మాధవరావు దేశ్‌పాండే ఉరప్ శ్యామా నాల్గవ భాగం ….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి….

మాధవరావు దేశ్‌పాండే ఉరప్ శ్యామా నాల్గవ భాగం ….

నిత్యం మధ్యాహ్న ఆరతి అయ్యాక శ్యామా బాబా వద్దకు వెళ్లి “దేవా! మీరు లేచి మీ స్టానంలోకి వెళ్ళండి. భక్తులు సమర్పించే నైవేద్యాలు స్వీకరించి అవన్నీ కలిపి అందరికి ప్రసాదంగా పంచండి” అని చెప్పేవారు. వెంటనే బాబా బుద్ధిమంతుడైన పిల్లవానిలా నింబార్ వద్దకు వెళ్లి కూర్చుని అతను చెప్పినట్లు చేసేవారు. 

బాబా శ్యామాను ఎంతో ప్రేమగా చూసుకొనేవారు. సాయింత్రం అయ్యాక ఎవరో కొద్దిమంది సన్నిహిత భక్తులకు తప్ప బాబా ఎవరిని మశీడులోకి రానిచ్చేవారు కాదు. కానీ శ్యామా ను మాత్రం యేదేచ్చగా ఏ సమయంలోనైనా రానిచ్చేవారు.

నూల్కర్ తుదిశ్వాస విడిచే ముందు బాబా పాద తీర్థం తెచ్చుట

తాత్యాసాహేబ్ నూల్కర్ తుదిశ్వాస విడిచే ముందు అర్ధరాత్రి బాబా పాద తీర్థం కావాలని అడిగారు. ఆ వేళగాని వేళ మశీదుకు వెళ్లి బాబాను నిద్రలేపి అయన పాద తీర్ధం తీసుకొనేందుకు ఎవరు ధైర్యం చేయలేకపోయారు.

అప్పుడు శ్యామ పూనుకుని, నెమ్మదిగా మశీడులోకి ప్రవేశించారు. అది చూచిన బాబా అతనిని తన్నాలని కాలు పైకెత్తారు. అయన కోపాన్ని పట్టించుకోకుండా అతడు తనతో సిద్ధంగా తీసుకు వెళ్ళిన నీటి పాత్రలో వారి బొటనవ్రేలు ముంచుకొని మరుక్షణమే పరుగేత్తిపోయాడు.  ఆ తీర్ధం నోట్లో పోయగానే నూల్కర్ ఎంతో తృప్తిగా ప్రాణం విడిచారు.

శ్యామా ఒకసారి బాబాపై నమ్మకం కుదిరిన తరువాత సాయికి పరమ భక్తుడు అయ్యాడు. ఇక వెనుదిరిగి చూడలేదు. ప్రతి పని బాబా అనుమతి లేకుండా చేసేవాడు కాదు. బాబా అంటే ప్రాణం తన సర్వస్వంగా బావించాడు.

అందుకే బాబా కూడా శ్యామాతో ఎంతో చనువుగా ఉండేవారు. ఎవ్వరు అడగలేని కొన్ని ప్రశ్నలు శ్యామా ద్వారా మనకు లభించినవి. అటువంటి ప్రత్యేక సంఘటనలను పరిశీలిద్దాము.

బాబా మూడురోజుల సమాధి రహస్యం

సాయి 72 గంటల సమాధి అనంతరం భక్తులందరు చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు. కాని ఎవ్వరు బాబాను దానికి సంబందించిన విషయాలు అడగలేక పోయారు. అప్పుడు శ్యామా పరుగున వచ్చి దేవా మీరు ఎక్కడకు వెళ్ళారు?  ఏంచేసారు?  అని ప్రశ్నల వర్షం కురిపించాడు.

అప్పుడు బాబా ఇట్లా చెప్పారు. బాబా నవ్వి, “అల్లాహ్ వద్దకెళ్ళాను. మొదట నేను తిరిగి రాదలచలేదు కాని అల్లాహ్ “నీవు చేయదలసినదెంతో వున్నది. బెంగాల్ లో గదాధరుడు అనే భక్తుడు నాలో కలవాలని ఆరాట పడుతున్నాడు. కాని అతని పుణ్యఫలం, అవతార కార్యం యింకా  మిగిలాయి, నీవవి తీసుకొని అతనిని విడుదలచేసి, నీ స్థలానికి వెళ్ళు’ అన్నారు. నేనలానే చేసాను” అన్నారు.

ఆశ్చర్యంతో శ్యామాకు మాట పెగల్లేదు. తెల్లవారుతూనే సాయి ఎప్పటిలా తమ నిత్యకృత్యానికుపక్రమించారు. ఖండయోగం సిద్ధించిన సాయికి యిది ఒక లెక్కా. ఆ రోజు రాత్రి 1 గం 2 ని||లకే శ్రీరామకృష్ణ పరమహంస నిర్యాణమయ్యారు. వారి అసలు పేరు గదాధరుడు. 

ఈ గదాదరుడే రామకృష్ణ పరమహంస. ఆయన రాత్రి గం.1.02 నిమిషాలకు మహాసమాధి అయితే అదే రాత్రి బాబా 3 గంటలకు బాబా మూడు రోజుల తరువాత సమాధి నుండి బయటకు రావడం జరిగింది. 1886వ సంవత్సరం తరువాత బాబా లీలలు నలుదిశలా వ్యాపించి చాలా మంది భక్తులు ఆయన కృపకు పాత్రులయ్యారు.

త్రిమూర్తుల దర్శనం

ఒకరోజు శ్యామా బాబాను వైకుంఠం, కైలాసం, బ్రహ్మలోకం అనేవి నిజమా? అని ప్రశ్నించారు.  భగవంతుని ముందు అవి అల్పాలని, అశాశ్వతములని, వాటిని పట్టించుకోవద్దనీ చెప్పినా అతడు వినలేదు. అప్పుడు బాబా ఏమి సమాధానం ఇవ్వకుండా శ్యామాను తన దగ్గరకు రమ్మని పిలిచారు.

బాబా శ్యామా తలపై చేయిపెట్టారు. సాయి, శ్యామాకు బ్రహ్మలోకం చూపించారు. శ్యామా బ్రహ్మదేవుని రత్నఖచిత సింహాసనం, వారి కొలువును దర్శించడం జరిగింది. ఆ సత్యలోక దర్శనం వర్ణించటానికి  వీలుకానిదీ అని తర్వాత శ్యామా చెప్పడం జరిగింది.

అట్లానే విష్ణులోకం మరియు కైలాసం కూడా చూపించడం జరిగింది. శ్యామాకు ఈ సుందర దృశ్యాలు చూసి ఆనందంతో పాటు భయం కూడా కలిగింది. ఈ విశ్వరూప దర్శనంతో శ్యామా బాబా ముందు అర్జునుడు లాగా భయపడుతూ కూర్చున్నాడు.

ఆ సాయి కృష్ణుడు తన అభయ హస్తంతో శ్యామాను సంయమన  పరిచి ఈ విధంగా చెప్పారు. “”మనం కోరవలసినది వీటికతీతమైనది. శ్యామా ఈ లోకాలన్ని మనకి కాదు, మన లక్ష్యం వేరు ఆ లక్ష్యం వైపే మన దృష్టి ఉండాలి”.

ఇక్కడ బాబా ఆత్మసాక్షాత్కారం గురించి చెప్పడం జరిగింది. మానవుడు ఎప్పుడూ ఈ లక్ష్యాన్ని మరచిపోకూడదు. ఈ లక్ష్యం మనం మరచినప్పుడు, మన ఆత్మహత్య చేసుకున్నట్లే అని మన శాస్త్రాలు చెప్పాయి. ఇక్కడ కూడా మనలను బాబా సరియైన దారిలో నడిపించడానికే ప్రయత్నించారు.

రేపు తరువాయి బాగం…

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s  : శ్రీనివాస మూర్తి 9704379333,   సాయి సురేష్ 8096343992

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles