నా నాలుగుచేతులు చాచి వానిని రక్షింతును.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ  జై

  సాయి బాబా      …      సాయి బాబా      …      సాయి బాబా      …      సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

శ్రీ సాయిబాబా కూడా దేవుడేనా? ఉన్న దేవుళ్ళు చాలకనా? అని ఒక మిత్రుడు శ్రీ బాపట్ల హనుమంతురావుగారిని అడిగిరి.

ఇది 1953 లో జరిగిన సంఘటన.అప్పుడు సాయిలీలా మాసపత్రిక చీరాల నుండి ప్రచురించబడుచున్నది.

శ్రీ బాపట్ల హనుమంతురావుగారు సాయితత్త్వ ప్రచారములో ఈ పత్రికకు చందాలు సేకరించుచూ,భక్తులకు పత్రికలను అందించుట ఒక సాధనముగా చేసుకొనిరి.

ఒకరోజున ఒక మిత్రుని వద్దకి వెళ్లి ఆ సాయిలీల మాసపత్రికకు చందా చెల్లించమని అతనిని హనుమంతురావు కోరినారు.

అప్పుడు ఆ మిత్రుడు “పంతులుగారూ! శ్రీ సాయిబాబా కూడా ఒక దేవుడేనా? ఉన్న దేవుళ్ళు చాలకనా?వారు మిమ్ము దేముడవు కాదనుచున్నారు”అని  హనుమంతురావుగారిని ప్రశ్నించిరి.

అనుకోని ఈ ప్రశ్నకు పంతులుగారు ”అవును శ్రీ సాయిబాబా కూడ దేవుడే. చాలకనే”అని మిత్రునకు సమాధానమిచ్చిరి.

తన మిత్రుడు పలికిన ఈ మాటలకు హనుమంతురావుగారి అభిమానము దెబ్బతిన్నది.

మిత్రుడు పత్రికకు చెల్లించకపోయిన పోనిమ్ము.

కాని సాయిబాబాను ఇట్లు కించ పరచునట్లు మాట్లాడుట సమంజసము కాదు.అది అతనికి తగదు అని హనుమంతరావుగారు బాధపడిరి.

ఆ సమయమున పంతులుగారికి బాబాదేహముతో యున్న ఒక సంఘటన గుర్తుకువచ్చినది.

సాయిబాబా చెప్పగా బంద్రాబాలుడు బాబుసాహేబ్ జోగ్ వద్దకుదక్షిణ తెచ్చుటకు సాఠెవాడాకు వెళ్ళగా అక్కడ జోగ్ మరికొందరితో కలిసి ధృవచరిత్రను చదువుచుండెను.

“సాధువులు భగవదనుగ్రహము వలన కొన్ని శక్తులను సంపాదించగలిగినను వారు దైవము కాదు” అని వ్యాఖ్యానమును చేయుచుండిరి.

ఈ వ్యాఖ్యానమును విన్న  బంద్రాబాలుడు అది బాబాను గురించి అన్నట్లుగా భావించి,బాబా చెంతకు వచ్చి “బాబా నన్ను అచ్చటకు ఎందుకు పంపితిరి?వారు మిమ్ము దేముడవు కాదనుచున్నారు”అని బాబాతో అనినాడు.

అప్పుడు బాబా వారు నిజమే చెప్పిరని,నేను ఫకీరునని,దేవునితో ఎవరు సరిపోలరని బాబా చెప్పెను.

అదే సమయములో కొందరు భక్తులు శ్రీ సాయిబాబా వద్దకు వచ్చి తమ బిడ్డ మేడపై  నుండి క్రిందపడుచుండ బాబా బిడ్డను రక్షించిన విధానమును తెలిపిరి.

వారి మాటలను విన్న బాబా “నా బిడ్డలు ఆపదలోయున్న నేను ఉపేక్షించెదనా?నా నాలుగు చేతులు చాచి వానిని రక్షింతును”అని బాబా అనుచుండ      బాబా మీరిప్పుడే నేను దేవుడను కానంటిరే! మీరు దేవుడు కాకున్న నాలుగుచేతులెట్లు కలిగియున్నారు? అని బంద్రాబాలుడు ప్రశ్నించగా బాబా దానికి సమాధానము ఏమియు చెప్పక భగవంతుడనేనన్నట్లు అంగీకారముగా చిరునవ్వు నవ్విరి.

ఈ లీలను గుర్తు చేసుకున్న హనుమంతరావుగారు నా మిత్రుని వద్ద పత్రికకు చందా వసూలు చేయుటకు పంపినది బాబాయేనని నన్ను పరీక్షించుట కొరకే అట్లు చెప్పించిరని తలచిరి.

తన మిత్రుడు అడిగిన “సాయిబాబా కూడా దేవుడేనా? ఉన్న దేవుళ్ళు చాలకనా?”అన్న పేరుతో బాబా దేవుడేనని చూపబడిన లీలలతో ఒక పుస్తకము వ్రాసి ప్రచురించిరి. ఇంతకీ శ్రీ సాయిబాబా దేవుడే కదా!

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ  జై

  సాయి బాబా      …      సాయి బాబా      …      సాయి బాబా      …      సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “నా నాలుగుచేతులు చాచి వానిని రక్షింతును.

http://saileelas.com/m/sounds/view/09Chapter6-mp3#view
శ్రీ సాయి గురు చరిత్ర….ఆరవ అధ్యాయం ..మరాఠి మూలం శ్రీ దాసగణు మహారాజ్…. తెలుగు అనువాదం శ్రీ యస్వీయల్. నారాయణ రావు ….. ధ్వని అనుకరణ శ్రీమతి భాగ్యలక్ష్మి

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles