మాధవరావు దేశ్‌పాండే ఉరప్ శ్యామా మొదటి భాగం ….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

మాధవరావు దేశ్‌పాండే ఉరప్ శ్యామా మొదటి భాగం ….

సాయి భక్తులందరిలోకి శ్యామాకు ప్రత్యేక స్థానం ఉంది. బాబానే స్వయంగా ఈ విషయం చాలాసార్లు చెప్పడం జరిగింది. వారి ఇద్దరి మధ్య 72 జన్మల సంబంధం ఉందని బాబానే స్వయంగా చెప్పారు. అట్లానే శ్యామాని తన ప్రతినిధిగా కొన్ని సార్లు బాబా పంపించడం జరిగింది. మరి ఇంతటి గౌరవాన్ని పొందిన భక్తుడు శ్యామా.

అచంచల విశ్వాసముతో అపారమైన నమ్మకంతో బాబాను సేవించిన వారిలో మొట్టమొదటి వ్యక్తి శ్యామా. తనని పాము కరచి ప్రాణాపాయ స్థితిలో కూడా బాబాని తప్ప మరెవరిని నమ్మని భక్తితత్పరత శ్యామాలో ఉంది. బాబా నేర్పిన శ్రద్ధ, సబూరి తత్వాన్ని శ్యామా దగ్గర నుంచి మనము నేర్చుకోవాలి. అటువంటి మహానుభావుడి గురించి మనము తెలుసుకోవడం మన పూర్వజన్మ పుణ్యం మరియు బాబా అనుగ్రహం ఉండటం వల్ల మనకు ఈ సత్సంగ భాగ్యం లభించింది.    

మాధవరావు దేశ్‌పాండే సుమారుగా 1858-1860 ప్రాంతంలో పుట్టి ఉండవచ్చు. ఆయనకు బాబా పెట్టిన ముద్దుపేరు శ్యామా. ఆయన షిరిడికి 20 మైళ్ళ దూరంలో ఉన్న నిమోన్ అనే గ్రామంలో పుట్టారు. శ్యామా తండ్రి మూడు వివాహాలు చేసుకున్నా సంతానం కలగలేదు.

చివరికి ఆయన షిరిడి గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే ఆయన సోదరిని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వారికి పిల్లలు పుట్టారు. శ్యామాకు కాశీనాధ్, బాపాజి బల్వంత్ అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. శ్యామా 2 సంవత్సరాల వరకు నిమోన్ గ్రామంలో పెరిగారు. తరువాత వారి కుటుంబం షిర్డికి వచ్చి స్థిరపడింది.

శ్యామా తన మూడవ సంవత్సరం నుంచి షిర్డిలోనే పెరిగారు. ఆయన 6వ తరగతి వరకు చదివి అక్కడి మరాఠి బడిలోనే ఉద్యోగంలో చేరారు. ఆయనను షిర్డి ప్రజలు చాలా గౌరవించే వారు. ఒక పోలీస్ అధికారి దానంగా ఇచ్చిన ఒక ఇంటిని బడిగా ఉపయోగించేవారు. ఆ బడి బాబా ఉన్న మశీదు ప్రక్కనే ఉండేది.

శ్యామాను గురించిన విషయాలు మనకు బి.వి. నరసింహస్వామి గారు ద్వారా కొన్ని లభించాయి. ఆయన శ్యామాను 1938 మార్చి నెలలో చూడడం జరిగింది. అప్పటికి సుమారుగా శ్యామాకు 80 ఏళ్ళు ఉండవచ్చని ఆయన రాయడం జరిగింది. ఈ సంభాషణల ద్వారా మనకు సచ్చరితలో లేని విషయాలు కూడా కొన్ని తెలియడం జరిగింది.

కొన్ని విషయాలు సాయిలీల పత్రిక ద్వారా మరియు ఖాపర్దే డైరి అనే పుస్తకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. శ్యామాకు, బాబాకు 72 జన్మల సంబంధం ఉన్నప్పటికి చాలా సంవత్సరాలు శ్యామా బాబాని గురువుగా నమ్మలేదు. తను పనిచేసే బడి, మశీదు ప్రక్కనే ఉండేవి. ఇప్పుడు అది శ్యామసుందర్ గదిగా చెప్పబడుతుంది.

బాబాని పరిశీలించుట 

శ్యామా ఒక్కోసారి ఆ బడిలోనే నిద్రించే వాడు. ఆ బడి కిటికీలో నుంచి బాబాను పరిశీలిస్తూ ఉండేవాడు. చాలా సంవత్సరాలు బాబాని ఒక పిచ్చి ఫకీరుగా అనుకునేవాడు. శ్యామా దీన్ని గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది.

“నేనప్పుడు బడిలో టీచర్ ను . ఆయనపై నాకు విశ్వాసముండేది కాదు. రాత్రిపూట స్కూల్లోనే నిద్రించేవాడిని. మశిదులో బాబా ఒక్కరే ఉండేవారు. బడి కిటికీ నుండి మశిదు కనిపించేది. అందరు పిచ్చి పకీరనే సాయి ని ఆ కిటికీ నుండి నేను గమనిస్తుండేవాడిని.

అప్పుడప్పుడు రాత్రిళ్ళు మశీదులో నుంచి మరాఠి, ఉర్డు, హింది, ఇంగ్లీషు బాషలో మాటలు వినబడుతూ ఉండేవి.  అది బాబాయే అయిఉండాలి. కనుక అయన మహిమ గలవాడన్న విశ్వాసం కల్గింది. బాబా ఒక్కోసారి మశీదులో మరొకసారి మారుతి గుడిలో కూర్చునేవారు.

జోలి వేసుకుని భిక్షాటనకు వెళ్ళేవారు. ఆయన కాళ్ళకు గజ్జలు కట్టి నాట్యం చేసేవారు. ఒక్కోసారి చాలా చక్కగా పాటలు పాడేవారు. నేను ఆయన దగ్గరకు చిలుము పీల్చటానికి వెళ్తూ ఉండేవాడిని” అని చెప్పారు.

శ్యామా కుటుంబ వివరాలు 

మాధవరావ్ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మొట్టమొదటి భార్య పేరు సావిత్రిబాయి. ఆమె ద్వారా ఒక కొడుకు పుట్టారు. అతని పేరు ఏకనాథ్‌పంతు. శ్యామా రెండవ భార్య పేరు ద్వారకాబాయి. ఆమెకు ఇద్దరు పుత్రులు (జగన్నాథ్‌పంతు మరియు ఉద్ధవరావ్) ఒక పుత్రిక (బిజితాయి).

వీరిలో ఉద్ధవరావ్ ఎక్కువగా బాబా దగ్గరకు వెళ్ళేవాడు. బాబా ఇచ్చే స్వీట్లు మరియు ఇతర తినుబండారములు కోసం వెళ్ళేవాడు. ఉద్ధవరావు గురించి తర్వాత తెలియజేస్తాను.

రేపు తరువాయి బాగం…

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles