ఆత్మజ్ఞానాన్ని సద్గురువు మాత్రమే ప్రసాదించగలడు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

ఎవరు ఏ పనికి ఉపయోగపడతారో, ఎవరి చేత ఏ పని ఎప్పుడు చేయించాలో బాబాకి బాగా తెలుసు. సమయం, సందర్భం కలసి రావాలి. అప్పుడే బాబా పిలుపు అందుతుంది. పిలుపు అందగానే ఎవరయినా పరుగున రాక తప్పదు.

1910 వ సంవత్సరం.ద్వారకామాయిలో ధ్యానంలో ఉన్నారు బాబా. శ్యామా ఓ వ్యక్తిని వెంట బెట్టుకుని వచ్చాడక్కడికి.

ఎవరో వచ్చిన అలికిడికి కళ్ళు తెరిచి చూశారు బాబా. చేతులు జోడించారు శ్యామా, అతని కూడా వచ్చిన వ్యక్తి.‘‘బాబా ఈయన పేరు అన్నాసాహెబ్‌ దాభోళ్కర్‌.’’ వెంటబెట్టుకుని వచ్చిన వ్యక్తిని బాబాకి పరిచయం చేశాడు శ్యామా.‘అవునా’ అన్నట్టుగా సన్నగా నవ్వారు బాబా.

‘‘బాబా! ఈయనేమో నీ జీవితచరిత్ర రాస్తానంటున్నారు, మీరు కాదనకూడదు.’’ అన్నాడు శ్యామా.సమాధానంగా నవ్వారు బాబా.‘‘బాబా నవ్వారంటే అనుమతి లభించినట్టే! కాకపోతే అది మాటగా రావాలంటే కొంచెం సమయం పడుతుంది. వేచి చూడాలి. చూస్తారా?’’ అన్నా సాహెబ్‌ని అడిగాడు శ్యామా.

అప్పటికి ఆ ఇద్దరూ బాబాకి దూరంగా వచ్చి ఓ స్తంభం చాటుగా నిల్చున్నారు.‘‘నా మాట విని, మీరు కొద్దిరోజుల పాటు సాఠేవాడాలో బస చేయండి.’’ చెప్పాడు శ్యామా. అందుకు అంగీకరించాడు అన్నాసాహెబ్‌.

రాత్రి సాఠేవాడాలో ఆలోచిస్తూ కూర్చున్నాడతను. అనేక అనుమానాలు అతనికి. బాబా భక్తుడు భాటే, ఆలోచిస్తూ కూర్చున్న అన్నాసాహెబ్‌ని సమీపించాడు. ఇద్దరూ కబుర్లలో పడ్డారు.

గురువు ఆవశ్యకత చర్చకు వచ్చింది. గురువుని సమర్థించాడు భాటే. వ్యతిరేకించాడు అన్నాసాహెబ్‌.

‘‘ఎవరి కర్మఫలాన్ని వారు తప్పనిసరయి అనుభవించాల్సి వచ్చినప్పుడు ఇక గురువు ఎందుకు? జరిగేది జరుగుతుందన్నప్పుడు గురువుని ఆశ్రయించడం ఎందుకు? మన బాధలు మనకు తప్పవన్నప్పుడు గురువుని పూజించి లాభం ఏముంది? అందుకని, ఈ చర్చను ఇంతటితో ముగిద్దాం.’’ అన్నాడు అన్నాసాహెబ్‌.భాటే బాధపడ్డాడు.

గురువుని తక్కువ అంచనా వేయడం అతనికి నచ్చలేదు.‘‘శుభరాత్రి’’ అని వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయాడతను. పడుకున్నాడు.ఆ రాత్రి గడిచింది.

పొద్దున బాబా కరుణా కటాక్షాల కోసం ద్వారకామాయికి చేరుకున్నాడు అన్నాసాహెబ్‌. అతను అక్కడికి చేరుకున్న సమయానికి బాబా ఓ భక్తునితో ఇలా సంభాషిస్తున్నారు.‘‘శ్రీకృష్ణుడు దేవుడే కదా! అయినా సాందీప మహర్షిని గురువుగా స్వీకరించి, ఆయన దగ్గర శిష్యరికం చేశాడు. ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడంటే పరబ్రహ్మ స్వరూపమే గురువు కాబట్టి. పరబ్రహ్మం ముఖతా వింటేనే విద్య ఒంటబడుతుంది. ఇక్కడ విద్యంటే ఆత్మజ్ఞానం. 

ఈ ఆత్మజ్ఞానాన్ని సద్గురువు మాత్రమే ప్రసాదించగలడు. సద్గతికి సద్గురే మార్గదర్శనం చేస్తాడు. ఈ సంగతి తెలియజెప్పడానికే దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు సాందీప మహర్షిని సేవించాడు.’’ అన్నారు బాబా.

జ్ఞానామృతాన్ని దోసిళ్ళతో తాగుతున్నట్టుగా ఉంది. వింటున్న భక్తుడు తన్మయత్వంగా చూడసాగాడు.‘‘ఆత్మసాక్షాత్కారం కావాలంటే గురువు మార్గదర్శనం కావాల్సిందే! అందులో అనుమానం లేదు. మహా పండితుడు ‘హేమాద్రిపంతు’ కూడా గురువు గొప్పదనాన్ని ఒప్పుకున్నాడు.

ఎవరి కర్మ ఫలాన్ని వారే అనుభవించాలి. తప్పదు. అయితే గురువు కరుణా కటాక్షాలుంటే ఆ కర్మఫలాన్ని సునాయసంగా అనుభవిస్తారు.’’ చెప్పారు బాబా.

అన్నాసాహెబ్‌కి చెంప మీద ‘ఛెళ్‌’న కొట్టినట్టయింది. ఉలిక్కి పడ్డాడతను.

రాత్రి సాఠేవాడాలో భాటేతో తను అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. తప్పు చేశాననిపించింది. తలొంచుకున్నాడు అన్నాసాహెబ్‌. ఇప్పుడీ సన్నివేశం అంతా తన కోసమేనని అర్థమయింది. బాబా చెప్పిందంతా తనని ఉద్దేశించేననిపించింది. బాబా సర్వజ్ఞత తెలిసొచ్చింది అతనికి.

అంతలో అక్కడికి భాటే వచ్చాడు. అన్నాసాహెబ్‌ని పలకరించాడు. దిగులుగా ఉన్నట్టుగా అనిపించాడు.‘‘ఏమయింది?’’ అడిగాడు.

సమాధానంగా చేసిన తప్పుని క్షమించమన్నట్టుగా భాటే చేతిని పట్టుకున్నాడు అన్నాసాహెబ్‌. కళ్ళు చెమర్చుకున్నాడు. అతనిలో అణువణువునా జరిగిన మార్పుని గమనించారు బాబా.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles