మాధవరావు దేశ్‌పాండే ఉరప్ శ్యామా తొమ్మిదవ భాగం ….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి….

మాధవరావు దేశ్‌పాండే ఉరప్ శ్యామా తొమ్మిదవ భాగం ….

నిద్రలో బాబా జపం

కపర్డె గారు శ్యామా నిద్ర గురించి ఈ విధంగా రాశారు. అది డిశంబరు 8, 1911 వ సంవత్సరం. ఆరోజు కార్యక్రమాలన్ని పూర్తి అయిన తర్వాత దీక్షిత్ వాడా అందరు వరండాలో కూర్చున్నారు. బొంబాయి నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు చక్కగా భజన్లు పాడారు. భీష్మ కూడా ఒకటి రెండు భజనలు పాడారు. మాధవరావ్ ఆరోజు అక్కడే పడుకున్నారు. నేను కళ్ళారా చూసి నా చెవులతో విని ఆశ్చర్యపోయాను. ప్రతిసారి ఆయన గాలి తీసుకుని వదిలేటప్పుడు చక్కగా ఈ శబ్దం వినిపిస్తోంది.

 శ్యామ నిద్రించునపుడు ప్రతి ఉచ్చ్వాస-నిశ్వాసములోను స్పష్టంగా “సాయినాధ్ మహారాజ్, సాయినాద్ బాబా” అను శబ్దములు వినపదినవి. ఇటువంటి అద్భుతమైన సంఘటన చూడడం ఆయన అదృష్టంగా భావించారు.

శ్యామా గాఢ నిద్రలో కూడా బాబా నామం ఆయన గురకలో పలకడం ఎంతటి భాగ్యము. ఈ స్థితి పొందుటకు శ్యామా ఎంతయో సాధన చేసి ఉండవలెను. 1911 నాటికీ ఈ స్థితిలో యున్న శ్యామా బాబా సమాధి  నాటికీ ఇంక ఎట్టి స్థితిని పొందియుండేనో!

బాబా మహాసమాధి తర్వాత శ్యామా జీవితం

బాబా మహా సమాధి చెందాక శ్యామా పూర్వపు రోజులు స్మరించుకొని బాబా తననేంతగా ప్రేమించారోనని తలుచుకుంటూ కన్నీరు కార్చేవారు. సాయి దేహంతో ఉన్నప్పుడు అతి చనువు వలన వారిని చాలినంత భక్తీ శ్రద్ద లతో పూజించాలేకపోయానని శ్యామా పరితపించారు.

తను వారితో అతి చనువుగా, పెంకిగా ప్రవర్తించినదీ , వాదించినది, తగువులడినది, పరుషంగా మాట్లాడినది గుర్తు తెచ్చుకొని ఏంతో పరితపించేవారు. తనాలా బాబాను ఎంతగా బాధించాడో, అంతటి పూర్ణ భగవత్స్వరూపి పిన్నలు-పెద్దలు, పేదలు-ధనికులు అన్న భేదామేలేక అందరితో కలిసి మెలసి సంచరించడమేగాక, తననెంతగానో ప్రిమించి, తాను కోరినదల్లా ఎలా నేరవేర్చారో భక్తులకు చెబుతూ కంటతడి పెట్టేవారు.

బాబా తమ మహా సమాధి తర్వాత గూడా అతనిని మరువక కంటికి రెప్పలా అతనిని కాపాడుతూ వచ్చారు.  అయన ప్రసాదించిన ఊధి పొట్లం శ్యామా ప్రాణప్రదంగా పూజలో పెట్టుకున్నారు.

అతడు బొంబాయి వెళ్ళినప్పుడు ఒకరాత్రి బాబా కలలో కనిపించి “నేనిచ్చిన ఊధి పొట్లం రోడ్డు పక్కన చెత్తకుండిలో ఉన్నది. త్వరగా వెళ్ళు!” అని హెచ్చరించారు. శ్యామా ఇల్లు చేరి చూస్తే పూజలో ఆ పొట్లం లేదు. ఇల్లు సర్డడంతో దానినేవరో తీసారు. ఇంటి ప్రక్కనున్న చెత్తకుండిలో చుస్తే పొట్లం దొరికింది.

బాబా మహా సమాధి అనంతరం శ్యామా ధీక్షిత్ వాడాలో ఉన్నారు. అప్పట్లో ధీక్షిత్ మరియు బూటి ఈ వ్యవహారాలు చూసేందుకు జీతం కూడా ఇచ్చేవారు. శ్యామా అక్కడే ఉండి వచ్చే యాత్రికులకు వీలైనంత సహాయం చేస్తుండేవాడు. తనకు బాబా ఇచ్చిన ఊధిని రెండు కుండల్లో జాగ్రత్తగా భద్రపరచి, వచ్చిన వారికి ఇస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఈ ఊధి బాబా స్వయానా శ్యామాకు ఇచ్చింది. 

1922లో సాయి సంస్థాన్ ఏర్పడడం జరిగింది. ఆ సంస్థాన్‌లోని సభ్యులకు శ్యామాకు కొన్ని విషయాల్లో అవగాహన కుదరక, శ్యామాను వాళ్ళు ధీక్షిత్ వాడా నుంచి పంపించవలసి వచ్చింది.

అప్పుడు శ్యామా బాబా పాదుకలను మరికొన్ని వస్తువులను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. సంస్థాన్ వారు ఆ వస్తువులను అడిగినా శ్యామా  ఇచ్చేందుకు ఇష్టపడలేదు. తరువాత ధుమాలు మొదలైన వారు, ఒక ఊరేగింపుగా భజన్లు చేస్తూ శ్యామా ఇంటికి వెళ్ళి ఆ వస్తువులను అడిగి తీసికొని వచ్చారు. ఆ తరువాత ఆ పాదుకలను ద్వారకామాయిలో భక్తుల దర్శనార్ధం ఉంచడం జరిగింది.

శ్యామా తరువాత తన ఇంటిలోనే ఉంటూ, వచ్చిన భక్తులకు బాబా విషయాలను వివరిస్తూ బాబాను సేవిస్తూ గడిపారు. ఆవిధంగా ప్రశాంత జీవితంను గడుపుచూ చివరి దశలో బాబాగారిని స్మరిస్తూ తనువు చాలి౦చారు. 1940  ఏప్రియల్ 16  పవిత్రమైన గురువారం నాడు  తన 80వ ఏట సాయి సన్నిధికి చేరారు.

మొదట బాబాను విశ్వసించక పోయినను క్రమక్రమంగా 1881 నాటికీ బాబాను ఆశ్రయించి బాబా యందు విస్వసంను పెంచుకుంటూ, బాబా తనకు అప్పచెప్పిన కార్యములను సక్రమముగా నిర్వహించుచూ బాబా అనుగ్రహంను పొందిన అంకిత భక్తుడు శ్యామా. ఇతనికి బాబా తమతో 72  జన్మల సంబంధం ఉందని చెప్పారు. ఈ 73వ జన్మ యందు తప్పక బాబా సద్గతి ఇచ్చి యుందురనుటలో సందేహమే లేదు.

నిరంతరం సాయి స్మరణలో జీవించిన శ్యామాను ఇప్పటి సాయి భక్తులు ఆదర్శంగా తీసుకోవలెను. సాయి వద్ద ఉండుటయే కాదు,తన ఉచ్చ్వాస నిశ్వాసములలో సాయి నామ స్మరణయే సాయి సన్నిధి. ఇప్పుడు ఆ విధంగా సాయి స్మరణతో జీవించువారు సాయి సన్నిధిలో ఉండువారు ఏరి?

రేపటి బాగంలో శ్యామా కుమారుడు ఉద్ధవరావ్ దేశ్ పాండే గురించి.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles