Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి….
మాధవరావు దేశ్‌పాండే ఉరప్ శ్యామా ఎనిమదవ భాగం ….
నిన్నటి తరువాయి బాగం…
అప్పుడు దయతో బాబా రామదాసితో నిట్లు పలికెను. “ఓ రామదాసీ! యేమి సమాచారము? ఎందులకు చీకాకుపడుచున్నావు? శ్యామా మనవాడు కాడా? అనవసరముగా వాని నేల తిట్టెదవు? ఎందుకు జగడ మాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాటలాడలేవా?
ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయచుంటివి గాని, యింకను నీ మనస్సు అపవిత్రముగాను, అస్వాధీనముగాను ఉన్నట్లున్నది. నీ వెట్టి రామదాసివయ్యా? సమస్తవిషయములందు నీవు నిర్మముడవుగా నుండవలెను.
నీవా పుస్తకమును అంతగా నభిలషించుట వింతగా నున్నది. నిజమైన రామదాసికి మమత కాక సమత యుండవలెను. ఒక పుస్తకము కొరకు శ్యామాతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలములో కూర్చొనుము. ధనమిచ్చిన పుస్తకము లనేకములు వచ్చును, కాని మనుష్యులు రారు.
బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తింపుము. నీ పుస్తకము విలువ యెంత? శ్యామాకు దానితో నెట్టి సంబంధము లేదు. నేనే దానిని తీసికొని వాని కిచ్చితిని. నీ కది కంఠపాఠముగా వచ్చును కదా! కావున శ్యామా దానిని చదివి మేలు పొందు ననుకొంటిని. అందుచే దాని నతని కిచ్చితిని.”
బాబా పలుకులెంత మధురముగా, మెత్తగా, కోమలముగా అమృత తుల్యముగా నున్నవి! వాని ప్రభావము విచిత్రమయినది.
రామదాసి శాంతించెను. దానికి బదులు పంచరత్నగీత యను గ్రంథమును శ్యామా వద్ద తీసికొనెదననెను. శ్యామా మిక్కిలి సంతసించెను. “ఒక్కటేల? పది పుస్తకముల నిచ్చెద” ననెను. ఈ విధముగా బాబా వారి తగవును తీర్చెను.
ఇందు ఆలోచించవలసిన విషయమేమన రామదాసి పంచరత్నగీత నేల కోరెను? అతడు లోనున్న భగవంతుని తెలిసికొనుట కెన్నడు యత్నించి యుండలేదు. ప్రతినిత్యము మత గ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు, శ్యామాతో బాబా యెదుట ఏల జగడమాడెను?
మనము ఎవరిని నిందించవలెనో, యెవరిని తప్పుపట్టవలెనో పోల్చుకొనలేము. ఈ కథ నీ విధముగా నడిపించకపోయినచో ఈ విషయము యొక్క ప్రాముఖ్యము, భగవన్నామ స్మరణ ఫలితము, విష్ణుసహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామాకు తెలిసియుండవు.
బాబా బోధించు మార్గము, ప్రాముఖ్యము కలుగజేయు విషయములు సాటిలేనివి. తరువాత శ్యామాకు బాగా నిష్ఠ కుదిరి దీక్షిత్ మరియు నార్కెల సాయంతో మెల్లగా విష్ణుసహస్ర నామం నేర్చుకొని తరించాడు. ఇక్కడ బాబా విష్ణుసహస్రనామం యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా చెప్పారు.
విష్ణుసహస్రనామాలను స్వహస్తాలతో శ్యామా కంఠానికి కట్టి అతని భవ, భయ, బాధల నుండి ముక్తుణ్ణి చెయ్యాలని ఆ పుస్తకం శ్యామాకు ఇవ్వడం జరిగింది. బాబా ఇంకా ఇలా చెప్పారు.
“అతనికి నామంపై ప్రీతి కలిగిస్తాను. నామం పాపాలనే పర్వతాలను పగలగొట్టుతుంది. నామం శరీర బంధనాలను విడగొట్టుతుంది. నామం కోటి చెడు వాసనలను సమూలంగా పెరికివేస్తుంది. నామం కాలుని మెడను విరిచేస్తుంది. నామం జనన మరణ చక్రాన్ని తప్పిస్తుంది”. శ్యామాకు ఇటువంటి సహస్రనామం మధురమవ్వాలి.
ప్రయత్న పూర్వకంగా నామాన్ని స్మరిస్తే మంచిది. అప్రయత్నంగా నామ జపం చేసినా చెడు కలగదు. తెలియకుండా నోటితో ఉచ్చరించినా నామ ప్రభావం ప్రకటమవుతుంది. అంతఃకరణాన్ని పరిశుద్ధ పరచడానికి నామం కంటే సులభమైన మరో సాధనం లేదు. నామం జిహ్వకు భూషణం. నామం పరమార్ధాన్ని పోషిస్తుంది.
నామ జపానికి స్నానం చేయాల్సిన పనిలేదు. అట్లే నామానికి విధి విధానాలేవి లేవు. నామ సంకీర్తనలో సకల పాపాలు ప్రక్షాలన మవుతాయి. మెల్లమెల్లగా లోలోపల నా నామాన్ని జపించే వారు ఉత్తమ గుణ సంపన్నులకంటే ఉత్తములు.
సాయి బంధువులారా! మరి మనమందరమూ సాయి నామం తోనే తరించవచ్చు. సాయి మనలను సరయిన మార్గంలో నడిపిస్తారు.
రేపు తరువాయి బాగం….
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- మాధవరావు దేశ్‌పాండే ఉరప్ శ్యామా తొమ్మిదవ భాగం ….
- మాధవరావు దేశ్‌పాండే ఉరప్ శ్యామా మూడవ భాగం ….
- మాధవరావు దేశ్‌పాండే ఉరప్ శ్యామా మొదటి భాగం ….
- మాధవరావు దేశ్‌పాండే ఉరప్ శ్యామా ఏడవ భాగం ….
- మాధవరావు దేశ్‌పాండే ఉరప్ శ్యామా ఆరవ భాగం ….
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments