Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి….
మాధవరావు దేశ్‌పాండే ఉరప్ శ్యామా మూడవ భాగం ….
బాబా మాధవరావ్‌ని శ్యామా అని ఎందుకు పిలిచారో అనే విషయం బాబాకే తెలియాలి. శ్యామా అంటె చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. యమునానదిని శ్యామా అని పిలుస్తారు. మన శ్రీ కృష్ణుడిని శ్యామా అనిపిలుస్తాము. అశ్వమేధ యజ్ఞంలో వాడే అశ్వం పేరు శ్యామకర్ణ అని పిలుస్తారు.
మహల్సాపతి మనవడు మనోహర్ మార్తాండ్ ఈ విధంగా చెప్పాడు. బాబా పాఠశాలను శాల అనేవారు. మాధవరావు మాష్టారు కావడం వలన మాష్టారులో మొదటి అక్షరం మా, శాలలో శా తీసుకుని శ్యామా అని పిలవడం జరిగింది అని చెప్పారు.
బాబా మాధవరావ్‌తో 72 జన్మల సంబంధం ఉందని చెప్పడం, శ్యామ అని పిలవడం, ఆయనను బాబా ప్రతినిధిగా చెప్పడం చూస్తే, శ్యామా ఎంతటి పుణ్యాత్ముడో అర్ధం అవుతుంది.
శివుడ్ని చేరుకోవాలంటే నందీశ్వరుని యొక్క అనుగ్రహం ఎట్లా కావాలో, అట్లే బాబాతో ఏదైనా విన్నవించుకోవాలి అంటే శ్యామా ద్వారా వెళ్తే పని జరిగేది:
షోలాపూర్ కు చెందిన శ్రీమతి ఔరంగాబాద్ కర్ కు సంతానం కోసం షిరిడి వచ్చి 2 నెలలు శిరిడి లో ఉన్న బాబాకు తన కోరిక చెప్పుకొనే అవకాశం రాలేదు. చివరకు ఆమె శ్యామాతో చెప్పుకోగా అతడు ఆమెనొక కొబ్బరికాయ తీసుకోని మశీదుకు రమ్మనమని చెప్పి బాబాతో “దేవా, ఈ కొబ్బరికాయ ప్రసాదంగా ఆమెకిచ్చి ఆమెకు కొడుకు పుట్టేలా ఆశీర్వదించు” అన్నారు. మొదట బాబా అగీకరించక అతడితో వాదించారు. శ్యామా ఒత్తిడి చేసిన మీదట ఆమెను ఆశీర్వదించారు. సంవత్సరంలో ఆమెకు కొడుకు పుట్టాడు. వారు బిడ్డను తీసుకోని బాబాను దర్శించి, తాము మొక్కుకున్నట్లే శ్యామకర్ణ కు శాల నిర్మించడానికి రూ. 500/- సమర్పించుకున్నారు.
ఎన్నోసార్లు మక్కా యాత్ర చేసిన హజిసిద్ధిక్ పాల్కే బాబా దర్శనం కోసం షిర్డీ వచ్చారు. కానీ బాబా అతడిని చూస్తూ ఉగ్రులై 9 నెలల వరకు అతనిని మశీదులో అడుగు పెట్టనివ్వలేదు. చివరికి అతడు శ్యామా ని సంప్రదించాడు. అప్పుడు శ్యామా అతని తరుపున ప్రార్దిస్తే, హజీని పరీక్షించి మశీదులో ప్రవేశించానిచ్చారు. ఈవిధంగా శ్యామా ద్వారా బాబా ను సంప్రదించినప్పుడు భక్తుల కోరికలు నేరవేరేవి.
శ్యామా కంటి పోటుకి బాబా వింత వైద్యం:
ఒకసారి మాధవరావుకు తీవ్రమైన కంటిపోటు వచ్చి, ఎన్ని మందులు తీసుకున్న తగ్గలేదు. చివరకు బాబాపై పట్టరాని కోపంతో మశీదుకు వెళ్లి, “దేవా! నీ అంత కటినత్ముడుప్రక్కవాడు చస్తున్నా ఏమి పట్టించుకోనివాడు ఇంకెవరు ఉండరు. అందరికి ఏవేవో మందులతో గాని, మహిమలతో గాని ఏన్నో వ్యాధులు తగ్గిస్తున్నవుగాని.
నేని బాధతో మెలికలు తిరిగిపోతూ, నిన్నెంతగా ప్రార్ధించినా పట్టించుకోవేం? నీవేం దేవుడివి? నా కంటి బాధ రేపటికల్లా పూర్తిగా తగ్గకపోయిందో, నిన్నీ మశీదు నుండి వెళ్ళగొట్టడం తధ్యం. ఆ పని చేయకుంటే నేను నీ శ్యామనే గాదు!” అన్నాడు.
బాబా ప్రశాంతంగా విని ఏంతో ప్రేమగా నవ్వుతూ, “శ్యామా! ఏమిటి నీ పిచ్చివాగుడు? 7 మిరియాలు నీటిలో గంధంగా అరగదీసి కళ్ళలో పెట్టుకో! అదే తగ్గిపోతుంది. ఈ ఉదీ తీసుకుని వెళ్ళు!” అన్నారు.
ఈసారి శ్యామా మరింత రెచ్చిపోయారు, “ఏమి తెలివయ్య! నీకీ వైద్యమెవారు నేర్పాడట? నాకళ్ళు ఏమన్నా పోవలనా, మిరియాలు పెట్టుకోమంటావు?” అన్నారు.
బాబా అతని మాటలేవి పట్టించుకోకుండా, “నీ అతి తెలివి చాలు, ఉదీ తీసుకుపోయి చెప్పినట్లు చేయి, తగ్గకపోతే నీ యిస్తామోచ్చింది చేయోచ్చు” అన్నారు.
శ్యామా పైకి అలా మాట్లాడినా ఆయనపై విశ్వాసంతో అయన చెప్పినట్లే చేశారు. దానితో ఆ బాధ పూర్తిగా తగ్గిపోయింది.
బాబా సర్వజ్ఞతను పరీక్షించుట:
ఒకసారి ఒక భక్తుడు బాబాకు రెండు రూపాయిల దక్షిణ పంపించడం జరిగింది. బాబా అప్పుడు అక్కడ లేకపోవడంతో శ్యామా సంతకం చేసి ఆ డబ్బులు తీసుకున్నాడు. బాబాని పరిక్షీద్దామని ఆ డబ్బులను మశీదులో ఒక చోట పాతిపెట్టాడు. బాబా ఆ రెండు రూపాయల విషయం ఏమి అనలేదు.
కొన్ని రోజులు గడిచిన తర్వాత శ్యామా ఇంటిలో దొంగలు పడి సర్వం దోచుకుపోయారు. అప్పుడు శ్యామా బాబా దగ్గరకు వెళ్ళి డబ్బులు పోయిన సంగతి చెప్తాడు. అప్పుడు బాబా “నీకు చెప్పుకోవడానికి నేను ఉన్నాను, నా రెండు రూపాయలు పోయి ఆరు నెలలు అయింది, నేనవరితో చెప్పుకోవాలి” అని అన్నారు.
“అంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్షా” అన్నారు శ్యామా.
“నీలాంటి ఉద్యోగికి అదెంతో, నాలాటి ఫకీర్ కు రూ. 2/- అంతే” అన్నారు బాబా. (కర్మ సూత్రం యెంత సుక్ష్మమో కదా!)
శ్యామా బాబా యొక్క సర్వజ్ఞత్వం అర్ధం చేసుకున్నాడు. అప్పటి నుంచి తను దేహం చాలించినంత వరకు బాబాపై నమ్మకం చెక్కుచెదరలేదు. మనం ఇక్కడ నేర్చుకోవలసినది చాలా ఉంది. మనము ఒకసారి గురువును నమ్మితే ఆ నమ్మకం ఎప్పటికి పోకూడదు. ఎట్టి పరిస్థితులలో అది సడలకూడదు.
రేపు తరువాయి బాగం…
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- మాధవరావు దేశ్‌పాండే ఉరప్ శ్యామా నాల్గవ భాగం ….
- మాధవరావు దేశ్‌పాండే ఉరప్ శ్యామా ఆరవ భాగం ….
- మాధవరావు దేశ్‌పాండే ఉరప్ శ్యామా తొమ్మిదవ భాగం ….
- మాధవరావు దేశ్‌పాండే ఉరప్ శ్యామా ఏడవ భాగం ….
- మాధవరావు దేశ్‌పాండే ఉరప్ శ్యామా రెండవ భాగం ….
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments