నక్షత్రాలవంటి మహాత్ముల మధ్య ఈయన సూర్యుని వంటివాడు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

పుంతంబాకు చెందిన గంగగిర్ బాబా అనే గృహస్థ సాధువు ఆ ప్రాంతమంతటా ఆధ్యాత్మిక ప్రచారం చేస్తుండేవారు. ఒకసారి ఆయన శిరిడీ వచ్చి మారుతి ఆలయంలో భక్తులతో సదోష్టి చేస్తున్నారు. అంతలో భుజాన నీటి కుండలతో సాయి ఆ ప్రక్కగా మశీదుకు వెళుతుంటే చూచి గంగగిర్ ప్రసంగం ఆపి, లేచి నమస్కరించి, వారి వెనుకనే మశీదుకు వెళ్ళారు.

అక్కడ సాయి కుండలు దింపి వెనక్కు తిరగ్గానే గంగగిర్ ఆయనకు నమస్కరించారు. బాబా పెద్దగా నవ్వి “దేవాలయం యీ మశీదుకు వచ్చిందే” మంచిది. మనమిద్దరమూ ఒకే కుటుంబంలోని వారము. ఎంతో కాలంగా కలసి వుంటున్నాము.

ప్రజలను సన్మార్గములో పెట్టమని భగవంతుడు మనలను పంపాడు. కాని యీ రోజులలో ప్రజలు కించిత్తుగూడా పరివర్తనం చెందడం లేదు. అందరూ క్షుద్రమైన విలాసాల మైకంలో చిందులేస్తుంటే, హరి మన నెత్తిపై ఆవుపాలు పెట్టి వారి మధ్యకు పంపారు.

కొందరు నన్ను చూచి నవ్వి, పాలకుండపై రాళ్ళు విసురుతున్నారు. కొందరు నవ్వుతూ, ‘అతడు చెప్పేది వినకండి. సాయి నన్ను పూనాడు’ అని చెప్పి ప్రజలచేత ఈతకలు త్రాగిస్తున్నారు. నా దగ్గర పాలు తీసుకున్న వాళ్ళంతా పిచ్చివాడినంటున్నారు. కొందరు పాలు తీసుకొనిగూడా వేదాంత చర్చల్లో పిచ్చివాళ్ళవుతున్నారు.

సత్సంగం పట్ల విశ్వాసము, గౌరవమూ పోయి అసత్యాన్నే ఆదరిస్తున్నారు” అని ఎంతో బాధగా గంగగిర్ చేతులు పట్టుకొని, “పోయేవాడు పోతాడు, నిలిచేవాడే నిలుస్తాడు. చిత్తశుద్ధితో తరించే మార్గం చెప్పడమే మన పని” అని చెప్పి తమ ఆసనంపై కూర్చున్నారు. అప్పుడు గంగగిర్ తన భక్తులతో, “పేడకుప్పవంటి యీ గ్రామానికి ఎంతటి రత్నం లభించింది నక్షత్రాలవంటి మహాత్ముల మధ్య ఈయన సూర్యుని వంటివాడు. మీరు పిచ్చివాళ్ళు గనుక ఈయనను విడచి ఎక్కడెక్కడో వెదుకుతున్నారు” అన్నాడు.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles