో యుండటానికి కూడ వసతిని కల్పించిరి.
ఇలా వసతి,తినటానికి భోజనము సమకూర్చటమే కాక దానధర్మాలు చేసుకొనుటకు రూ. 15లు, సమకూర్చుట ,షిరిడీ రమ్మని పిలిపించుకున్నందుకు బాబా స్వామీజీకి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసారు.
బాబా మాట చెప్పి వూరుకోరు. దానికి తగిన ఏర్పాట్లన్ని ఎప్పుడైన బాబా చూచుకుంటారని ఈ లీల ధృడపరుస్తున్నది.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
Latest Miracles:
- చావడి ఉత్సవం ….సాయి@366 డిసెంబర్ 10….Audio
- శివనేశన్ స్వామిని బాబా షిరిడి రమ్మని పిలుచుట
- బాబా వారి వస్త్రములను శివనేశన్ స్వామికి ఇప్పించుట.
- శ్రీ సాయిబాబావారు శివనేశన్ స్వామిలా దర్శనమిచ్చారు.
- శ్రీ సాయిబాబా నివేదన శివనేశన్ స్వామికి భోజనమగుట.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments