సద్గురువు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా    …    సాయి బాబా    …    సాయి బాబా    …    సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

శ్రీ సాయి సచ్చరిత్రము 18-19 అధ్యాయములు.

ద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను గనిపెట్టి,వారి మనస్సు కలత చెందకుండ తగిన బోధచేసి, తుదకు వారి లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపునను విషయమందరికి తెలిసినదే.

ఈ విషయములో సద్గురువు బోధించిన దాని నితరులకు వెల్లడి చేయరాదని కొందరనెదరు.అట్లు గురువు బోధించినదానిని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగునవి వారి యాలోచన.ఇది సరైనది కాదు.

సద్గురువు వర్షాకాలపు మేఘమువంటివారు.వారు తమ అమృతతుల్యములైన బోధలను పుష్కలముగా విశాలప్రదేశములందు  కురిపించెదరు.వానిని మనమనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని, పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలుకొరకు వెల్లడి చేయవలెను.

ఇది వారు మన జాగ్రదవస్థలోనేగాక స్వప్నావస్థలో కూడ తెలియజేయు విషయములకు వర్తించును.

తన స్వప్నమందు గనిన ‘రామరక్షా స్తోత్రము’ను బుధకౌశికఋషి ప్రచురించిన యుదాహరణము నిచ్చట స్మరించవలెను.

ప్రేమగల తల్లి,గుణమిచ్చు చేదైన యౌషధములను బిడ్డ మేలుకొరకే బలవంతముగా గొంతులోనికి త్రోయునట్లు,ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు.అది బహిరంగమైనది.

వారి బోధల ననుసరించిన భక్తుల ధ్యేయము నేరవేరెడిది.

సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాననేత్రములను తెరిపించి యాత్మయొక్క దైవీసౌందర్యములను జూపి మన కోరికలను నేరవేర్చెదరు.

ఇది జరిగిన పిమ్మట, మన యింద్రియవిషయవాంఛలు నిష్క్రమించి, వివేకవైరాగ్యములను జంటఫలములు చేతికి వచ్చును.

నిద్రలో కూడ ఆత్మజ్ఞానము మొలకెత్తును.

సద్గురువుల సహవాసము చేసి,వారిని సేవించి వారి ప్రేమను పొందినచో నిదంతయు మనకు లభించును.

భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి, మన కష్టములను బాధలను తొలగించి,మనలను సంతోషపెట్టును.

ఈ యభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయమువలననే జరుగును.

సద్గురువును భగవంతునివలె కొలువవలెను.కాబట్టి మనము సద్గురువును వెదకవలెను.వారి కథలను వినవలెను.

వారి పాదములకు సాస్టాంగ నమస్కారముచేసి వారి సేవ చేయవలెను.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

సాయి బాబా    …    సాయి బాబా    …    సాయి బాబా    …    సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “సద్గురువు.

http://saileelas.com/m/sounds/view/09Chapter6-mp3#view
శ్రీ సాయి గురు చరిత్ర….ఆరవ అధ్యాయం ..మరాఠి మూలం శ్రీ దాసగణు మహారాజ్…. తెలుగు అనువాదం శ్రీ యస్వీయల్. నారాయణ రావు ….. ధ్వని అనుకరణ శ్రీమతి భాగ్యలక్ష్మి

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles