మాధవరావు దేశ్‌పాండే ఉరప్ శ్యామా ఆరవ భాగం ….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి….

మాధవరావు దేశ్‌పాండే ఉరప్ శ్యామా ఆరవ భాగం ….

ఒక రోజు కొందరు యువకులు బాబాను ఫోటో తీసుకుంటామని శ్యామాను అడిగారు. బాబా లెండీ నుండి వచ్చేటప్పుడు సాఠేవాడ వద్ద నిలుపుతానని, అప్పుడు ఫోటో తీసుకోమనీ వాళ్ళతో శ్యామా చాటుగా చెప్పాడు.

తర్వాత లెండీ నుండీ తిరిగివస్తూ బాబా, “శ్యామా! ఏమిటీ గోల? ఫోటో తీయవద్దని పిల్లలకు చెప్పు! అడ్డుగోడ కూలదోస్తే అదే చాలు!” అని గబగబ వెళ్ళిపోయారు. ఆ యువకులు ఏ మధ్యవర్తినీ ఆశ్రయించక బాబానే ఆశ్రయిస్తే పని జరిగేదేమో. రాగద్వేషాలు విడిచి, అందరిలోనూ బాబా వున్నారని గుర్తుంచుకొనడమే అడుగోడలు తొలగించుకోవడమంటే.

సప్తశృంగీ దేవి మొక్కు

ఒకప్పుడు శ్యామా తల్లి శ్యామాకు జబ్బు చేస్తే ఆ దేవికి మ్రొక్కుకున్నది, మరొకప్పుడు వెండి కుచములు చేయించి సప్తశృంగీ దేవికి సమర్పించుకోనుటకు మ్రొక్కుకున్నది గాని, తీర్చలేదు.

30 సంవత్సరముల తర్వాత ఒక జ్యోతిష్కుడు శ్యామా వాళ్ళ కుటుంబంలో కష్టములకు మొక్కు తీర్చకపోవటమే కారణమని చెప్పాడు. శ్యామా ఆ మొక్కులు బాబాకే సమర్పించబోతే ఆయన, వాటిని వణిలోనే చెల్లించాలని చెప్పారు.

శ్యామా బాబా ఆదేశానుసారం వాణి లో సప్తశృంగీ దేవికి వెండి కుచములు సమర్పించి మొక్కు తీర్చుకున్నాడు. వాణిలోని సప్తశృంగీ దేవి పూజారి కాకాజీ వైద్య షిరిడి దర్శించావలేననే ప్రయత్నంలో ఉన్న సమయంలో బాబా శ్యామాను అచటకు పంపుట, కాకాజీ వైద్య శ్యామాతో షిర్డీ వచ్చుట అంత బాబా లీల.

గురుపూర్ణిమ

సం: 1908లో ఒకరోజు పండరి నుండి వచ్చిన కృష్ణజీ నూల్కర్ చావడిలో వున్నారు. బాబా శ్యామాతో, “ఆ ముసలయ్య (నూల్కర్) ను ధునివద్ద స్తంభాన్ని పూజించుకొమ్మని చెప్పు” అని అతడు చెప్పి రాగానే, “మీరంతా గూడా చేసుకోరాదా!” అన్నారు సాయి.

దేవా! మీకైతే చేస్తాము గాని, స్తంభాన్నెందుకు పూజిస్తాము? అన్నాడు శ్యామా, మొదట అంగీకరించని బాబా అతడు పట్టుబట్టినమీదట ఒప్పకున్నారు.  ఇంతలో నూల్కర్ పంచాంగం చూస్తే, నాడు (వ్యాస) గురుపూర్ణిమ!

తాత్యా, దాదాకేల్కర్, శ్యామా మొదలైన వారు సాయికి ధోవతులిచ్చి పూజించారు. అప్పటినుండి శిరిడీలో గురుపూర్ణిమ చేసుకోవటం ఆచారమైంది. ఈ విధంగా బాబా గురువుగా పూజలందుకొనుట ప్రారంభించారు.

ఇచ్చట గమనించవలిసిన విషయమేమనగా, బాబా ఈ పూజను నూల్కర్ కు చెప్పమనుటలో సరియైన గురు విధానమును తన భక్తులకందించి సుస్తిరపరచుటకు చెప్పక చెప్పిన లీల. “సాయి నోటిమీదుగా భక్తులకు చేసుకోమని చెప్పిన ఉత్సవమిదొక్కటే”. ఇది అన్నిటికన్నా ముఖ్యమని చెప్పుటయే కదా!

గ్రంథ సేకరణ

బాబా కొన్ని గ్రంథాలను శ్యామాకు ఇవ్వడం జరిగింది. చాలామంది భక్తులు బాబా ఆశీర్వాదం కోసం కొన్ని గ్రంథాలను తెచ్చేవారు. బాబా చాలా వరకు వారి గ్రంథాలు వారికి ఇచ్చేవారు. కొన్నిసార్లు ఒకరు తెచ్చిన గ్రంథాలు ఇంకొకరికి ఇచ్చేవారు.

బాబా సర్వజ్ఞుడు. మనము ఏది, ఎప్పుడు చదవాలో ఆయనకు బాగా తెలుసు. అట్లా తెచ్చిన వాటిలో కొన్నింటిని శ్యామాకు ఇచ్చి, జాగ్రత్తగా భద్రపరచమని చెప్పేవారు. షిరిడి పవిత్ర క్షేత్రానికి దేశదేశాల నుండి భక్తులు వచ్చి ఇక్కడ కలసి జ్ఞానయజ్ఞం చేస్తారు. అప్పుడు ఈ గ్రంథాలు అవసరమవుతాయి.

నేను నా ధామానికి వెళ్ళిపోయాక శ్యామా దీనిని తీసి చూపుతాడు. ఈ గ్రంథాలు నా ప్రతిరూపాలు అవుతాయి. పరమపావనమైన ఈ గ్రంథాలు షిర్డిలో కాని, ఇతర ప్రదేశాలలో కాని చదివితే బాబా గుర్తుకు వస్తారు. పుస్తకాల సంగ్రహణకు కారణం ఇదే అయి ఉంటుందని హేమద్‌పంత్ సాయిసచ్చరితలో రాస్తారు.

బాబా శ్యామాకు ఇచ్చిన గ్రంథాలు

  • విష్ణు సహస్రనామము
  • ఏకనాధ్ భాగవతం
  • వివేక సింధూ
  • పంచరత్న గీత
  • సంత్‌లీలామృతము
  • భక్త లీలామృతము
  • దశావతార స్తోత్రాలు
  • దశావతార చిత్రాలు

బాబా రోజు తమ కోచ్చే దక్షిణలు ఉమారు రు. 500/-  సంధ్య హారతి అయ్యాక భక్తులకు, పేదసాదలకు పంచేవారు. కొందరు భక్తులకు రోజు ఒకే మొత్త్తం ముట్టేది. కానీ మహాల్సాపతి, శ్యామాకు మాత్రం ఎప్పుడూ ఏమి ఇచ్చేవారు కాదు.

శ్యామా ఒకనాడు, “బాబా. నీవెందరికో సిరిసంపదలిచ్చావు. నాకివ్వలేదేమి? నీవుగూడ చింకి గుడ్డలేసుకొని పాత మశీదులో గోనెమీద నిద్రిస్తావు. పీనాసివి. తిండిగూడ ఇతరులను అడుక్కుంటావు. నిన్నందరూ దేవుడంటారు. నిజానికి నిన్నొక దేవుణ్ణి చేసింది మేమే. మేము కాదంటే అడిగేదెవరు?” అన్నాడు.

సాయి ఎంతో ప్రేమగా, “సిరిసంపదలు నీకు తగవు. నీకివ్వవలసినది వేరు” అన్నారు.  ఒకసారి సింథీ వర్తకుడొకడు శ్యామాకు బంగారు నాణాలు సమర్పించబోతే, సాయి అతనిని కఠినంగా వారించారు! అతనికివ్వదలచినదేమో సాయి తమ చర్యలలో సూచిస్తున్నారు.

రేపు తరువాయి బాగం…

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles